ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం తలాయి గ్రామం సమీపంలో పెద్దవాగులో ఓ వింత చేప లభ్యమైంది. పనెం శంకర్ చేపలు పట్టేందుకు వెళ్లగా.. అతడికి ఈ చేప దొరికింది. నల్లమచ్చలతో ఆకారం వింతగా ఉండటంతో చేపను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.
ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ ఫీల్డ్ అధికారి మధుకర్ను సంప్రదించగా.. ఈ చేపను డెవిల్ ఫిష్ అంటారని తెలిపారు. ఎక్కువగా ప్రాణహిత జలాల్లో సంచరిస్తుందని పేర్కొన్నారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు జాలర్లకు దొరికిన ఘటనలు లేవని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వైపు జిలాల్లో ఎక్కువగా వీటి సంచారం ఉంటుందని, ఈ చేపలు తినేందుకు పనికి రావని తెలిపారు.
ఇవి చదవండి: చచ్చిన ఎలుకల కోసం రైల్వే పైలెట్ ప్రాజెక్ట్
Comments
Please login to add a commentAdd a comment