Tina Dabi.. అందమైన ఆఫీసర్‌గా పేరున్న ఐఏఎస్ అధికారిణి టీనా దాబి అందరికీ సుపరిచితురాలే. ఇటీవలే ఆమె రెండోసారి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఐఏఎస్ టీనా దాబీ, ఐఏఎస్ ప్రదీప్ గవాండేను వివాహం చేసుకున్నారు. కాగా, మరోసారి టీనా దాబి వార్తల్లో నిలిచారు.
అయితే, కలెక్టర్ టీనా దాడి ఫొటోనే వాట్సాప్‌లో వాడుకుంటూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. దీంతో, విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని దుంగార్పూర్‌కు చెందిన ఓ యువకుడు.. ఓ మొబైల్ నెంబర్‌తో వాట్సాప్ ఓపెన్ చేసి, దాంట్లో ఐఏఎస్ టీనా దాబి ఫొటోను డీపీగా పెట్టుకున్నాడు. అనంతం వాట్సాప్‌లో ఆ నెంబర్‌తో గుర్తు తెలియని వ్యక్తులకు మెసేజ్‌లు చేశాడు. అమెజాన్ గిఫ్ట్ కార్డులు పంపాలంటూ చాలా మందికి మెసేజ్‌లు పెట్టాడు. దీంతో, కలెక్టర్ టీనా దాబీనే గిఫ్ట్ కార్డులు అడిగిందే ఏమో అని వారు కూడా రెస్పాన్స్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర అర్బన్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్టు సెక్రటరీ సునితా చౌదరీకి కూడా అమెజాన్ గిఫ్ట్ కార్డు పంపాలంటూ అతడి వాట్సాప్ నుంచి మెసేజ్ వెళ్లింది. దీంతో, ఎందుకైనా మంచిదని ఆమె.. టీనా దాబికి ఫోన చేసి అసలు విషయం అడిగింది. గిఫ్ట్ కార్డు గురించి చెప్పడంతో షాకైన కలెక్టర్ టీనా దాబి.. ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్పీకి తెలియజేసింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. యువకుడిని అరెస్ట్ చేశారు.
CM अशोक गहलोत के बाद अब IAS टीना डाबी के नाम पर ठगी, अफसर से ही मांग लिया गिफ्ट#IAS #Tinadabi https://t.co/zTbOOBvIMM
— Zee Salaam (@zeesalaamtweet) August 9, 2022
ఇక.. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించిన టీనా దాబి.. 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్‌లో టాపర్. కాగా, రెండో ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. ఇక 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: సీఎం యోగితోనే పరాచకాలా.. తేడా వస్తే ఇలాగే ఉంటంది..
Comments
Please login to add a commentAdd a comment