వాట్సప్ మెసేజీలను మావాళ్లు చదవలేకపోతున్నారు | Security Agencies Unable to Decrypt WhatsApp Communications: Prasad | Sakshi
Sakshi News home page

వాట్సప్ మెసేజీలను మావాళ్లు చదవలేకపోతున్నారు

May 2 2016 2:34 PM | Updated on Jul 27 2018 1:39 PM

వాట్సప్ మెసేజీలను మావాళ్లు చదవలేకపోతున్నారు - Sakshi

వాట్సప్ మెసేజీలను మావాళ్లు చదవలేకపోతున్నారు

వాట్సాప్ లాంటి కమ్యూనికేషన్ యాప్ ల మేసెజ్ లను డీక్రిప్ట్(వ్యక్తీకరించడానికి) చేయడానికి భారత సెక్యురిటీ ఏజెన్సీలకు సాధ్యం పడదని కేంద్ర సమాచార, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో తెలిపారు.

న్యూఢిల్లీ : వాట్సాప్ లాంటి కమ్యూనికేషన్ యాప్ ల మేసెజ్ లను డీక్రిప్ట్ (వ్యక్తీకరించడానికి) చేయడానికి భారత సెక్యురిటీ ఏజెన్సీలకు సాధ్యపడదని కేంద్ర సమాచార, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో తెలిపారు. న్యాయపరంగా, టెక్నికల్ గా, రెగ్యులేటరీ పాలసీ వంటి కారణాలతో ఈ వాట్సాప్ మెసేజ్ లను చదివగలిగే ఆకృతులోకి మార్చడం కుదరదని పేర్కొన్నారు. వివిధ అప్లికేషన్ సర్వీస్ ప్రొవేడర్లు కల్పిస్తున్న ఎన్ర్కిప్టెడ్ కమ్యూనిషన్ తో వ్యవహరించేటప్పుడు సెక్యురిటీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.

ఆ అప్లికేషన్లు ఎన్కిప్షన్ టెక్నాలజీని, యాజమాన్య ధృవీకరణ ప్రొటోకాల్స్ ను వాడుతూ మెసేజ్ లను భద్రంగా ఉంచుతున్నాయని పేర్కొన్నారు. మొబైల్ అప్లికేషన్లలో వాట్సాప్ అనేది సమాచారం మార్పిడికి ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉందని, ఇంటర్ నెట్ సేవలు కల్గి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉందని చెప్పారు.


సెక్యురిటీ ఏజెన్సీలు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించి, వాటిని డీక్రిప్ట్ చేయడం సాధ్యపడదని, ఒకవేళ డీక్రిప్ట్ చేయాలనుకున్నా టెక్నికల్ గా, న్యాయపరంగా, రెగ్యులేటరీ పాలసీ పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. టెలికాం సర్వీసు ప్రొవేడర్లతో పాటు సోషల్ మీడియా ప్రొవైడర్లతో రెగ్యులేటరీ  ఎప్పడికప్పుడూ సమావేశమై దేశ భద్రత, అభివృద్ధి అంశాలు, సేవల విషయంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాల అమలు చేస్తుంటాయని చెప్పారు. ఇటీవలే వాట్సాప్ ద్వారా అందించే అన్ని సేవలకు ఎండ్ టూ ఎండ్ ఎన్ర్కిప్షన్ ను ఫేస్ బుక్ తీసుకొచ్చింది. ఉద్దేశించిన గ్రహీతలు మాత్రమే ఈ మెసేజ్ లు చదువుకోగలిగే రీతిలో దీన్ని రూపొందించారు.


ఎన్ర్కిప్షన్ అనేది అత్యంత ప్రాముఖ్యం కల్గిన సాధనమని, ఈ కొత్త డిజిటల్ యుగంలో ప్రభుత్వాలు, కంపెనీలు, వినియోగదారులు భద్రతను, సెక్యురిటీని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్ర్కిప్టెడ్ సర్వీసులకు, లా ఎన్ ఫోర్స్ మెంట్ లకు సంబంధించి చాలా చర్చలు జరిగాయని, అయితే ప్రజల సమాచారాన్ని సైబర్ క్రిమినల్స్, హ్యాంకర్ల దగ్గర్నుంచి భద్రతగా ఉంచడమే లా ఎన్ ఫోర్స్ మెంట్ విధిగా గుర్తించామని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement