న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రష్యన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నికోలాయ్ పాత్రుషేవ్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుత సమయంలో అఫ్గాన్‌తో సహా ప్రాంతీయ సుస్థిరత దిశగా మరింత సమన్వయాన్ని బలోపోతం చేయాలంటూ పునరుద్ఘాటించారు. భారత్ -రష్యాల మధ్య భాగస్వామ్య అభివృద్ధి, రాజకీయాలు, బహుళ ఫార్మేట్స్, ఎస్‌సీఓ, బ్రిక్స్ తదితర విషయాలపై సంభాషించారు. నికోలాయ్ తన రెండు రోజుల ఇండియా పర్యటనలో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా భేటీ అయ్యారు.
అఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ తీవ్రవాద గ్రూపులకు ఉనికిగా మారే అవకాశం ఉందని సెక్యూరిటీ అడ్వైజర్‌లు అభిప్రాయపడ్డారు. తీవ్రవాద గ్రూపులకు ఆయుధాల ప్రవాహం, అఫ్ఘన్ సరిహద్దుల్లో అక్రమ రవాణా, అఫ్ఘనిస్తాన్ నల్లమందు ఉత్పత్తి అక్రమ రవాణాకు కేంద్రంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సెక్యూరిటీ వర్గాలు తెలిపాయి. తాలిబన్లతోపాటుగా, ఇతర అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలతో పాకిస్తాన్ సంబంధాలను కలిగి ఉందనే విషయాన్ని భారత్ గుర్తుచేసింది. అఫ్ఘనిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా మారకుండా చూసుకునే బాధ్యత పాకిస్తాన్‌పై ఉందని భారత్ పేర్కొంది.
Was happy to meet Mr. Nikolai Patrushev, Secretary of the Security Council of Russia. His visit allowed useful discussions between both sides on important regional developments. pic.twitter.com/v0cwJH1yAF
— Narendra Modi (@narendramodi) September 8, 2021
చదవండి: అగర్తలలో ఉద్రిక్తత: ఆగంతకుల దాడిలో సీపీఎం కార్యాలయానికి నిప్పు
Comments
Please login to add a commentAdd a comment