![Russia Said Pentagon Set Train Former Afghan Pilots In California - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/30/Pilot.jpg.webp?itok=mcBPSu8g)
These wouldn't affect of Russia's special military operation in Ukraine: అఫ్గనిస్తాన్‌లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం కూలిపోయిన తదనంతరం తాలబన్లు అఫ్గాన్‌ని తమ నియంత్రణలోకి తెచ్చుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాలిబన్ చేతుల్లోకి వెళ్లిన అఫ్గాన్ దేశంలో ఉండలేమంటూ చాలామంది అప్గనిస్తాన్ సైనిక, వైమానిక దళ సిబ్బంది ఉజ్బెకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా వంటి దేశాలకు పారిపోయారు.
దీంతో అత్యాధునిక ఆయుధాలు తాలిబన్ల హస్తగతమైంది. ఇలా అమెరికాకు పారిపోయిన అఫ్గాన్ పైలెట్లకు పెంటగాన్(యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆప్ డిఫెన్స్) సైనిక శిక్షణ ఇస్తుందని రష్యా చెబుతోంది. ఆ సైనిక శిక్షణలో అఫ్గాన్‌కి చెందిన మాజీ పైలెట్లు, ప్రత్యేక విభాగాల్లో పనిచేసిన అధికారులు కూడా ఉన్నారని తెలిపింది. వీరంతా శిక్షణ పొందిన తదనంతరం పోలాండ్ గుండా ఉక్రెయిన్‌లోకి ప్రవేశిస్తారని, యుద్ధంలో పాల్గొనేలా వారితో ఒప్పందం కూడా కుదుర్చుకుంటుందని రష్యా సైనిక దౌత్యవేత్తలు పేర్కొన్నట్లు రష్యా స్థానిక మీడియా వెల్లడించింది.
ఐతే రష్యా మాత్రం తాము ఉక్రెయిన్‌లో జరుపుతున్న ప్రత్యేక సైనిక చర్యను ఇలాంటి ప్రయత్నాలు ఏ మాత్రం ప్రభావితం చేయలేదని తేల్చి చెప్పింది. రష్యాను నియంత్రించడం అసాధ్యం అని ధీమాగా చెబుతోంది. ఐతే యూఎస్ నుంచి ఈ విషయమై ఎలాంటి ప్రతిస్పందన లేదు. అలాగే పలు నివేదికల ప్రకారం... అఫ్గాన్‌లో స్పెషల్ వింగ్‌కు చెందిన పలువురు పైలెట్లు తమ విమానాలను ఇతర దేశాల సరిహద్దుల గుండా నడిపినట్లు పేర్కొంది.
పైగా ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా పారిపోయిన అనేకమంది పైలెట్లును తజికిస్తాన్ అధికారులు మూడు నెలలకు పైగా నిర్బంధించారని కూడా తెలిపింది. అంతేకాదు ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం కూడా తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 100 మంది అఫ్గాన్ సైనిక సిబ్బంది మరణించారని, చాల సైనిక కుటుంబాలు దేశం విడిచి పారిపోయినట్లు యూఎన్ తన నివేదికలో వెల్లడించింది. మరోవైపు హ్యుమన్ రైట్స్ వాచ్ తన నివేదికలో డజన్ల కొద్ది అఫ్గాన్ భద్రతాదళాల సభ్యులను ఉరితీసినట్లు పేర్కొంది. అంతేకాదు అఫ్గాన్ మాజీ భద్రతా దళ సభ్యుల కుటుంబాలను సైతం తాలిబన్లు వదలలేదని తెలిపింది.
(చదవండి: పారిపోండి.. చస్తారు! రష్యా బలగాలకు జెలెన్‌స్కీ సాలిడ్ వార్నింగ్.. ఖేర్‌సన్‌లో మిస్సైళ్ల వాన)
Comments
Please login to add a commentAdd a comment