ప్రతీకాత్మక చిత్రం
యశవంతపుర (బెంగళూరు): విభేదాలు పరిష్కరించుకుందామంటూ అమెరికా నుంచి భార్యను తీసుకువ్చన ఓ భర్త.. ఆమెకు తెలియకుండా తిరిగి అమెరికా చెక్కేశాడు. ఆ తర్వాత వాట్సాప్‌లో ఆమెకు తలాక్ చెప్పాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరుకు చెందిన డాక్టర్ జావేద్ ఖాన్, రేష్మా అజీజ్‌లకు 2003లో పెళ్లయింది. అమెరికాలోని ఇల్లినాయిస్‌లోఉంటున్న వీరికి 13 ఏళ్ల కూతురు, 10 ఏళ్ల కొడుకు ఉన్నారు.
కాగా దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని నవంబర్ 30వ తేదీన వారు బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఇప్పుడే వస్తానంటూ చెప్పి భార్యను ఇంటికి పంపించి వేశాడు. తాను మాత్రం విమానంలో మళ్లీ అమెరికా వెళ్లిపోయాడు. తర్వాత తలాక్ అంటూ మూడుసార్లు వాట్సాప్‌లో పోస్టులు, వాయిస్ మెసేజ్‌లు పంపించాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment