కోడి పందేల స్థావరంపై మెరుపు దాడి | 45 arrested in cockfighting raid | Sakshi
Sakshi News home page

కోడి పందేల స్థావరంపై మెరుపు దాడి

Published Sat, Jan 9 2016 4:52 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

45 arrested in cockfighting raid

బెజ్జూరు (ఆదిలాబాద్ జిల్లా) : దహెగాం మండలం కర్ధి అటవీ ప్రాంతంలో కోడి పందేల స్థావరంపై పోలీసులు శనివారం ఆకస్మిక దాడి నిర్వహించారు. 45 మందిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. సుమారు రూ.60 వేల నగదు, 3 ఆటోలు, 32 కత్తులు, 14 బైక్‌లు, 30 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు దహెగాం ఎస్‌ఐ రమేశ్ తెలిపారు. పట్టుబడిన వారిలో దహెగాం, భీమిని, బెజ్జూరు మండలాలకు చెందిన వారున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement