
మంత్రులంతా మనతోనే ఉన్నారు.. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సాయం చేస్తాను
ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది. ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తుండగా, రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు బయటకు లీకయ్యాయి. దాదాపు 500 పేజీలకుపైగా ఉన్న ఈ చాట్ మెసేజ్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇవి తిరుగులేని ఆధారాలు అంటూ పలువురు స్పందిస్తున్నారు. అయితే కొన్ని చాట్‌లలో టీఆర్పీకి సంబంధించి అవసరమైతే పార్థోదాస్‌కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సాయం చేస్తానంటూ అర్నబ్ గోస్వామి హామీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరో చాట్‌లో మంత్రులంతా మనతోనే ఉన్నారు.. అని చెబుతున్నట్లు ఉంది. కండీవలి పోలీసు స్టేషన్‌లో ఈ కేసు నమోదైనట్లు కనిపిస్తున్న ఈపీడీఎఫ్ పేజీల్లో ప్రతి పేజీకి పలువురి సంతకాలు ఉండటం గమనార్హం. (టీఆర్పీ కేసు: అర్నబ్ గోస్వామికి ఊరట)
Mumbai Police releases 500 pages WhatsApp chat between Arnab Goswami and Partho Das Gupta ( Ex CEO of BARC) pic.twitter.com/C3wnxjRi0N
— Abhijeet Dipke (@abhijeet_dipke) January 15, 2021