
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొద్ది నెలలుగా కొనసాగుతూనే ఉంది. రష్యా సేనల బాంబుల వర్షంలో వందల మంది ఉక్రెయిన్ పౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ డొమెస్టిక్ సెక్యూరిటీ, స్టేట్ ప్రాసిక్యూటర్‌లకు షాక్ ఇచ్చారు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ. వారిని విధుల్లోంచి తప్పించారు. వారిపై వందలాది దేశద్రోహం, రష్యాతో సంబంధాల కేసులు ఉన్నాయంటూ పేర్కొన్నారు. మాస్కో మిలిటరీ ఆపరేషన్‌ను తీవ్ర తరం చేసేందుకు వారు సహకరించారని ఆరోపించారు.
'రష్యా ఆక్రమిత ప్రాంతాల్లోని ఎస్‌బీయూ సెక్యూరిటీ సర్వీస్, ప్రాసిక్యూటర్ కార్యాలయాల్లో పని చేస్తున్న 60 మందికిపైగా అధికారులు ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. అధికారులపై 651 దేశ ద్రోహం, రష్యాతో సంబంధాల కేసులు నమోదయ్యాయి. సెక్యూరిటీ విభాగానికి వ్యతిరేకంగా నేరాల పరంపర.. సంబంధిత నేతలకు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం రాబడతాం.' అని పేర్కొన్నారు జెలెన్‌స్కీ. సెక్యూరిటీ సర్వీసెస్ చీఫ్ ఇవాన్ బకనోవ్, రష్యా యుద్ధ నేరాలపై వాదనలు వినిపిస్తున్న ప్రాసిక్యూటర్ ఇరినా వెనెదిక్టోవాలాను తొలగించారు జెలెన్‌స్కీ.
ఆదివారం సాయంత్రం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు అధ్యక్షుడు జెలెన్‌స్కీ. 2014లో రష్యా ఆక్రమించుకున్న క్రిమియాలో ఎస్‌బీయూ సెక్యూరిటీ చీఫ్‌గా పని చేసిన అధికారిని ఇటీవలే అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రష్యా సైనిక చర్య చేపట్టిన తొలినాళ్లలోనే సెక్యూరిటీ విభాగంలోని పలువురు ఉన్నతాధికారులను తొలగించినట్లు చెప్పారు. సెక్యూరిటీ చీఫ్‌పై అన్ని విధాల ఆధారాలు సేకరించామన్నారు.
ఇదీ చదవండి: రష్యా దాడిలో చిన్నారి మృతి.. మిన్నంటిన తండ్రి రోదనలు
Comments
Please login to add a commentAdd a comment