security agencies
-
శ్రీలంకలో అర్ధరాత్రి అలజడి.. నిరసనకారులపై విరుచుకుపడిన బలగాలు!
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ దేశ అధ్యక్షుడిగా రణీల్ విక్రమ సింఘే ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే నిరసనకారులపై భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కొలంబోలోనే ప్రధాన క్యాంప్‌పై గురువారం అర్ధరాత్రి వందల మంది ఆ దేశ భద్రతా బలగాలు, పోలీసులు దాడులు చేపట్టారు. అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన నిరసనకారులకు చెందిన పలు టెంట్లను తొలగించారు. అధ్యక్షుడి సెక్రెటేరియట్ భవనం ముందు నిరసనకారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించే పనులు చేపట్టాయి భద్రతా బలగాలు. అయితే.. తాము వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు నిరసనకారులు. ఏప్రిల్ 9 నుంచి అధ్యక్షుడి కార్యాలయం ప్రవేశ ద్వారాన్ని మూసివేసిన వారు.. కొత్త అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘే రాజీనామా చేసే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు. ‘ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడే మాకు విజయం సాధ్యమవుతుంది.’ అని నిరసన బృందాల ప్రతినిధి లాహిరు వీరసేకర పేర్కొన్నారు. సముద్రతీర కార్యాలయాన్ని సైనికులు చుట్టుముట్టారు. ఏప్రిల్ నుంచి వేలాది మంది ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు అవసరమైన సామగ్రిని అందించడానికి ఏర్పాటు చేసిన అనేక తాత్కాలిక నిర్మాణాలను తొలగించినట్లు ఆందోళనకారులు పేర్కొన్నారు. అధ్యక్ష భవనం సమీపంలో తమకు నిరసనలు చేపట్టేందుకు చోటు చూపించాలని డిమాండ్ చేశారు. ‘రణీల్ విక్రమసింఘే మమల్ని చెదరగొట్టాలనుకుంటున్నారు. వారు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. కానీ మేము వదిలిపెట్టం. నీచ రాజకీయాల నుంచి దేశాన్ని విడిపించటమే మా లక్ష్యం.’ అని స్పష్టం చేశారు. #WATCH | Sri Lanka: Tents of protestors being dismantled by the armed security personnel amid a late-night clampdown outside the premises of the Sri Lankan Presidential Secretariat in Colombo pic.twitter.com/yuhRWU0lRj — ANI (@ANI) July 21, 2022 ఇదీ చదవండి: డ్రాగన్ చైనా వల్లే లంకేయులకు ఈ గతి.. ప్రపంచ దేశాలకు ఇదే హెచ్చరిక! -
ఉక్రెయిన్ సెక్యూరిటీ చీఫ్‌కు రష్యాతో లింకులు.. షాకిచ్చిన జెలెన్స్కీ!
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొద్ది నెలలుగా కొనసాగుతూనే ఉంది. రష్యా సేనల బాంబుల వర్షంలో వందల మంది ఉక్రెయిన్ పౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ డొమెస్టిక్ సెక్యూరిటీ, స్టేట్ ప్రాసిక్యూటర్లకు షాక్ ఇచ్చారు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. వారిని విధుల్లోంచి తప్పించారు. వారిపై వందలాది దేశద్రోహం, రష్యాతో సంబంధాల కేసులు ఉన్నాయంటూ పేర్కొన్నారు. మాస్కో మిలిటరీ ఆపరేషన్‌ను తీవ్ర తరం చేసేందుకు వారు సహకరించారని ఆరోపించారు. 'రష్యా ఆక్రమిత ప్రాంతాల్లోని ఎస్‌బీయూ సెక్యూరిటీ సర్వీస్, ప్రాసిక్యూటర్ కార్యాలయాల్లో పని చేస్తున్న 60 మందికిపైగా అధికారులు ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. అధికారులపై 651 దేశ ద్రోహం, రష్యాతో సంబంధాల కేసులు నమోదయ్యాయి. సెక్యూరిటీ విభాగానికి వ్యతిరేకంగా నేరాల పరంపర.. సంబంధిత నేతలకు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం రాబడతాం.' అని పేర్కొన్నారు జెలెన్స్కీ. సెక్యూరిటీ సర్వీసెస్ చీఫ్ ఇవాన్ బకనోవ్, రష్యా యుద్ధ నేరాలపై వాదనలు వినిపిస్తున్న ప్రాసిక్యూటర్ ఇరినా వెనెదిక్టోవాలాను తొలగించారు జెలెన్స్కీ. ఆదివారం సాయంత్రం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు అధ్యక్షుడు జెలెన్స్కీ. 2014లో రష్యా ఆక్రమించుకున్న క్రిమియాలో ఎస్‌బీయూ సెక్యూరిటీ చీఫ్‌గా పని చేసిన అధికారిని ఇటీవలే అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రష్యా సైనిక చర్య చేపట్టిన తొలినాళ్లలోనే సెక్యూరిటీ విభాగంలోని పలువురు ఉన్నతాధికారులను తొలగించినట్లు చెప్పారు. సెక్యూరిటీ చీఫ్‌పై అన్ని విధాల ఆధారాలు సేకరించామన్నారు. ఇదీ చదవండి: రష్యా దాడిలో చిన్నారి మృతి.. మిన్నంటిన తండ్రి రోదనలు -
మార్కెట్లలో పీఎఫ్ గోల్మాల్
సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖలో పనిచేసే సెక్యూరిటీ గార్డుల భవిష్యనిధి (పీఎఫ్)కి ఓ ఔట్సోర్సింగ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎసరుపెట్టింది. పీఎఫ్, ఈఎస్ఐ సొమ్మును జమ చేయకుండా స్వాహా చేసింది. కొత్తపేట పండ్ల మార్కెట్లో వెలుగు చూసిన ఈ అక్రమాలపై మార్కెటింగ్ శాఖ విచారణకు ఆదేశించింది. అయితే, పీఎఫ్ స్వాహా వ్యవహారం కేవలం కొత్తపేట మార్కెట్‌కే పరిమితం కాలేదని.. పదుల సంఖ్యలో ఇతర మార్కెట్లలో కూడా ఈ తతంగం జరిగినట్లు తేలింది. దీంతో రంగంలోకి దిగిన మార్కెటింగ్ శాఖ అధికారులు సెక్యూరిటీ ఏజెన్సీపై చర్యలకు ఉపక్రమించారు. నెలనెలా తమ ఖాతాలో జమ కావాల్సిన పీఎఫ్ సొమ్ము జమ కాకపోవడం, జనవరి వేతనం కూడా రాకపోవడంతో పలువురు సెక్యూరిటీ గార్డులు మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఏజెన్సీ అవినీతి వ్యవహారం వెలుగు చూసింది. పీఎఫ్ విభాగం లేఖలు రాసినా.. భవిష్య నిధి బకాయిలపై పీఎఫ్ విభాగం పలుమార్లు ఆయా మార్కెట్ల కార్యదర్శులకు లేఖలు రాసింది. ఉద్యోగుల ఖాతాలో పీఎఫ్ జమ చేయనందున సెక్యూరిటీ ఏజెన్సీకి నిధుల చెల్లింపులను నిలిపివేయాలని సూచిం చింది. అయితే, ఈ లేఖలను ఖాతరు చేయని కార్యదర్శులు.. ఏజెన్సీపై చర్యలు తీసుకోక పోగా క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించారు. తాజాగా సెక్యూరిటీ ఉద్యోగుల ఫిర్యాదుతో మార్కెటింగ్ శాఖ పీఎఫ్ అధికారులను సంప్ర దించగా.. ఈ విషయం బహిర్గతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్న మార్కెట్లలోని వందల సంఖ్యలో గార్డులకు పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము జమ కావడంలేదని తేలింది. దీంతో విచారణకు ఆదేశించిన మార్కెటింగ్ శాఖ డైరెక్టర్.. ఈ అవినీతికి బాధ్యులైన అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా, కొత్తపేట పండ్ల మార్కెట్ కార్యదర్శి దీర్ఘకాలిక సెలవులో వెళ్లడం మార్కెటింగ్ శాఖ ఉద్యోగవర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. కాగా, కార్యదర్శి సెలవులో వెళ్లిపోవడంతో గ్రేడ్–1 కార్యదర్శి చిలుక నరసింహారెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
కేంద్రం కీలక ఆదేశాలు! కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూజర్ల వివరాలన్నీ..
టెలికాం ఆపరేటర్లకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్ల కాల్ రికార్డింగ్ డాటాను, ఇంటర్నెట్ యూసేజ్ డాటాను రెండేళ్ల పాటు భద్రపర్చాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. గతంలో ఈ సమయం ఏడాది పాటే ఉండేది. ఒకవేళ భద్రతా ఏజెన్సీలు కోరితే ఆ గడువును పెంచే విధంగా సవరణ వెసులుబాటు ఉండేది(గతంలో ఎన్నడూ జరగలేదు!). అయితే ఈసారి రెండేళ్లపాటు భద్రపర్చాలంటూ యునిఫైడ్ లైసెన్స్ అగ్రిమెంట్‌కు సవరణ చేయడం విశేషం. రెండేళ్లపాటు లేదంటే ప్రభుత్వం చెప్పేవరకు వివరాలను భద్రపర్చి ఉంచాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం(DoT) డిసెంబర్ 21న ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా టెలికామ్ కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, టెలికాం లైసెన్స్‌లు కలిగిన ఇతరులు.. కమర్షియల్‌తో పాటు యూజర్ల కాల్ వివరాల రికార్డ్లను భద్రపర్చాలని స్పష్టం చేసింది. భద్రతా ఏజెన్సీలు కోరినందునే ఈసారి ఈ సవరణ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రజాప్రయోజనాల దృష్ట్యా లేదంటే భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని టెల్కోస్, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు టెలికమ్యూనికేషన్ విభాగం ఈ తరహా ఆదేశాల్ని జారీ చేస్తుంటుంది. కాల్ రికార్డింగులు, మెసేజ్‌ల వివరాలతో పాటు ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ఈ-మెయిల్, లాగిన్, లాగ్ అవుట్.. ఇలా అన్ని వివరాలను జాగ్రత్త పర్చాల్సి ఉంటుంది. ఐపీ అడ్రస్ వివరాలకు అదనంగా ఈసారి ఇంటర్నెట్ టెలిఫోనీ(యాప్‌ల ద్వారా చేసే కాల్స్, వైఫై కాల్స్ తదిరత వివరాలు) సైతం రెండు సంవత్సరాలపాటు భద్రపర్చాల్సిందే!. దర్యాప్తు, విచారణ, భద్రతా ఏజెన్సీలు ఎప్పుడు కోరితే అప్పుడు ఆ వివరాల్ని కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్.. మీరూ కుబేరులు అయిపోవచ్చు! -
ఇదొక భారీ బిజినెస్.. వరద ప్రవాహంలా డబ్బు!
‘‘దిస్ ఈజ్ బిజినెస్’’.. ప్రతీ దాంట్లోనూ లాభం వెతుక్కుంటున్నాయి కంపెనీలు. ఇందులో ముఖ్యంగా టెక్ దిగ్గజాల తీరు విపరీతమైన చర్చకు దారితీస్తోంది. విషాదం దగ్గరి నుంచి వినోదం దాకా దేన్నికూడా వదలకుండా క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో దిగ్భ్రాంతికి గురి చేసే భారీ వ్యాపారం గురించి తాజాగా ఓ నివేదిక బయటపెట్టింది. ఉగ్రవాదంపై పోరు వంకతో కోటానుకోట్లు వెనకేసుకుంటున్నాయి టెక్ కంపెనీలు. కంపెనీల సాంకేతికతను, ఇతరత్ర సేవల్ని(ఇంటర్నెట్ ప్రమోషన్లు సైతం) ఉపయోగించుకునేందుకు.. భద్రతా ఏజెన్సీలు భారీగా నిధులు వెచ్చించి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ వ్యాపారంలో డబ్బు వరదలా ప్రవహిస్తోంది. 9/11 దాడులకు 20 సంవత్సరాలు పూర్తైన తరుణంలో.. ‘వార్ ఆన్ టెర్రర్’ పేరిట గురువారం ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యింది. ఇందులో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్.. ఇలా దాదాపు అగ్ర టెక్ కంపెనీలు, ఫేస్బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉగ్రవాదాన్ని క్యాష్ చేసుకుని ఎలా బిలియన్లు వెనకేసుకుంటున్నాయో పూసగుచ్చినట్లు వివరించారు. క్లిక్: కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్! 2001 నుంచే.. ప్రస్తుతం టెక్ దిగ్గజాలు.. యూఎస్ మిలిటరీతో పాటు ఇతర దేశాల ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. బిగ్ టెక్ సెల్స్ వార్ వ్యాపారం 2004 నుంచి తారాస్థాయిలో నడుస్తోందని, ఇందుకోసం టెక్ దిగ్గజాలు భారీ స్థాయిలో భద్రతా ఏజెన్సీల నుంచి డబ్బులు అందుకుంటున్నాయని వెల్లడించింది. ‘‘ నిజానికి 2001 నుంచి రక్షణ రంగాలు డిజిటలైజేషన్ అవుతున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, జీపీఎస్ సాఫ్ట్వేర్ వాడకం విపరీతంగా పెరిగింది. చాలా దేశాలు వీటి అవసరం లేకున్నా.. ఒప్పందాల్ని చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో కేవలం అమెరికా రక్షణ రంగం ఒక్కటే పలు టెక్ కంపెనీలతో సుమారు 43.8 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంద’’ని బయటపెట్టింది ఈ డాక్యుమెంటరీ. 57 దేశాల ఏజెన్సీలు 2004 నుంచి ఇప్పటిదాకా.. పెంటగాన్, హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి టెక్ కంపెనీలకు విపరీతమైన ఫండ్లు వస్తున్నాయట. ఒక్క అమెరికాకే కాదు.. దాదాపు 57 దేశాల భద్రతా ఏజెన్సీలు(ఇందులో భారత్ ఉందో లేదో స్పష్టత లేదు) టెక్ దిగ్గజాల ఒప్పందాలు చేసుకున్నాయి. మరో విశేషం ఏంటంటే.. అమెరికాకు సంబంధించిన ఈ సమాచారం అంతా పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నా ఇన్నాళ్లూ ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం. ఇక ఫారిన్ పాలసీలు లేదంటే నేరు విధానాల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. అన్నిరకాల సేవలు.. ఆన్లైన్ టూల్ కాంట్రాక్ట్స్ ద్వారా ఇదంతా నడుస్తోందని తెలిపింది. కీలక పదవులు జార్డ్ కోహెన్.. ఒకప్పుడు స్టేట్డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి. ఇప్పుడాయన గూగుల్‌లో పని చేస్తున్నారు. ఇక నిఘా ఏజెన్సీ ఎఫ్‌బీఐలో పనిచేసిన స్టీవ్ పండెలిడెస్.. ప్రస్తుతం అమెజాన్‌లో పని చేస్తున్నాడు. మైక్రోసాఫ్ట్ జోసెఫ్ రోజెక్.. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. ఇదంతా పరస్సర ఒప్పందాల్లో భాగంగానే నడిచిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చదవండి: జొమాటో సంచలనం.. ఆ సర్వీసులకు గుడ్‌బై -
రష్యన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌తో ప్రధాని మోదీ భేటీ!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రష్యన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నికోలాయ్ పాత్రుషేవ్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుత సమయంలో అఫ్గాన్‌తో సహా ప్రాంతీయ సుస్థిరత దిశగా మరింత సమన్వయాన్ని బలోపోతం చేయాలంటూ పునరుద్ఘాటించారు. భారత్ -రష్యాల మధ్య భాగస్వామ్య అభివృద్ధి, రాజకీయాలు, బహుళ ఫార్మేట్స్, ఎస్సీఓ, బ్రిక్స్ తదితర విషయాలపై సంభాషించారు. నికోలాయ్ తన రెండు రోజుల ఇండియా పర్యటనలో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా భేటీ అయ్యారు. అఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ తీవ్రవాద గ్రూపులకు ఉనికిగా మారే అవకాశం ఉందని సెక్యూరిటీ అడ్వైజర్లు అభిప్రాయపడ్డారు. తీవ్రవాద గ్రూపులకు ఆయుధాల ప్రవాహం, అఫ్ఘన్ సరిహద్దుల్లో అక్రమ రవాణా, అఫ్ఘనిస్తాన్ నల్లమందు ఉత్పత్తి అక్రమ రవాణాకు కేంద్రంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సెక్యూరిటీ వర్గాలు తెలిపాయి. తాలిబన్లతోపాటుగా, ఇతర అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలతో పాకిస్తాన్ సంబంధాలను కలిగి ఉందనే విషయాన్ని భారత్ గుర్తుచేసింది. అఫ్ఘనిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా మారకుండా చూసుకునే బాధ్యత పాకిస్తాన్‌పై ఉందని భారత్ పేర్కొంది. Was happy to meet Mr. Nikolai Patrushev, Secretary of the Security Council of Russia. His visit allowed useful discussions between both sides on important regional developments. pic.twitter.com/v0cwJH1yAF — Narendra Modi (@narendramodi) September 8, 2021 చదవండి: అగర్తలలో ఉద్రిక్తత: ఆగంతకుల దాడిలో సీపీఎం కార్యాలయానికి నిప్పు -
డ్రోన్ ముప్పును తప్పించే సాంకేతికత
న్యూఢిల్లీ: భారత్‌లో దాదాపు 6 లక్షలకు పైగా అనియంత్రిత డ్రోన్లు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. డ్రోన్ల ద్వారా ఉగ్రవాద చర్యలు, ఇతర సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా స్కై ఫెన్స్, డ్రోన్ గన్ తదితర ఆధునిక యాంటీ డ్రోన్ ఆయుధాల వినియోగాన్ని పలు భద్రతా సంస్థలు పరీక్షిస్తున్నాయని ఆదివారం వెల్లడించాయి. డ్రోన్లు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్, రిమోట్ ద్వారా పనిచేసే చిన్న విమానాలు భద్రత పరంగా సున్నితమైన ప్రాంతాలకు, ఇతర కీలక కార్యాలయాలకు, ప్రజలు భారీగా పాల్గొనే కార్యక్రమాలకు ముప్పుగా పరిణమించే అవకాశంపై సెక్యూరిటీ సంస్థలు ఒక బ్లూప్రింట్‌ను రూపొందించాయి. పీటీఐ వార్తాసంస్థ చేతికి చిక్కిన ఆ నివేదికలో.. ఆ ముప్పును ఎదుర్కొనేందుకు ఒక సమగ్ర ప్రణాళిక అవసరమని ఆయా సంస్థలు నిర్ధారించాయి. వివిధ సైజులు, వివిధ సామర్థ్యాలున్న ఈ 6 లక్షల డ్రోన్లను ఎవరైనా విధ్వంసానికి వాడే అవకాశముందని హెచ్చరించాయి. సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై ఇటీవల జరిగిన డ్రోను దాడులు, పాకిస్తాన్ సరిహద్దుల్లో నుంచి పంజాబ్‌లోకి డ్రోన్ల ద్వారా ఆయుధాల చేరవేత.. తదితరాలను అందులో ప్రస్తావించాయి. అందువల్ల ఈ ముప్పును ఎదుర్కొనేందుకు, ఆయా డ్రోన్లను ఎదుర్కొని నిర్వీర్యం చేసేందుకు స్కై ఫెన్స్, డ్రోన్ గన్, ఎథీనా, డ్రోన్ క్యాచర్, స్కైవాల్... తదితర సాంకేతికతను ఉపయోగించుకోవడాన్ని భారత సెక్యూరిటీ ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. ఇండియన్ పోలీస్ జర్నల్‌లో రాజస్తాన్ అదనపు డీజీపీ పంకజ్ కుమార్ రాసిన ‘డ్రోన్స్.. అ న్యూ ఫ్రంటియర్ ఫర్ పోలీస్’ అనే వ్యాసంలో ఈ వివరాలున్నాయి. డ్రోన్ గన్ ద్వారా డ్రోన్‌కు దాని పైలట్ నుంచి అందే మొబైల్ సిగ్నల్‌ను అడ్డుకుని, అది ఎలాంటి విధ్వంసం సృష్టించకముందే దాన్ని నేలకూల్చే అవకాశముంది. అలాగే, కీలక స్థావరాలపై డ్రోన్లకు అందే సిగ్నల్స్‌ను అడ్డుకునేలా డ్రోన్ ఫెన్స్‌లు ఏర్పాటు చేయవచ్చు. హరియాణాలోని బోండ్సిలో ఉన్న బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఇటీవల తొలిసారి ఈ డ్రోన్ వ్యతిరేక సాంకేతికతలను ప్రదర్శించారు. ఈసీఐఎల్, బీఈఎంఎల్ సంస్థలు తమ తయారీ యాంటీ డ్రోన్ సాంకేతికతలను ప్రదర్శించాయి. ఎయిర్‌ఫోర్స్, సీఐఎస్ఎఫ్ తదితర సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. -
సెక్యూరిటీ సేవల్లోకి జియో
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మరిన్ని కొత్త రంగాల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. తాజాగా అపార్ట్మెంట్ల భద్రత నిర్వహణ సేవల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు సంబంధించి యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో జియో గేట్ పేరిట కొత్త యాప్ ప్రత్యక్షమవడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. గేటెడ్ కమ్యూనిటీల్లో విజిటర్లు మొదలుకుని రోజువారీ సిబ్బంది, డెలివరీ బాయ్స్, క్యాబ్స్ దాకా అన్నింటి రాకపోకల వివరాల నిర్వహణ అంతా జియోగేట్ క్రమబద్ధీకరిస్తుందని యాప్ గురించిన వివరణలో ఉంది. ‘దొంగతనాలు, నేరాలపై ఆందోళన లేకుండా కమ్యూనిటీ పరిసర ప్రాంతాలను సురక్షితంగా తీర్చిదిద్దేలా సెక్యూరిటీ నిర్వహణ ప్రక్రియను సమూలంగా మారుస్తున్నాం‘ అని యాప్ గురించి జియో పేర్కొంది. ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ..: ప్రస్తుతం మైగేట్, అపార్ట్మెంట్ అడ్డా, స్మార్ట్గార్డ్ వంటి సంస్థలు యాప్ ఆధారిత అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ సేవలు అందిస్తున్నాయి. జియో గానీ భారీ యెత్తున వస్తే వీటికి గట్టి పోటీనివ్వొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. జియోగేట్ ఫీచర్స్‌ను బట్టి చూస్తే యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌నే ఇంటర్‌కామ్ డివైజ్‌గా కూడా వాడుకోవచ్చన్నట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో తామెక్కడ ఉన్నామో కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ గార్డుకు తెలియజేసేందుకు వీలుగా పానిక్ అలర్ట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. అయితే, సెక్యూరిటీ సేవల విభాగంలోకి ఎంట్రీపై జియో ఇంకా స్పందించాల్సి ఉంది. -
మోదీకి ప్రాణహాని; ఎవరినీ దగ్గరకు రానివొద్దు
సాక్షి, న్యూఢిల్లీ : 2019 ఎన్నికల దృష్టా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రాణహాని అధికంగా ఉందని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎన్ఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మోదీ పర్యటనల సందర్భంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాక మోదీ పర్యటించే సమయంలో ఎవరిని ఆయనకు సమీపంగా వెళ్లడానికి అనుమతించకూడదని.. ఒకవేళ అనుమతించినా పూర్తిగా తనిఖీ చేసిన తరువాతే పంపించాలని తెలిపింది. ఇది కేవలం సామన్యులకే మాత్రమే కాక మంత్రులకు, అధికారులకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. మోదీకి సమీపంగా వెళ్లాలనుకుంటే మంత్రులు, అధికారులను కూడా ప్రత్యేక భద్రతా దళాలు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే అనుమతిస్తాయని తెలిపారు. రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీ రోడ్ షోలలో పాల్గొనకపోవడమే మంచిదంటున్నాయని సూచించాయి. తప్పనిసరైతే రోడ్ షో నిర్వహించే సమయాన్ని, దూరాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవాలన్నాయి. కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర పూణెలో మావోయిస్టు సానుభూతిపరుల నుంచి స్వాధీనం చేసుకున్న ‘రాజీవ్ గాంధీ తరహా ఘటన’ పేపర్ల నేపధ్యంలో మోదీ భద్రతా గురించి కేంద్ర హోం శాఖ ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో అనుకోని ప్రమాదాల జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అన్ని రాష్ట్ర ముఖ్య పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మోదీకి ఆరు వలయాల భద్రతా ఏర్పాట్లను కల్పిస్తున్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. -
ఈ ప్రమాదాలకు బాధ్యులు ఎవరు?
మూణ్ణెళ్లుగా దేశంలో వరుసగా జరగుతున్న రైలు ప్రమాదాల్లో 200మందికి పైగా అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయాలపాలయ్యారు. ప్రమాదాలు జరుగుతున్న తీరు విచారణ సంస్ధలకు లభిస్తున్న క్లూలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రైలు ప్రమాదాల కేసులను టేకప్ చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ)కు పలు కీలక ఆధారాలు లభించాయి. తూర్పు చంపారన్ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనాస్ధలిలో ఓ పేలని ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) పోలీసులకు లభ్యమైంది. అంతేకాకుండా నేపాల్ లో గత ఏడాది జరిగిన రెండు హత్యలకు, భారత్‌లో జరుగుతున్న రైలు ప్రమాదాలకు సంబంధం ఉందని ఎన్ఐఏ వద్ద ఉన్న ఆధారాలు సూచిస్తున్నాయి. ప్రమాదానికి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న నిందితులు విచారణలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ రైలు ప్రమాదాలకు వ్యూహం రచించినట్లు చెప్పారు. నిందితులు అందించిన సమాచారంతో కూపీ లాగిన అధికారులకు నేపాల్, కరాచీల్లో ఉంటున్న ఇద్దరు వ్యక్తులు రైళ్ల ప్రమాదాలకు పెద్ద ఎత్తున నగదును అందించినట్లు బయటపడింది. రైలు పట్టాలపై పేలని ఐఈడీని కనిపెట్టిన బీహార్ పోలీసులు బాంబును అమర్చిన అనుమానితులు మోతీ పాశ్వన్, ఉమాశంకర్ యాదవ్, ముకేశ్ యాదవ్ లను అరెస్టు చేశారు. ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించాలని నేపాల్‌లో బ్రిజ్ కిషోర్ గిరి అనే వ్యక్తి కుట్ర పన్నినట్లు విచారణలో వారు చెప్పారు. ఈ సమాచారంతో నేపాల్ వెళ్లిన పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, ఐఈడీ పేలుడు సఫలీకృతం కానందుకు వాటిని అమర్చిన దీపక్ రామ్, రాక్సావుల్లను నేపాల్‌కు పిలిపించి గొంతు కోసి చంపినట్లు ఎన్ఏఐ అధికారి ఒకరు చెప్పారు. ఇరువురి మృతదేహాలు ఓ కారులో లభ్యమైనట్లు పేర్కొన్నారు. మృత దేహాలు లభ్యమైన కారు బ్రిజ్‌కు చెందిందని తెలిసింది. బ్రిజ్‌తో కలిసి బోర్డర్లో స్మగ్లింగ్ చేసే శంశుల్ హుడా కూడా ఈ హత్యల్లో పాలు పంచుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై నేపాల్ పోలీసులు హుడాను ప్రశ్నించగా తాను దుబాయ్ కు చెందిన బిజినెస్‌మ్యాన్‌గా అతను పేర్కొన్నాడు. కాల్ రికార్డుల ఆధారంగా హుడా తరచూ కరాచీకి చెందిన అండర్‌వరల్డ్ డాన్ షఫీతో తరచూ సంభాషిస్తున్నట్లు తెలిసింది. కాగా, గత కొద్ది సంవత్సరాలుగా షఫీ కార్యకలాపాలపై ఎన్ఐఏ నిఘా పెట్టి ఉంచింది. షఫీపై భారత్‌లో నకిలీ కరెన్సీ తయారుచేసినట్లు కేసులు ఉన్నాయి. పేలుడు పదార్ధాలను కూడా షఫీ భారత్‌కు సరఫరా చేస్తున్నట్లు కూడా రిపోర్టులు వచ్చాయి. దీంతో హుడాను పట్టుకునేందుకు యత్నించిన అధికారులకు ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురైంది. హుడా కోసం ఓ ట్రావెల్ ఏజెన్సీని పోలీసులు సంప్రదించగా అది అతని మేనల్లుడు జియా నడుపుతున్నట్లు తెలిసింది. జియా భారత పాస్‌పోర్టును కూడా కలిగివున్నట్లు అధికారులు గుర్తించారు. పలువురికి భారత పాస్‌పోర్టులు అందించిన జియాకు డాక్యుమెంట్లను ఎవరు అందించారనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. అండర్‌వరల్డ్ సహాకారంతో భారత్‌లోకి పేలుడు పదార్ధాలు, నకిలీ నోట్లు సరఫరా చేయడం కొత్తేం కాదు. గతంలో నేపాల్ కూడా భారత్‌పై ఉగ్రదాడులకు పాల్పడింది. కానీ, తాజాగా జరుగుతున్న రైలు ప్రమాద ఘటనల్లో భారత యువతే ఉంటోంది. ఈ విషయం భద్రతా సంస్ధలకు కలవరపాటుకు గురి చేస్తోంది. ఎంత స్ధాయిలో స్ధానిక యువత అండర్వరల్డ్కు ఉపయోగపడుతోందో సరైన అవగాహన నిఘా సంస్ధలకు ఇంకా లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు. -
పడిపోతున్న అమెరికా ఆయుధాల అమ్మకాలు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆయుధాల అమ్మకాల్లో అమెరికా క్రమక్రమంగా వెనకబడుతోంది. ఆ స్థానంలో యూరప్ దేశాలు తమ మార్కెట్లను పెంచుకుంటున్నాయి. ప్రపంచంలో అమెరికా ఆయధాల విక్రయాలు తగ్గడం వరుసగా ఇది ఐదో సంవత్సరం. అయినా ఇప్పుటికీ ఆయుధాలు ఎగుమతి చేయడంలో అమెరికాదే అగ్రస్థానం. ఆయుధాల అమ్మకాల్లో ఇప్పటికీ 54 శాతం వాటా అమెరికాదే. అమెరికా ఆయుధాల అమ్మకాలు తగ్గిపోవడానికి కారణం తన రక్షణ కేటాయింపులపై పరిమితులు విధించడమేనని స్టాక్‌హోమ్ లోని అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ తెలియజేసింది. 2014వ సంవత్సరంతో పోలిస్తే 2015 సంవత్సరానికి ఆమెరికా ఆయుధాల అమ్మకాలు మూడు శాతం తగ్గాయి. 2015 సంవత్సరంలో రష్యా అయుధాల అమ్మకాలు 6.2 శాతం పెరిగాయి. 2014లో 48 శాతం, 2013లో 20 శాతం పెరిగాయి. వరుసగా అమ్మకాల్లో చెప్పుకోతగ్గ పురోభివృద్ధి ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అమ్మకాల్లో రష్యా అమ్మకాల వాటా ఇప్పటికీ 8.1 శాతం మాత్రమే. రక్షణ ఉత్పత్తులను పెంచడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ వాటిపై పెట్టుబడులను తీవ్రంగా పెంచుతూ పోతున్నారు. 2025 సంవత్సరం నాటికల్లా ఈ పెట్టుబడులను 70,000 కోట్ల డాలర్లకు పెంచాలన్నది ఆయన లక్ష్యం. 2015 సంవత్సరంలో అమెరికా 20,900 కోట్ల డాలర్ల ఆయుధాలను విక్రయించడం ఇక్కడ గమనార్హం. అంటే ఈవిషయంలో అమెరికాను అధిగమించి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం రష్యా లక్ష్యంగా కనిపిస్తోంది. ఫ్రెంచ్ రక్షణ సంస్థలు కూడా తమ అమ్మకాలను క్రమంగా పెంచుకుంటున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2015 సంవత్సరంలో ఫ్రెంచ్ రక్షణ కంపెనీలు తమ అమ్మకాలను 13 శాతం పెంచుకున్నాయి. ఈజిప్టు, ఖతార్, జర్మనీ కంపెనీలకు ఆయుధాలను విక్రయించడం ద్వారానే ఈ కంపెనీలు దాదాపు 7 శాతం అమ్మకాలను పెంచుకున్నాయి. 2014 సంవత్సరంతో పోలిస్తే 2015 సంవత్సరానికి బ్రిటీష్ కంపెనీలు కూడా ఆయుధాల అమ్మకాలను 2.8 శాతం పెంచుకున్నాయి. ద క్షిణ కొరియా అమ్మకాల్లో 2015 సంవత్సరానికే 32 శాతం వృద్ధిరేటు కనిపించింది. అయితే ఇందులో ఎక్కువ వాటాను దేశ సైన్యమే కొనుగోలు చేసింది. చైనా ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన వివరాలు మాత్రం అందుబాటులో లేవు. -
వెలగపూడిలో ఏసీబీ తొలిదాడి
-
వెలగపూడిలో ఏసీబీ తొలిదాడి
సాక్షి, అమరావతి: వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తొలిసారిగా దాడి చేసింది. హోం శాఖ సెక్షన్ అధికారి కె.శ్రీనాథ్ శుక్రవారం రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.గుజరాత్‌తో పాటు సుమారు ఏడు రాష్ట్రాల్లో సెక్యూరిటీ ఏజెన్సీలు నిర్వహిస్తున్న సంస్థ ఏపీలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. అందుకు రాష్ట్ర హోంశాఖ అనుమతి ఇవ్వాలి. ఇందుకు తనకు రూ.50 వేలు లంచం ఇవ్వాలని సెక్షన్ అధికారి శ్రీనాథ్ వేధిస్తున్నాడంటూ శివ ఏజెన్సీస్ ప్రతినిధి ఎస్.గంగూలీ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు, విజయవాడ ఏసీబీ డీఎస్పీలు దేవానంద్ శాంతో, వాసంశెట్టి గోపాలకృష్ణ సిబ్బందితో కలసి శుక్రవారం దాడి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాట్సప్ మెసేజీలను మావాళ్లు చదవలేకపోతున్నారు
న్యూఢిల్లీ : వాట్సాప్ లాంటి కమ్యూనికేషన్ యాప్ ల మేసెజ్ లను డీక్రిప్ట్ (వ్యక్తీకరించడానికి) చేయడానికి భారత సెక్యురిటీ ఏజెన్సీలకు సాధ్యపడదని కేంద్ర సమాచార, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో తెలిపారు. న్యాయపరంగా, టెక్నికల్ గా, రెగ్యులేటరీ పాలసీ వంటి కారణాలతో ఈ వాట్సాప్ మెసేజ్ లను చదివగలిగే ఆకృతులోకి మార్చడం కుదరదని పేర్కొన్నారు. వివిధ అప్లికేషన్ సర్వీస్ ప్రొవేడర్లు కల్పిస్తున్న ఎన్ర్కిప్టెడ్ కమ్యూనిషన్ తో వ్యవహరించేటప్పుడు సెక్యురిటీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఆ అప్లికేషన్లు ఎన్కిప్షన్ టెక్నాలజీని, యాజమాన్య ధృవీకరణ ప్రొటోకాల్స్ ను వాడుతూ మెసేజ్ లను భద్రంగా ఉంచుతున్నాయని పేర్కొన్నారు. మొబైల్ అప్లికేషన్లలో వాట్సాప్ అనేది సమాచారం మార్పిడికి ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉందని, ఇంటర్ నెట్ సేవలు కల్గి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉందని చెప్పారు. సెక్యురిటీ ఏజెన్సీలు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించి, వాటిని డీక్రిప్ట్ చేయడం సాధ్యపడదని, ఒకవేళ డీక్రిప్ట్ చేయాలనుకున్నా టెక్నికల్ గా, న్యాయపరంగా, రెగ్యులేటరీ పాలసీ పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. టెలికాం సర్వీసు ప్రొవేడర్లతో పాటు సోషల్ మీడియా ప్రొవైడర్లతో రెగ్యులేటరీ ఎప్పడికప్పుడూ సమావేశమై దేశ భద్రత, అభివృద్ధి అంశాలు, సేవల విషయంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాల అమలు చేస్తుంటాయని చెప్పారు. ఇటీవలే వాట్సాప్ ద్వారా అందించే అన్ని సేవలకు ఎండ్ టూ ఎండ్ ఎన్ర్కిప్షన్ ను ఫేస్ బుక్ తీసుకొచ్చింది. ఉద్దేశించిన గ్రహీతలు మాత్రమే ఈ మెసేజ్ లు చదువుకోగలిగే రీతిలో దీన్ని రూపొందించారు. ఎన్ర్కిప్షన్ అనేది అత్యంత ప్రాముఖ్యం కల్గిన సాధనమని, ఈ కొత్త డిజిటల్ యుగంలో ప్రభుత్వాలు, కంపెనీలు, వినియోగదారులు భద్రతను, సెక్యురిటీని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్ర్కిప్టెడ్ సర్వీసులకు, లా ఎన్ ఫోర్స్ మెంట్ లకు సంబంధించి చాలా చర్చలు జరిగాయని, అయితే ప్రజల సమాచారాన్ని సైబర్ క్రిమినల్స్, హ్యాంకర్ల దగ్గర్నుంచి భద్రతగా ఉంచడమే లా ఎన్ ఫోర్స్ మెంట్ విధిగా గుర్తించామని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. -
విధ్వంసం తప్పదేమో!
- 'పారిస్' ముష్కరులతో కలిసి వచ్చిన వచ్చిన మరో 40 మంది జిహాదీలు ఇంకా యూరప్ లోనే - దాడుల ముప్పు ఇంకా తొలిగిపోలేదన్న అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీలు వాషింగ్టన్: పారిస్ నరమేధం అనంతరం చోటుచేసుకున్న ఎన్ కౌంటర్లతో కథ ముగిసిపోలేదని, నాటి దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదులతో కలిసివచ్చిన మరో 40 మంది జిహాదీలు ఇంకా యూరప్ లోనే ఉన్నారని అమెరికన్ రక్షణ సంస్థలు వెల్లడించాయి. ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ మహ్మద్ అల్ అద్నానీ ఆదేశాలమేరకు పలు నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు 60 మంది జిహాదీలు గతేడాది నవంబర్ లోనే యూరప్ లోకి ప్రవేశించారని, బృందాలుగా విడిపోయిన జిహాదీల్లో 20 మంది పారిస్ దాడుల అనంతరం హతంకాగా, ఆయా ప్రాంతాల్లో నక్కిన మిగతా జిహాదీలు ఏ క్షణమైనా విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఆయా దేశాలకు హెచ్చరికలు కూడా పంపాయి. 'పశ్చిమాసియాలో విధ్వంసానికి ప్రతీకారంగా దాడులు జరుపుతామని ఐఎస్ చీఫ్ అబూ అహ్మద్ ఏడాది కిందటే యూరప్ ను హెచ్చరించాడు. ఆ మేరకు నరమేధం సృష్టించేందుకు 60 మంది జిహాదీలు లండన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియంలోని రెండు ముఖ్యపట్టణాలకు చేరుకున్నారు. నవంబర్ 13న పారిస్ దాడుల అనంతరం వారిలో 20 మంది చనిపోయారు. మిగిలిన ఉగ్రవాదులు ఎప్పుడైనా విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది' అని అమెరికా సెక్యూరిటీ ఏజెన్సీలు పేర్కొన్నాయి. పక్కాగా అందిన సమాచారం మేరకే తాము ఈ ప్రకటన చేస్తున్నామన్న ఏజెన్సీలు తెలిపాయి. -
ఆ ఉగ్రకోరల దాడి పాక్ నుంచే
ముంబై మారణహోమంపై పాక్ ఎఫ్ఐఏ మాజీ డీజీ వెల్లడి 26/11 దాడికి కుట్ర జరిగింది పాక్ భూభాగంలోనే.. కసబ్ పాక్ జాతీయుడే.. ఉగ్రవాదులను థట్టా నుంచే దాడికి పంపారు కరాచిలోని ఒక ఆపరేషన్ గది నుంచి దాడికి మార్గదర్శకం చేశారు ముంబై ఉగ్రవాద దాడిపై పాక్ వాస్తవాన్ని, పొరపాట్లను ఒప్పుకోవాలి డాన్ పత్రికలో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాజీ డీజీ తారిక్ ఇస్లామాబాద్: భారత్‌పై పంజా విసురుతున్న ఉగ్రవాదానికి, తమ దేశంతో ఏ సంబంధం లేదని దబాయిస్తున్న పాకిస్తాన్ కపటనీతి బట్టబయలయింది. ముంబై నగరంలో 166 మందిని బలితీసుకుని మారణహోమం సృష్టించిన 26/11 ఉగ్రదాడికి కుట్ర జరిగింది పాక్‌లోనే అని, పాక్ భూభాగం నుంచే ఆ దాడి జరిగిందని.. ఆ దేశానికి చెందిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) మాజీ అధిపతి స్వయంగా బహిర్గతం చేశారు. కరాచీలోని ఒక గది నుంచి ఆ దాడికి మార్గనిర్దేశం జరిగిందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఎన్నో ఆధారాలు దర్యాప్తులో లభ్యమయ్యాయని వివరించారు. 2008లో ముంబైపై ఉగ్రవాద దాడి తర్వాత కొన్ని వారాల్లోనే ఎఫ్ఐఏ డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన తారిక్ ఖోసా మంగళవారం పాక్‌కు చెందిన డాన్ దినపత్రికలో రాసిన వ్యాసంలో.. ఆ దాడుల దర్యాప్తులో వెల్లడైన అంశాలను, దర్యాప్తును నీరుగార్చేందుకు జరిగిన ప్రయత్నాలను కూలంకషంగా వివరించారు. తద్వారా ముంబైపై జరిగిన దాడి విషయంలో భారత్ ఇంత కాలం చెప్తున్నదంతా వాస్తవమేనని ధ్రువీకరించారు. తన భూభాగంలో కుట్ర చేసి, అమలు చేసిన ముంబై మారణహోమాన్ని పాక్ పట్టించుకోవాల్సి ఉందని.. ఇందుకు వాస్తవాన్ని ఒప్పుకోవటం, పొరపాట్లను అంగీకరించటం అవసరమని సూచించారు. ఆ ఘోర ఉగ్రవాద దాడుల సూత్రధారులు, పాత్రధారులను పాక్ ప్రభుత్వ భద్రతా సంస్థలు చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే.. ఉగ్రవాదులు, తీవ్రవాదులందరితో సహా మంచి తాలిబాన్ చెడ్డ తాలిబాన్ అనే తేడా చూపించటాన్ని, ద్వంద్వ వైఖరిని పాక్ సర్కారు విడనాడాలని హితవుపలికారు. ‘ముంబై దాడుల కేసు సుదీర్ఘ కాలం పాటు సాగుతూ వస్తోంది. నిందితులు జాప్యం చేసే ఎత్తుగడలు, విచారణ జీడ్జీలను తరచుగా మార్చుతుండటం, ప్రాసిక్యూటర్ హత్యకు గురవటం, కొందరు కీలక సాక్షులు వాస్తవంగా ఇచ్చిన వాంగ్మూలానికి ఎదురు తిరగటం అనేవి కేసు విచారణకు గట్టి ఎదురుదెబ్బలుగా మారాయి’ అని వెల్లడించారు. పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్, భారత ప్రధాని నరేంద్రమోదీల మధ్య గత నెలలో రష్యాలో జరిగిన సమావేశాన్ని పాక్ ప్రజలు ఆహ్వానించాలని సూచించారు. ఈ భేటీ అనంతరం ఇరువురు ప్రధానులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో.. ఐదు సూత్రాల రోడ్‌మ్యాప్‌ను పేర్కొన్నారు. ముంబై కేసు విచారణను (పాక్‌లో) వేగవంతం చేసేందుకు.. మాటల నమూనాలను అందించటం సహా ఉన్న మార్గాలపై చర్చించాలని అంగీకరించారు. కానీ.. పాకిస్తాన్ ఆ తర్వాత మాట మార్చింది. ఈ కేసుకు సంబందించి మరిన్ని సాక్ష్యాలు, సమాచారం కావాలని భారత్‌ను అడిగింది. ఇరు దేశాలూ కలిసి కృషిచేయాలి... ‘ఈ దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కమాండర్, అతడి సహాయకుల స్వర నమూనాలను పరీక్షల కోసం రికార్డు చేసేందుకు అనుమతించాలని దర్యాప్తు అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ నిందితులు తిరస్కరించారు. వారి అంగీకారం లేకపోయినా వారి స్వర నమూనాలను రికార్డు చేసేందుకు అనుమతించాలని అధికారులు కోర్టును కోరారు. కానీ.. సాక్ష్యాల చట్టం లేదా అప్పటికి అమలులో ఉన్న ఉగ్రవాద వ్యతిరేక చట్టంలో అటువంటి అంశమేదీ లేదన్న ప్రాతిపదిక మీద కోర్టు ఆ వినతిని కోర్టు తిరస్కరించింది. దీంతో అధికారులు పైకోర్టుకు వెళ్లారు. 2013లో అమలులోకి వచ్చిన నిష్పాక్షిక విచారణ చట్టం.. ఇటువంటి సాంకేతిక సాక్ష్యాన్ని అనుమతిస్తోంది. కానీ.. అంతకుముందు కాలం నుంచే ఇది వర్తిస్తుందా లేదా అన్నది చర్చించాల్సిన ప్రశ్న’ అని వివరించారు. ‘ముంబై కేసు విభిన్నమైనది. ఒక ఘటన, రెండు న్యాయపరిధులు, రెండు విచారణలతో కూడుకున్న కేసు. రెండు దేశాల న్యాయ నిపుణులు.. పరస్పరం ఆరోపణలు చేసుకోవటానికి బదులు.. కలిసి కృషి చేయాలి’ అని అన్నారు. థట్టాలో శిక్షణ ఇచ్చి పంపించారు పాక్‌లోనూ, ఇంటర్పోల్లోనూ పలు ఉన్నత స్థానాల్లో పనిచేసిన తారిక్ ఖోసా 2007లో జరిగిన పాక్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్‌భుట్టో హత్య కేసు దర్యాప్తుకు కూడా సారథ్యం వహించారు. ముంబైపై 26/11 దాడికి సంబంధించి తారిక్ వెల్లడించిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ►‘‘మొదటిది.. అజ్మల్ కసబ్ పాకిస్తానీ జాతీయుడు. అతడి నివాస స్థలం, మొదట్లో చదువుకున్న ప్రాంతం, నిషిద్ధ ఉగ్రవాద సంస్థలో అతడు చేరటం మొదలైన అంశాలను దర్యాప్తు అధికారులు నిరూపించారు. ►రెండోది.. ఆ లష్కరే తోయిబా ఉగ్రవాదులకు సింథ్‌లోని థట్టా వద్ద శిక్షణనిచ్చారు. అక్కడి నుంచే వారిని సముద్రమార్గం ద్వారా పంపించారు. ఆ శిక్షణ శిబిరాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించి, స్వాధీనంలోకి తీసుకున్నారు కూడా. ముంబైలో వినియోగించిన పేలుడు పదార్థాల పైమూతలను (కేసింగ్స్‌ను) ఈ శిక్షణ కేంద్రం నుంచి స్వాధీనం చేసుకోవటం జరిగింది. ►మూడోది.. ఉగ్రవాదులు బయల్దేరినపుడు సముద్ర ప్రయాణంలో తొలుత వినియోగించిన ఫిషింగ్ ట్రాలర్ (చేపల వేటకు వినియోగించే మర పడవ)ను మళ్లీ వెనక్కు ఓడ రేవుకు తీసుకువచ్చి, కొత్త రంగు వేసి దాచిపెట్టారు. దానిని స్వాధీనం చేసుకోవటం జరిగింది. దానితో నిందితులకు సంబంధముందన్న నిర్ధారణ జరిగింది. ►నాలుగోది.. ముంబై రేవు వద్ద ఉగ్రవాదులు వదిలేసి వెళ్లిన డింగీ (చిన్న మర పడవ)లోని ఇంజన్‌కు ఒక పేటెంట్ నంబర్ ఉంది. దాని ద్వారా ఆ ఇంజన్ జపాన్‌లో తయారై, లాహోర్‌కు చేరుకుని.. అక్కడి నుంచి కరాచీలోని ఒక క్రీడావస్తువుల దుకాణానికి చేరుకుందని, దానిని అక్కడ లష్కరే తోయిబాతో సంబంధమున్న ఒక ఉగ్రవాది ఆ ఇంజన్‌ను డింగీతో సహా కొన్నాడని తేలింది. ►ఐదోది.. ముంబై దాడికి ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేసిన కరాచీలోని ‘ఆపరేషన్ రూమ్’ను దర్యాప్తు అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకోవటం జరిగింది. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) ద్వారా సంభాషణలు జరిగాయని బహిర్గతమయింది. ►ఆరోది.. ఈ ముంబై దాడికి సంబంధించిన కమాండర్, అతడి సహాయకులను గుర్తించి, అరెస్ట్ చేయటం జరిగింది. ఏడోది.. ఈ దాడికి ఆర్థిక నిధులు, సదుపాయాలు సమకూర్చిన ఇద్దరు విదేశీ ఫైనాన్షియర్లు, ఫెసిలిటేటర్లను అరెస్ట్ చేసి, విచారణ కోసం తీసుకురావటం జరిగింది.’’ -
గడ్కరి నివాసంలో నిఘా వ్యవస్ధ