
సాక్షి, నిజామాబాద్ : ఉన్నతాధికారుల టార్చర్ తట్టుకోలేని విధంగా ఉందని, తన సమస్యకు ఆత్మహత్యే మార్గమని నిజామాబాద్ జిల్లా రూద్రుర్ సీఐ దామోదర్ రెడ్డి పెట్టిన వాట్సాప్ మెసేజ్ పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉన్నతాధికారుల టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని దామోదర్ చేసిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 30 ఏళ్లుగా పనిచేసినా బలిదానం తప్పదేమోనని బలహీన క్షణాలు భయం కలిగిస్తున్నాయంటూ మెసేజ్ పెట్టడం చర్చనీయాంశంగా మారిపోయింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలిసింగ్ అని చెప్పినా పోలీసు ఉన్నతాధికారులు వ్యవస్థలోని లోపాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దామోదర్ రెడ్డి పెట్టిన మెజేస్‌తో జిల్లా పోలీస్ వర్గాల్లో కలవరం మొదలైంది. అతన్ని అంతగా ఇబ్బందికి గురి చేసిన అధికారులు ఎవరై ఉంటారని చర్చించుకుంటున్నారు. అయితే, దామోదర్‌రెడ్డికి ఐసీ ఆఫీస్ నుంచి ఛార్జ్‌మెమో జారీ కావడమే ఈ మెసేజ్‌కు కారణమని పోలీసులు వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment