అజిత్‌ 'పట్టుదల' సినిమా ట్విటర్‌ రివ్యూ | Ajith Pattudala Movie twitter Review | Sakshi
Sakshi News home page

అజిత్‌ 'పట్టుదల'కు అనిరుధ్ బలగం.. టాక్‌ ఎలా ఉందంటే..?

Published Thu, Feb 6 2025 8:25 AM | Last Updated on Thu, Feb 6 2025 9:31 AM

Ajith Pattudala Movie twitter Review

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ (Ajith Kumar) నటించిన తాజా చిత్రం విదాముయార్చి(Vidaamuyarchi Movie) తెలుగులో 'పట్టుదల' టైటిల్‌తో ఫిబ్రవరి 6న విడుదలైంది. ఇప్పటికే పలుచోట్ల సినిమా ప్రీమియర్స్‌ షోలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించారు. సినిమా చూసిన అభిమానులు ట్విట్టర్‌ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వంపై మంచి ప్రశంసలే వస్తున్నాయి. ఈ చిత్రంలో త్రిష అద్భుతంగా నటించడమే కాకుండా సరైన పాత్ర పడింది అంటూ మెచ్చుకుంటున్నారు. అయితే, ఈ మూవీలో అర్జున్‌ సర్జా పాత్ర ప్రధాన హైలెట్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో  లైకా ప్రొడక్షన్స్‌  ఈ మూవీని తెరకెక్కించింది.

ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌తోనే అజిత్ దుమ్మురేపాడని, ఆ స్పీడ్‌ తగ్గకుండా సినిమాలో వేగం ఉంటుందని ఆడియన్స్‌ చెబుతున్నారు. అజిత్‌ ఎంట్రీ సీన్‌ థియేట‌ర్‌లో గూస్‌బంప్స్‌ను తెప్పించేలా ఉంటుందని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు మగీజ్‌ తిరుమేని చాలా స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కించారని కోలీవుడ్‌ ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ మూవీకి ప్రధాన బలం యాక్ష‌న్ సీక్వెన్స్‌ అంటూ.. అవన్నీ హాలీవుడ్ రేంజ్‌లో  ఉన్నాయ‌ని తెలుపుతున్నారు.  ముఖ్యంగా ఇంట‌ర్వెల్ సమయంలో వచ్చే ఒక ఫైట్ సీన్‌లో అజిత్, అర్జున్ పోటీపడుతారని, ఈ ట్రైన్ యాక్ష‌న్ సీక్వెన్స్‌ ప్రేక్షకులను మరింత థ్రిల్లింగ్‌ను పంచుతాయని చెబుతున్నారు.

పట్టుదల సినిమా కథ రొటిన్‌లా కాకుండా చాలా డిఫరెంట్‌గా చెప్పారని నెజన్లు తెలుపుతున్నారు. దర్శకత్వంతో పాటు సినిమాకు స్క్రీన్‌ ప్లే మరింత బలాన్ని ఇచ్చిందని అంటున్నారు. సినిమా ప్రారంభం నుంచే తర్వాత ఏం జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో  కలిగేలా ఉందన్నారు. ఇప్పటికే సినిమా చూసిన వారు చాలామంది 3.5 రేంటింగ్‌ పైగానే ఇస్తున్నారు. అజిత్‌ యాక్షన్‌ సీన్‌లకు అనిరుద్‌  బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ పీక్స్‌లో ఉంటుందని.. భారీ ఎలివేషన్స్‌కు అదిరిపోయే రేంజ్‌లో బీజీఎమ్‌ ఇరగదీశాడని అంటున్నారు. చాలా సర్‌ప్రైజ్‌లతో పట్టుదల సినిమా ఉంటుందని సినీ అభిమానులు మిస్‌ చేసుకోవద్దని కొందరు చెబుతున్నారు.  

అనుకోకుండా జరిగిన ఒక సంఘటనలో తన భార్య తప్పిపోతే ఆమె కోసం భర్త చేసిన పోరాటం ఎలా ఉంటుంది..? అనే కాన్సెప్ట్‌తో కథ ఉంటుందట. ఆమె జాడ కోసం హీరో ప్రయాణంలో ఎన్నో ట్విస్ట్‌లు ఎదురవుతూ ఉంటాయట. అయితే, చివ‌రి వ‌ర‌కు ఏం జ‌రుగుతుందో అనే టెన్ష‌న్‌ను ప్రేక్షకులలో ఉండేలా కరెక్ట్‌గా కథను చెప్పాడని  డైరెక్ట‌ర్‌పై ప్రశంసలు వస్తున్నాయి. ఫాస్ట్ ఫేజ్‌డ్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ అంటూ పేర్కొంటున్నారు.

విదాముయార్చి (పట్టుదల) అజిత్‌కు క‌మ్‌బ్యాక్‌ సినిమా అంటూ చాలామంది రివ్యూవర్లు అంటున్నారు. త్రిష రోల్ కూడా చాలా కాలం పాటు గుర్తు పెట్టుకునేలా ఉంటుందని తెలుపుతున్నారు. క్యారెక్ట‌రైజేష‌న్ కొత్త‌గా ఉండటంతో సినిమా అందరికీ నచ్చుతుందని చెబుతున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటూ..  అజిత్‌, త్రిష కాంబోలో వ‌చ్చే సీన్స్ బాగున్నాయని తెలుపుతున్నారు.

పట్టుదల సినిమాపై కొందరు నిరుత్సాహంగా కూడా ఉన్నారు. కథ చాలా సాధారణమైనదని చెబుతున్నారు. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు గతంలో చాలా వచ్చాయని అంటున్నారు. కథలో వేగం లేదని చాలా నెమ్మదిగా చెప్పారని విమర్శలు వస్తున్నాయి. ఎక్కువగా  కమర్షియల్ ఎలిమెంట్స్‌ కోసమే దర్శకుడు ప్లాన్‌ చేసుకున్నాడని అంటున్నారు. సినిమాను విమర్శించే వారు ఎక్కువగా 2.5 రేటింగ్‌ వరకు ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement