భారతదేశంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌తో సహా చాలా మంది విద్యార్థులకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ నుంచి కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. కొన్ని నంబర్ల నుంచి విద్యార్థులకు వస్తున్న కాల్స్, మెసేజ్‌లలో వారిని సోషల్ మీడియా గ్రూపులలో చేరాలని, సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలని కోరుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌నకు చెందిన గ్యాడ్జెట్స్ నౌ కథనం పేర్కొంది.
ఇలా కాల్స్ చేస్తున్నవారు తమను పాఠశాల ఉపాధ్యాయులుగా చెప్పుకొంటూ కొత్త క్లాస్ గ్రూప్‌లలో చేరాలని విద్యార్థులను కోరుతున్నారు. ఈ నెపంలో వారికి ఓటీపీలను పంపుతున్నారు. తాము ఉపాధ్యాయులేనని నమ్మించేందుకు విద్యార్థులకు తెలిసిన వారి పేర్లు చెబుతున్నారు. ఈ అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వాట్సాప్ ద్వారానే వస్తున్నాయి. ఇలాంటి రెండు అనుమానాస్పద నంబర్‌లను అధికారులు గుర్తించారు. అవి 8617321715, 9622262167. ఈ కాల్స్ గురించి విద్యార్థులు, సిబ్బందిని ఆర్మీ పబ్లిక్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు హెచ్చరించారు.
ఇదీ చదవండి ➤ వాషింగ్టన్ పోస్ట్ సీటీవోగా వినీత్ ఖోస్లా
విద్యార్థులు గ్రూపుల్లో చేరిన తర్వాత వారి నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. విద్యార్థుల తండ్రి ఉద్యోగం, ఉపాధ్యాయుల పేర్లు, వారికి సంబంధించిన సమాచారం అడుగుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు దీని గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులను చైతన్యపరచాలని ఆర్మీ స్కూళ్ల అధికారులు కోరుతున్నారు. ఆ రెండు నంబర్ల నుంచే కాకుండా ఇతర నంబర్ల నుంచి కూడా కాల్స్, మెసేజ్‌లు రావచ్చని, అనుమానాస్పద కాల్స్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment