Russia-Ukraine war: రష్యా సైన్యంలోకి అఫ్గాన్‌ కమాండోలు | Russia-Ukraine war: Russia recruiting Afghan special forces who fought with US to fight in Ukraine | Sakshi
Sakshi News home page

Russia-Ukraine war: రష్యా సైన్యంలోకి అఫ్గాన్‌ కమాండోలు

Nov 1 2022 4:53 AM | Updated on Nov 1 2022 4:53 AM

Russia-Ukraine war: Russia recruiting Afghan special forces who fought with US to fight in Ukraine - Sakshi

వాషింగ్టన్‌:  అఫ్గానిస్తాన్‌లో అమెరికా సేనలతో కలిసి తాలిబన్లపై పోరాడిన ప్రత్యేక దళాల సైనికులు ఇప్పుడు రష్యాకు క్యూ కడుతున్నారు. రష్యా సైన్యంలో చేరి, ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాలుపంచుకుంటున్నారు. వీరంతా అమెరికా సైన్యం శిక్షణ ఇచ్చిన కమాండోలు కావడం విశేషం. అఫ్గాన్‌ నుంచి అమెరికా సైన్యం వెనక్కి మళ్లిన తర్వాత తాలిబన్ల నుంచి ముప్పును తప్పించుకొనేందుకు ఈ కమాండోలు ఇరాన్‌కు చేరుకున్నారు.

వీరిని రష్యా తన సైన్యంలో చేర్చుకొని, ఉక్రెయిన్‌కు పంపిస్తోంది. ఈ విషయాన్ని ముగ్గురు అఫ్గాన్‌ మాజీ సైనికాధికారులు స్వయంగా వెల్లడించారు. యుద్ధంలో పాల్గొన్నందుకు గాను ఒక్కో జవానుకు రష్యా ప్రతినెలా 1,500 డాలర్ల చొప్పున వేతనం చెల్లిస్తోందని తెలిపారు. నిజానికి ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో పాల్గొనడం అఫ్గాన్‌ కమాండోలకు ఇష్టం లేదని, కానీ, వారికి మరో దారి కనిపించడం లేదని అబ్దుల్‌ రవూఫ్‌ అనే మాజీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement