'సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ఎస్ఎస్ అడ్డా'
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ లకి అడ్డాగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ధ్వజమెత్తారు. వీసీ అప్పారావు తాను నిమిత్తుడనని చెప్పడమే అందుకు నిదర్శనమన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్టు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. విద్యార్థి రోహిత్ మరణానికి ఆర్ఎస్ఎస్ కారణమని ఆయన ఆరోపించారు. మృతుడిపై మత తత్వ ముద్ర వేస్తున్నారని తెలిపారు.