Bejjur
-
Devil Fish: ఇటువంటి చేపను మీరెప్పుడైనా చూశారా?
ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం తలాయి గ్రామం సమీపంలో పెద్దవాగులో ఓ వింత చేప లభ్యమైంది. పనెం శంకర్ చేపలు పట్టేందుకు వెళ్లగా.. అతడికి ఈ చేప దొరికింది. నల్లమచ్చలతో ఆకారం వింతగా ఉండటంతో చేపను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ ఫీల్డ్ అధికారి మధుకర్‌ను సంప్రదించగా.. ఈ చేపను డెవిల్ ఫిష్ అంటారని తెలిపారు. ఎక్కువగా ప్రాణహిత జలాల్లో సంచరిస్తుందని పేర్కొన్నారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు జాలర్లకు దొరికిన ఘటనలు లేవని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వైపు జిలాల్లో ఎక్కువగా వీటి సంచారం ఉంటుందని, ఈ చేపలు తినేందుకు పనికి రావని తెలిపారు.ఇవి చదవండి: చచ్చిన ఎలుకల కోసం రైల్వే పైలెట్ ప్రాజెక్ట్ -
కోమరంభీం జిల్లాలో టీఆర్ఎస్కు షాకిచ్చిన నేతలు... లేఖలో ఆవేదన
సాక్షి, కొమరంభీం జిల్లా: కోమరంభీం జిల్లాలోని బెజ్జూర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మండలంలోని పలు అభివృద్ధి పనులు జరగడం లేదని పలువురు ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇచ్చిన హమీలు నేరవేయడం లేదని ముగ్గురు సర్పంచ్‌లు, జడ్పీటీసీ పుష్పలత, ఎంపీటీసీతో పాటు కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, బెజ్జూర్ సహాకర సంఘం డైరెక్టర్ రాజీనామా చేశారు. ఏళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కరించకపోడవం వల్లే రాజీనామా చేశామని సదరు ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికి లేఖ రాశారు. -
కేసులు బనాయిస్తాం జాగ్రత్త.. ‘సాక్షి’కి బెదిరింపులు
బెజ్జూర్ (సిర్పూర్): ‘కలప అక్రమ దందా నువ్వే చేపడుతున్నావు.. ఏం అనుకుంటున్నావు.. నువ్వు ఎక్కువ చేస్తున్నావ్.. నీపై కేసులు బనాయిస్తాం..’ అంటూ బెజ్జూర్ అటవీ శాఖ ఎఫ్ఎస్వో ప్రసాద్ బుధవారం ‘సాక్షి’ బెజ్జూర్ విలేకరిని బెదిరింపులకు గురిచేశారు. ‘మాయమవుతున్న కలప’ శీర్షికతో రేంజ్ పరిధిలో కలప అక్రమ రవాణాపై ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. కలప అక్రమ రవాణాను అడ్డుకోలేని అధికారులు బుధవారం ఉదయం ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేసి భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడారు. నిఘా పెంచి కలప అక్రమ రవా ణాను అడ్డుకుంటామని తెలపాల్సిన అధికారులు ఇలా భయబ్రాంతులకు గురిచేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ కాల్‌పై ఎఫ్ఆర్వో దయాకర్‌ను వివరణ కోరగా ఈ విషయంపై విచారణ చేపడతామని వెల్లడించారు. ప్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు.. ‘సాక్షి’ కథనంతో స్పందించిన అటవీ అధికారులు బుధవారం బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన ఎస్కే మోహిత్ అనే వ్యక్తి ఇంట్లో ప్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టి 25 టేకు కలప చెక్కలను పట్టుకున్నారు. ఈ మేరకు ప్లైయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్వో అప్పలకొండ వెల్లడించారు. దీని విలువ రూ.8500లు ఉంటుందని వివరించారు. ఈ దాడుల్లో బెజ్జూర్ ఎఫ్ఆర్వో దయాకర్, ఎఫ్ఎస్వో ప్రసాద్, బీట్ అధికారి వెంకటేశ్, సిబ్బంది ఉన్నారు. -
బెజ్జూరులో పెద్దపులి సంచారం
ఆసిఫాబాద్: జిల్లాలోని బెజ్జూరు మండలం గొల్లబావి గ్రామ శివారులో పెద్ద పులి సంచరిస్తుందనే వార్త ధావానంలా పాకడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. తెల్లవారుజామున వ్యవసాయ బావుల వద్దకు వెళ్తున్న రైతులు పులిని చూసినట్లు గ్రామస్థులకు తెలపడంతో.. వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అటవీ అధికారులకు సమాచారం అందించారు. -
ఎడతెరిపి లేని వాన
బెజ్జూర్ : బెజ్జూర్ మండలంలో గత రెండు రోజుల నుంచి వర్షం కురుస్తోంది. సోమవారం 11 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గ్రామాలకు వెళ్లే మార్గాల్లో ఉన్న వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువుల్లో నీరు చేరి నిండు కుండను తలపిస్తున్నాయి. మండలంలో సాదారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. -
కోడి పందేల స్థావరంపై మెరుపు దాడి
బెజ్జూరు (ఆదిలాబాద్ జిల్లా) : దహెగాం మండలం కర్ధి అటవీ ప్రాంతంలో కోడి పందేల స్థావరంపై పోలీసులు శనివారం ఆకస్మిక దాడి నిర్వహించారు. 45 మందిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. సుమారు రూ.60 వేల నగదు, 3 ఆటోలు, 32 కత్తులు, 14 బైక్‌లు, 30 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు దహెగాం ఎస్ఐ రమేశ్ తెలిపారు. పట్టుబడిన వారిలో దహెగాం, భీమిని, బెజ్జూరు మండలాలకు చెందిన వారున్నారు. -
నాటుసారా నిల్వలు ధ్వంసం
బెజ్జూరు (ఆదిలాబాద్) : భారీ మొత్తంలో దాచిన నాటుసారా నిల్వలను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని మరిపెడ తండాలో భారీమొత్తంలో సారా నిల్వలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడి చేసి 10 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. మరో 50 లీటర్ల గుడుంబాను కూడా సీజ్ చేశారు. -
మాది రైతు ప్రభుత్వం
బెజ్జూర్ : టీఆర్ఎస్ సర్కార్ రైతు ప్రభుత్వమని, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత తమ సర్కారుదేనని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. బెజ్జూర్ మండల పరిషత్ కార్యాలయం, అర్కగూడ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. పంటల రుణమాఫీ అమలు చేసి మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. బ్యాంకులు రుణం ఇవ్వకుంటే తమకు ఫోన్ చేయాలని రైతులకు సూచించారు. ఈ నెల మొదటి వారంలో కురిసిన వర్షాలతో పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందని తెలిపారు. 53 రోడ్లు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫొటోలతో సహా వివరించామని, స్పందించిన ఆయన ఐదేళ్ల కాలంలో సిర్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామన్నారని తెలిపారు. డూప్లికేట్ పట్టా పాస్‌పుస్తకాలపై రుణం పొందినవారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం నుంచి అధికారులు పంటనష్టం సర్వే చేస్తారని, జాబితాను గ్రామ పంచాయతీలో ప్రదర్శనకు పెడతారని తెలిపారు. రోడ్డు మరమ్మతుల కోసం రూ.7 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారని, ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.20 లక్షలు విడుదల చేస్తామని చెప్పారు. రెండు రోజుల్లో తునికాకు రాయల్టీ డబ్బులు కూలీలకు అందుతాయన్నారు. ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేశామని చెప్పారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్, ఐటీడీఏ ద్వారా రోడ్లు బాగు చేస్తామన్నారు. ఎమ్మెల్యే కోనేరు కొనప్ప మాట్లాడుతూ వరదలతో ఏటా నాగుల్వాయి,లోడ్పెల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి పునరావాసం కల్పించాలని కోరారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పెంచాలన్నారు. అంతకుముందు బారెగూ డ వంతెన, దెబ్బతిన్న రోడ్లు, పంటలను మంత్రి పరిశీలించారు. బెజ్జూర్‌లో ఫొటో ప్రదర్శనను తిలకించారు. నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రాజి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, టీఆర్ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్, పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఏపీఆర్వో భీమ్‌కుమార్, ఎంపీడీవో చంద్రకళ, ఎంపీపీ సిర్పూరం మంజుల, జెడ్పీటీసీ శారద, ఉట్సారంగపెల్లి సర్పంచ్ విశ్వేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
రోడ్డు నిర్మాణం.. ప్రచారాస్త్రమే !
బెజ్జూర్, న్యూస్‌లైన్ : ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వాలు.. స్థాని క ప్రజాప్రతి నిధులు మారి నా రోడ్డు సమస్య తీరడం లేదు. ఎన్నికల సమయంలో ప్ర చారాస్త్రంగా మారుతూనే ఉంది. ఇచ్చిన హామీలను నాయకులు మర్చిపోతూనే ఉన్నా రు. మండలంలోని ఎర్రగుంట, నందిగాం, మొర్లిగూడ, జిల్లేడ గ్రామాల ప్రజలు దీర్ఘకాలంగా సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నా రు. పాపన్‌పేట నుంచి మొర్లిగూడ వరకు 12కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆరు కిలోమీట ర్ల మేర అటవీ శాఖ భూమి ఉంది. మొర్లిగూడ పక్కనే జిల్లేడ, నందిగాం గ్రామాలున్నాయి. మొర్లిగూడ, జిల్లెడ గ్రామాల్లో 2000 మంది జ నాభా ఉండగా.. వీరిలో 1,070 మంది ఓటర్లు ఉన్నారు. అందరూ గిరిజనులే. పాపన్‌పేట్ గ్రామం నుంచి అటవీ ప్రాంతంలో రో డ్డు ని ర్మాణం చేపడితే సమస్య తీరిపోతుంది. బస్సు సౌకర్యమూ కలుగుతుంది. కానీ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతి లభించడం లేదు. రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే నిధుల నుంచి మట్టి రోడ్డు వేసినా అటవీ శాఖ పరిధిలోని భూ మి వరకు రాగానే నిలిపివేశారు. ఎన్నికల సమయంలో నాయకులు ఇస్తున్న హామీలు ఇప్పటి కీ నెరవేరడం లేదు. బెజ్జూరుకు 20 కిలోమీటర్ల దూరంలోని ఎర్రగుంట గ్రామంలో 400 మం ది జనాభా ఉన్నారు. అక్కడ ఇప్పటికీ కరెం టు, రోడ్డు, నీటి సమస్య తీవ్రంగా ఉంది. పెంచికల్‌పేట నుంచి ఎర్రగుంటకు రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఆరు కిలోమీటర్లు కాలినడ క, ఎడ్లబండిపై వెళ్తున్నారు. సమస్యలు పరిష్కరించే వారికే ఓటు వేస్తామని ఆయా గ్రామాల ప్రజలు తేల్చిచెబుతున్నారు.