చీపురు పట్టింది మోదీ కాదట
2014 లోక్‌సభ సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారం కోసం, ఎన్నికల తర్వాత వచ్చిన మెజారిటీని ప్రతిబింబించేలా (స్వీప్ చేశారు అనే అర్థం వచ్చేలా) బీజేపీ ఓ ఫోటోను వాడిన విషయం అందరికి గుర్తు ఉండే ఉంటుంది. అందులో బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉన్న పాత తరం నాటి ఫోటోలో మోదీ చీపురు పట్టుకొని ఊడుస్తూ దర్శనమిస్తారు.
కొందరు బీజేపీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో కూడా ఈ ఫోటోను విరివిగా వాడారు. మోదీ నేపథ్యం గురించి చెప్పడానికి, యువకునిగా ఉన్నప్పుడు ఎలా టీ అమ్మారు, ఎన్ని కష్టాలు పడ్డారు, జీవనం గడపడానికి చీపురు కూడా పట్టారు అని చెబుతూ ఈ ఫోటోను వాడుకున్నారు.
ఈ ఫోటో అప్పుడు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే అసలు విషయం ఏమిటంటే ఆ ఫోటోలో ఉన్నది మోదీ కాదని తేలింది. అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఈ ఫోటో విషయమై ఆర్టీఐని ఆశ్రయించారు. దీంతో ఫోటోలో ఉన్నది ప్రధాని నరేంద్రమోదీకాదని ఆర్టీఐ తెలిపింది. అది మార్ఫింగ్ చేసిన ఫోటో అయి ఉండొచ్చని ఆర్టీఐ అధికారులు పేర్కొన్నారు.
మార్ఫింగ్ చేయక ముందు అసలు ఫోటో ఇదే..