Sweeping
-
పిల్లలకు పని చెప్పి హాయిగా కునుకు తీసిన హెడ్ మాస్టర్..
భోపాల్: బాధ్యతగల ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సింది పోయి బడి ఆవరణను శుభ్రం చేయమని పిల్లలకు చెప్పి తాను మాత్రం స్కూలు బ్యాగ్ ను తలదిండుగా చేసుకుని కునుకు తీశాడో ప్రధానోపాధ్యాయుడు. మధ్యప్రదేశ్ చత్తార్ పూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఆదమరచి నిద్రిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లవకుశ నగర్ ప్రాధమిక పాఠశాలలో రాజేష్ కుమార్ అడ్జారియా హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో బయట ఆవరణ శుభ్రం చేయమని చెప్పి వారి చేతికి చీపుర్లు ఇచ్చాడు. ఈ విరామంలో ప్రధానోపాధ్యాయుడు పిల్లల స్కూలు బ్యాగులను తలకింద దిండుగా పెట్టుకుని ఎంచక్కా సేదదీరాడు. ఆడపిల్లలు స్కూలు మొత్తాన్ని శుభ్రం చేస్తుండగా మగపిల్లలు మాత్రం ఆడుకంటూ ఉన్నారు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి చోద్యం మొత్తాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో ఒక చరవాణి నుండి మరోదానికి చేతులు మారుతూ పాఠశాలలో చదువుతున్న పిల్లల బంధువుల చేతికి చేరింది. ఇంకేముంది వారు పిల్లల తల్లిదండ్రులకి విషయాన్ని తెలియజేశారు. బాగుపడుతుందనుకున్న తమ బిడ్డల జీవితం ఇలాంటి అధ్యాపకుల చేతిలో పడితే అంతే సంగతులని భావించి తలిదండ్రులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆ ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోమని డిమాండ్ చేశారు. Caught on camera: #MadhyaPradesh school headmaster takes a nap in classroom while students clean the floor. #viral Watch: https://t.co/dAOjb2JoMT pic.twitter.com/b1Ka8JWnMX — editorji (@editorji) July 15, 2023 ఇది కూడా చదవండి: మంత్రి ఆకస్మిక తనిఖీ.. ఫుల్లుగా తాగి పడుకున్న పంచాయతీ కార్యదర్శి -
టెక్ దిగ్గజాలకు ఊహించని షాక్?
వాషింగ్టన్ : అమెరికాలో టెక్ దిగ్గజ కంపెనీలకు భారీ షాక్ తగలనుంది. ఆపిల్, అమెజాన్ లాంటి దిగ్గజాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నియంత్రణకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు అమెరికా హౌజ్ కమిటీ తన నివేదకను రూపొందించింది. టెక్నాలజీ రంగంలో పోటీని పరిశీలిస్తున్న డెమొక్రాట్ల నేతృత్వంలోని హౌస్ ప్యానెల్, ఆపిల్, అమెజాన్ ఆపిల్ ఇంక్ వంటి దిగ్గజాలు మార్కెట్ స్థలాలను సొంతం చేసుకోవడం, వారి వారి స్వంత ఉత్పత్తుల విక్రయాలకే పరిమితం కావడంలాంటి పద్ధతులకు చెక్ పెట్టేందుకు భారీ సంస్కరణలను ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పోటీ వాతావరణంలో మార్కెట్లో ఆధిపత్యం కోసం ఇవి అమలు చేస్తున్న వ్యూహాల దృష్టి పెట్టింది. డెమొక్రాటిక్ ప్రతినిధి డేవిడ్ సిసిలిన్ నేతృత్వంలోని హౌస్ యాంటీట్రస్ట్ ప్యానెల్ దర్యాప్తు అనంతరం ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది. అంతేకాదు టెక్ కంపెనీలు తమ డేటాను ఒక వెబ్సైట్ నుండి మరొక వెబ్సైట్లోకి సులభంగా తరలించడానికి అనుమతించే చట్టాన్ని కూడా ఇది సిఫారసు చేసినట్టు సమాచారం. పోటీదారులను అణిచివేసేందుకుఈ కంపెనీలు తమ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సిపిలిన్ చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు బలాన్నిస్తున్నాయి. ఈ నివేదిక ఈ వారంలోనే బహిర్గతం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ నివేదికను అమోదిస్తే అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలు ఊహించని పరిమాణాలు తప్పవని నిపుణుల అంచనా. అయితే ఈ నివేదికను ఎంతమంది కమిటీ సభ్యులు ఆమోదిస్తారనేది అస్పష్టం. కాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన అమెరికా హౌజ్ కమిటీ ప్రత్యేక ఉప కమిటీ విచారణకు అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల హాజరైన సంగతి తెలిసిందే. -
మాస్కు పెట్టుకుంటారా? చీపురు పట్టుకుంటారా?
కరోనా వైరస్ పుణ్యమాని మనుషుల మధ్య దూరం పెరిగింది. ముఖం కూడా సరిగా కనిపించకుండా మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. పొరపాటున మాస్కు లేకుండా వెళ్లామో.. జేబుకు చిల్లు పడక తప్పదు, లేదా పోలీసుల చేతిలో చీవాట్లు తప్పవు. అయితే ఓ దేశం మాత్రం తప్పు చేసినవారికే బుద్ధి వచ్చేలా తగిన గుణపాఠం చెబుతోంది. అందుకోసం బలవంతంగా వారితో రోడ్లు శుభ్రం చేసే కార్యక్రమానికి పూనుకుంది. వివరాల్లోకి వెళితే.. మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజొలీనా కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశంలోని పలు నగరాల్లో ఫేస్ మాస్కు ధరించడం తప్పనిసరి చేశాడు. ఈ కొత్త నిబంధన సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ కొంతమంది ఈ మాటలను పెడచెవిన పెట్టి దర్జాగా రోడ్ల మీదకు వచ్చారు. (కరోనా: 189 మంది వలస కార్మికుల మృతి) ఇంకేముందీ పోలీసులు వారిని రౌండప్ చేసి చేతికి చీపురిచ్చారు. "మమ్మల్ని వదిలేయండి, ఇంకోసారి మాస్కు లేకుండా బయటకు రాబోమ"ని చెప్పినప్పటికీ వదల్లేదు. దీంతో చేసిన పాపం ఊరికే పోతుందా అనుకుంటూ భారంగా ఓ నిట్టూర్పు వదులుతూ రోడ్లపై ఊడ్చే కార్యక్రమానికి దిగారు. ఇలా ఒకరిద్దరికి కాదు.. 25 మందికి దుమ్ము దులిపే శిక్షను విధించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదిలా వుండగా ఈ దేశంలో ఇప్పటివరకు 128 కరోనా వైరస్ కేసులు నమోదవగా 75 మంది కోలుకున్నారు. ఇంతవరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు. (సముద్ర వీరుల ప్రపంచ రికార్డు) -
ఊడ్వలేక.. ఏడ్వలేక!
సాక్షి, సిటీబ్యూరో : అవినీతి..అక్రమాలు..తూతూ మంత్రపు పనులతో జీహెచ్ఎంసీకి భారంగా మారిన స్వీపింగ్ మెషిన్లను విక్రయించాలని నిర్ణయించారు. తద్వారా నెలకు ఖాజానాకు రూ.70 లక్షల భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఊడ్చే యంత్రాలతో రోడ్లు కూడా సక్రమంగా శుభ్రం కావడం లేదని, నిధులు మాత్రం ఖర్చవుతున్నాయే విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బల్దియాలో పెద్ద మెషిన్లను ఒక్కోటి దాదాపు రూ.80 లక్షలు, చిన్న మెషిన్లను ఒక్కోటి దాదాపు రూ.20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ పేరిట నిర్వహణ మాత్రం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. అందుకుగాను పెద్ద మెషిన్లకు ఒక్కో దానికి గంటకు రూ. 1400 వంతున, చిన్న మెషిన్లకు గంటకు రూ.750 వంతున చెల్లిస్తున్నారు. అలా ఆరు పెద్ద మెషిన్లు, ఇరవై చిన్న మెషిన్లకు వెరసి నెలకు దాదాపు రూ.72 లక్షలు.. సంవత్సరానికి రూ.9 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు. అయినా ఈ స్వీపింగ్ మెషిన్లు ఊడుస్తున్న మార్గాల్లో రోడ్లు శుభ్ర పడుతున్నాయా అంటే లేదు. స్వీపింగ్ మెషిన్ వాహనాలు అసలు ఊడ్చాల్సిన ప్రాంతాల్లో రోడ్లను ఊడ్చడమే లేదు. ఏదో కొద్దిదూరం మాత్రం తిరిగినట్లు మమ అనిపించి బిల్లులు కాజేస్తున్నారు. తిరిగిన ప్రాంతంలోనైనా సక్రమంగా ఊడుస్తున్నారా అంటే అదీ లేదు. తిరగని దూరానికి, చేయని పనికి నెలనెలా బిల్లులు మాత్రం చెల్లిస్తున్నారు. కాంట్రాక్టు ఏజెన్సీల నుంచి సంబంధిత ఏఎంఓహెచ్లు, ఇంజినీర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఇతరత్రా ఉన్నతాధికారుల దాకా ఎవరి వాటాలు వారికి ముడుతున్నందునే రోడ్లు శుభ్రం కాకున్నా నిధులు మాత్రం స్వీప్ అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఇండోర్లో అమలవుతున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించేందుకు వెళ్లిన మేయర్ బొంతు రామ్మోహన్ అక్కడి స్వీపింగ్ మెషిన్ల పనితీరు చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ ఎంతో శుభ్రంగా రోడ్లను ఊడ్చడమేకాక, ఊడ్చిన వెంటనే దుమ్ము లేవకుండా స్ప్రింకర్ల ద్వారా నీళ్లు కూడా చల్లడం తదితరమైనవి పకడ్బందీగా జరుగుతుండటం పరిశీలించారు. జీహెచ్ఎంసీలోని స్వీపింగ్ మెషిన్ల వాహనాలు అసలు తిరగకపోవడం.. తిరిగినా మూడు చీపుర్లలో ఒక్కటి కూడా సరిగ్గా నేలను తాకకపోవడం ఇటీవల ఐటీ కమిషనర్ ముషార్రఫ్ తనిఖీల్లోనూ వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలు దుబారా అవుతున్నందున.. జీహెచ్ఎంసీ స్వయంగా నిర్వహించలేకపోతున్నందున ఈ మెషిన్లను తీసేయాలని మేయర్ భావించారు. ఈమేరకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ స్వీపింగ్ మెషిన్ల నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకిచ్చి దాదాపు రెండేళ్లు దాటింది. ఒప్పందం మేరకు చేయాల్సిన పనులేవీ చేయకున్నా, జీపీఎస్ పనిచేయకున్నా, ఇతరత్రా నిబంధనలు అమలు చేయకున్నా కాంట్రాక్టును రద్దు చేయవచ్చు. అయినప్పటికీ, కాంట్రాక్ట్ ఏజెన్సీ, అధికారుల పరస్పర సహకారాలతో నిర్వహణ పేరిట బిల్లులు మాత్రం చెల్లిస్తున్నారు. ఈ దుబారాను ఇకనైనా అరికట్టాలని భావించి ఉపయోగం లేని ఈ స్వీపింగ్మెషిన్లను అమ్మేసి, అధునాతనమైనవాటిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రైవేట్ వాహనాలదీ అదే తంతు.. జీహెచ్ఎంసీ స్వీపింగ్ యంత్రాల పరిస్థితి ఇలా ఉండగా, ప్రైవేట్ సంస్థలకు చెందిన స్వీపింగ్ మెషిన్లు దాదాపు 25 ఉన్నాయి. వాటి నిర్వహణకూడా ప్రైవేట్ ఏజెన్సీదే. వాటి పనితీరూ సరిగ్గా లేకపోవడం తనిఖీల్లో గుర్తించారు. చీపుర్లు రోడ్లను తాకకపోవడం, తిరగాల్సినంత దూరం తిరగకపోవడం, లాగ్ బుక్ నిర్వహించకపోవడం తదితర లోపాలున్నాయి. వీటి విషయంలో ఏంచేయాలా అని యోచిస్తున్నారు. తగిన హెచ్చరికలు జారీచేసి నిబంధనల మేరకు ఒప్పందాల కనుగుణంగా పనిచేయకుంటే కాంట్రాక్టు రద్దు చేసే యోచనలో ఉన్నారు. ఇండోర్ మాదిరిగా రోడ్లను సరిగ్గా శుభ్రం చేసే పక్షంలోనే స్వీపింగ్ మెషిన్లను వినియోగించాలని మేయర్ భావిస్తున్నట్లు సమాచారం. రోడ్లపై దుమ్ములేవకుండా, ఇండోర్ మాదిరిగా రోడ్లను శుభ్రం చేసే అధునాతన స్వీపింగ్ యంత్రాలను వినియోగంలోకి తేవడంతోపాటు నిర్వహణ పకడ్బందీగా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని యోచిస్తున్నారు. -
చీపురు పట్టింది మోదీ కాదట
2014 లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారం కోసం, ఎన్నికల తర్వాత వచ్చిన మెజారిటీని ప్రతిబింబించేలా (స్వీప్ చేశారు అనే అర్థం వచ్చేలా) బీజేపీ ఓ ఫోటోను వాడిన విషయం అందరికి గుర్తు ఉండే ఉంటుంది. అందులో బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉన్న పాత తరం నాటి ఫోటోలో మోదీ చీపురు పట్టుకొని ఊడుస్తూ దర్శనమిస్తారు. కొందరు బీజేపీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో కూడా ఈ ఫోటోను విరివిగా వాడారు. మోదీ నేపథ్యం గురించి చెప్పడానికి, యువకునిగా ఉన్నప్పుడు ఎలా టీ అమ్మారు, ఎన్ని కష్టాలు పడ్డారు, జీవనం గడపడానికి చీపురు కూడా పట్టారు అని చెబుతూ ఈ ఫోటోను వాడుకున్నారు. ఈ ఫోటో అప్పుడు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే అసలు విషయం ఏమిటంటే ఆ ఫోటోలో ఉన్నది మోదీ కాదని తేలింది. అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఈ ఫోటో విషయమై ఆర్టీఐని ఆశ్రయించారు. దీంతో ఫోటోలో ఉన్నది ప్రధాని నరేంద్రమోదీకాదని ఆర్టీఐ తెలిపింది. అది మార్ఫింగ్ చేసిన ఫోటో అయి ఉండొచ్చని ఆర్టీఐ అధికారులు పేర్కొన్నారు. మార్ఫింగ్ చేయక ముందు అసలు ఫోటో ఇదే.. -
జిల్లాను చలి పులి వణికిస్తోంది