JNU Students Union
-
ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థి సంఘాల ఘర్షణ
న్యూఢిల్లీ: రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఆదివారం తీవ్ర ఘర్షణ చెలరేగింది. దాంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారు. క్యాంపస్‌లోని కావేరీ హాస్టల్ మెస్‌లో మాంసాహారం వడ్డించకుండా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) కార్యకర్తలు ఆరోపించారు. క్యాంపస్‌లో రామనవమి పూజకు జేఎన్‌యూఎస్‌యూ నేతలు ఆటంకాలు సృష్టించారని ఏబీవీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. దాంతో రగడ మొదలయ్యింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు చెప్పారు. కానీ, దాదాపు 60 మందికి గాయాలయ్యాయని జేఎన్‌యూఎస్‌యూ నేతలు పేర్కొన్నారు. తమ కార్యకర్తలు 10 మంది గాయపడ్డారని ఏబీవీపీ నాయకులు తెలిపారు. -
ముందే చెప్పాం.. పట్టించుకోలేదు
న్యూఢిల్లీ: యూనివర్సిటీలో దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మూక గురించి పోలీసులకు ముందే సమాచారమిచ్చామని, అయినా వారు చర్యలు తీసుకోలేదని జేఎన్‌యూ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ఆరోపించింది. ఈ నెల 5న మధ్యాహ్నం 3:00 గంటలకు వాట్సాప్‌లో పోలీసులకు మెసేజ్ పెట్టామని, ఆ మెసేజ్‌ను పోలీసులు 3:07 గంటలకు చూసి కూడా పట్టించుకోలేదని విద్యార్థి సంఘం తెలిపింది. ఈ దాడికి పాల్పడింది ఆరెస్సెస్‌కు చెందిన ఏబీవీపీ వర్గం వారేనని ఆరోపించింది. గత వారంలోకూడా తమ సంఘానికి చెందిన నాయకుల మీద వారు దాడిచేసినట్లు తెలిపింది. దాడికి ముందురోజు సాయంత్రం కూడా విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర యాదవ్‌పై దాడిచేశారని చెప్పింది. -
పట్నాలో కన్హయ్యకు ఘనస్వాగతం
పట్నా: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు ఆయన స్వరాష్ట్రమైన బిహార్‌లో శనివారం రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. రాజద్రోహం కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయనకు నితీశ్ కుమార్ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ఢిల్లీ నుంచి పట్నా విమానాశ్రయానికి చేరుకున్న ఆయన పోలీసుల రక్షణలో నగరంలోకి చేరుకున్నారు. సీఎం నితీశ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లతో వారి నివాసాల్లో భేటీ అయ్యారు. తర్వాత బేగుసరాయ్ జిల్లాలోని తనింటికి వెళ్లారు. కాగా, రాజద్రోహం అభియోగాలున్న కన్హయ్యకు ప్రభుత్వం ఘన స్వాగతం పలకడం రాష్ట్రానికి సిగ్గుచేటని విపక్ష బీజేపీ ఆరోపించింది. అయితే రాష్ట్రవాసి అయిన కన్హయ్యపై ఢిల్లీలో దాడి జరిగిందని, ఆయనకు లోపరహిత భద్రత కల్పించం తప్పుకాదని రాష్ట్ర మంత్రి, అశోక్ చౌధురి అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అసహనం పెరిగిందని కన్హయ్య ఆరోపించారు.అఫ్జల్ ఉరితీతకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి జేఎన్‌యూ తనకు వేసిన రూ. 10వేల జరిమానాను చెల్లిస్తామని ముంబై మునిసిపల్ కార్మికులు చెప్పారని తెలిపారు. వారు రూ. 10వేలు సేకరించారని, అయితే జరిమానా కట్టబోమన్నారు.