కల నెరవేరిందా? | Hansika to feature in 'Thala 56'? | Sakshi
Sakshi News home page

కల నెరవేరిందా?

Published Sat, Oct 18 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

కల నెరవేరిందా?

కల నెరవేరిందా?

తమిళ చిత్రపరిశ్రమలో ‘మీకు ఏ హీరో సరసన నటించాలని ఉంది’ అని అడిగితే.. ఎక్కువమంది హీరోయిన్లు చెప్పే పేరు ‘అజిత్’. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో హన్సిక కూడా ఇదే సమాధానం చెప్పారని చెన్నయ్ టాక్. ఆమె అలా అన్నప్పుడు తథాస్తు దేవతలు దీవించేశారేమో..! ఎందుకంటే హన్సిక కల త్వరలో నెరవేరనుందట. ప్రస్తుతం అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం తర్వాత శివ దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించారట. ఇందులో విద్యాబాలన్‌ని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారనే వార్త ప్రచారమైంది. అయితే అది నిజం కాదట. తాజాగా, హన్సిక పేరు వినిపిస్తోంది. అజిత్ సరసన ఈ బ్యూటీని దాదాపుగా ఖరారు చేశారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement