నం.1 నయనతారే! | No. 1 Nayanatara! | Sakshi
Sakshi News home page

నం.1 నయనతారే!

Published Mon, Apr 25 2016 1:15 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

నం.1 నయనతారే!

నం.1 నయనతారే!

సంచలన తారగా పేరొందిన నటీమణుల్లో ముందుండే నటి నయనతారనే అనక తప్పదు. చిత్ర పరిశ్రమలో చాలా మంది జయించడం లేదు. ముఖ్యంగా కథానాయికలు వరుసగా అవకాశాలను పొందడంలో విఫలం అవుతున్నారు. ఇక వేరే అవకాశాలు పొందినా వాటిని ఎక్కువ కాలం నిలబెట్టుకోవడం లేదు. అలాంటిది పదేళ్లకు పైగా చిత్రపరిశ్రమలో నంబర్‌ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నటి నయనతార అని చెప్పడంలో అవాస్తవం ఉండద నుకుంటా. సినిమా పరంగానూ, వ్యక్తిగతంగానూ పలు ఆటంకాలను, అనేక సమస్యలను ఎదురొడ్డి ఆ ప్రభావాలను తన నటనపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రముఖ నటిగా భాసిల్లుతున్న నటి నయనతార. అయ్యా చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమలోకి దిగుమతి అయిన కేరళ కుట్టి నయన.

ఆ తరువాత తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ తనదైన నటనా ప్రతిభతో అభిమానుల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. ఇక నయనతార నటిస్తే ఆ చిత్రం హిట్టే అన్న పేరును సంపాదించుకున్నారు. దీంతో దర్శక నిర్మాత ఆమె చుట్టూ తిరుగుతుంటే ప్రముఖ హీరోల నుంచి యువ నటుల వరకూ నయనతార తమకు జంటగా నటించాలని కోరుకుంటున్నారు. ఇటీవల ఒక ఆంగ్ల పత్రిక నిర్వహించిన దక్షిణాది అగ్ర కథానాయికి ఎవరన్న చర్చావేదికలో అగ్రస్థానం నయననే వరించింది.

నయనతార అందం, అభినయాలను ఇష్టపడుతున్నట్లు అధిక సంఖ్యలో అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2013లో చర్చావేదికలో 7వ స్థానంతోనే సరిపెట్టుకున్న నయనతార ఇప్పుడు ప్రథమ స్థానానికి ఎగబాకడం విశేషమే. ఇక రెండో స్థానంలో నటి శ్రుతిహాసన్ నిలువగా, మూడో స్థానాన్ని ఇంగ్లిష్ భామ ఎమీజాక్సన్, నాలుగు, ఐదు స్థానాల్లో అనుష్క, తమన్న దక్కించుకున్నారు. ఇక త్రిష, హన్సిక ఆ తరువాత స్థానాలకే పరిమితమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement