
వినోద్ కాంబ్లి(ఫైల్)
పంజగుట్ట: వివాహేతర సంబంధంపై భార్య నిలదీసినందుకు ఓ వ్యక్తి ‘తాను ఆత్మహత్య చేసుకుంటానని’ భార్యకు మెసేజ్ పంపి అదృశ్యమైన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆదిలక్ష్మి, వినోద్‌కాంబ్లి దంపతులు గత కొంత కాలం క్రితం నగరానికి వలస వచ్చి చింతల్‌బస్తీ, వీర్‌నగర్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. కొద్దిరోజులుగా వినోద్‌కాంబ్లీ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలియడంతో ఆదిలక్ష్మి అతడిని మందలించింది. దీంతో ఈ నెల 22న డ్యూటీకి వెళ్లిన వినోద్ ‘తాను చనిపోతానని’ ఆదిలక్ష్మికి మెసేజ్ పంపించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె అతడి కోసం ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో గురువారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment