
న్యూఢిల్లీ: యూనివర్సిటీలో దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మూక గురించి పోలీసులకు ముందే సమాచారమిచ్చామని, అయినా వారు చర్యలు తీసుకోలేదని జేఎన్‌యూ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ఆరోపించింది. ఈ నెల 5న మధ్యాహ్నం 3:00 గంటలకు వాట్సాప్‌లో పోలీసులకు మెసేజ్ పెట్టామని, ఆ మెసేజ్‌ను పోలీసులు 3:07 గంటలకు చూసి కూడా పట్టించుకోలేదని విద్యార్థి సంఘం తెలిపింది. ఈ దాడికి పాల్పడింది ఆరెస్సెస్‌కు చెందిన ఏబీవీపీ వర్గం వారేనని ఆరోపించింది. గత వారంలోకూడా తమ సంఘానికి చెందిన నాయకుల మీద వారు దాడిచేసినట్లు తెలిపింది. దాడికి ముందురోజు సాయంత్రం కూడా విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర యాదవ్‌పై దాడిచేశారని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment