Zelensky declares Kherson is 'ours' After Russian Troops Withdraw
Sakshi News home page

ఉక్రెయిన్‌లో తోకముడిన పుతిన్‌ సేనలు.. జెలెన్‌ స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు 

Published Sat, Nov 12 2022 3:07 PM | Last Updated on Sat, Nov 12 2022 3:34 PM

Kherson IS Ours Zelensky Declares After Russian Troops Withdraw - Sakshi

ఉక్రెయిన్‌ ఆక్రమణే లక్ష్యంగా రష్యా సేనలు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. గత  కొన్ని నెలలుగా రష్యా సైన్యం.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. బాంబు దాడులతో ఉక్రెయిన్ సేనలను, ఆ దేశ పౌరులను భయభాంత్రులకు గురిచేసిన విషయం తెలిసిందే. అయితే, ఉక్రెయిన్‌ యుద్ధం తీరు క్రమక్రమంగా మారిపోయింది రష్యాపై ఉక్రెయిన్‌ సైన్యం ఆధిపత్యం కొనసాగించే స్థితికి చేరుకుంది. ఇప్పటికే పలు నగరాలను ఆక్రమించుకున్న రష్యా సేనలను తరిమికొట్టి ఉక్రెయిన్‌ సైనం వారి దేశంలోని కీలక నగరాలను మరలా స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌ సైన్యం మరో విజయం సాధించింది. 

ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన ఖేర్సన్‌ నగరాన్ని ఉక్రెయిన్‌ తిరిగి ఆక్రమించుకుంది. కాగా, తాజాగా రష్యా దళాలు ఖేర్సన్‌ను వీడుతున్నాయి. ఖేర్సన్‌ దాని పరిసర ప్రాంతాల నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ మేరకు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు రష్యా పేర్కొంది. నిప్రో నది పశ్చిమ తీరం నుంచి బలగాలను పూర్తిగా వెనక్కు తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ సైన్యం ఇప్పటికే నగరంలోకి ప్రవేశించిందని ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. ఈ పరిణామాన్ని ‘కీలక విజయంగా’ అభివర్ణించింది.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ స్పందించారు. ఈ సందర్భంగా ‘ఖేర్సన్‌ నగరం ఇక మాదే’ అంటూ ప్రకటించారు. ‘మన ప్రజలు, మన ఖేర్సన్‌’ అంటూ టెలిగ్రామ్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతానికి ఉక్రెయిన్‌ బలగాలు నగర శివార్లలో ఉన్నాయని, ప్రత్యేక విభాగాలు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయని తెలిపారు. రష్యా సేనలు పేలుడు పదార్థాలను వదిలిపెట్టాయన్న అనుమానంతో వాటిని తొలగించేందుకు సంబంధిత నిపుణులు రంగంలోకి దిగినట్లు చెప్పారు. ఇక, ఈ విజయంతో ఉక్రెయిన్ సైన్యం, పౌరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చి.. ఉక్రెయిన్‌ జెండాలను ఎగురవేస్తూ విజయం మాదే అంటూ సంబురాలు జరుపుకుంటున్నారు. 

ఇది కూడా చదవండి: బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3కు ఊహించని షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement