వారసుడు మూవీ వివాదం ముదురుతోంది. ఇటీవల తెలుగు నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం టాలీవుడ్-కోలీవుడ్ మధ్య లోకల్-నాన్‌లోకల్ వార్ రచ్చకు దారి తీసేల కనిపిస్తోంది. తెలుగులో వారసుడు, తమిళంలో వారిసుగా రానున్న ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి తెలుగు చిత్రాలకే ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని, డబ్బింగ్ సినిమాలు విడుదల చేయొద్దని తెలుగు సినీ నిర్మాతల మండలి రీసెంట్‌గా లేఖ విడుదల చేసింది. ఇక తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖపై తమిళ సినీ దర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: బేబీ బంప్ ఫొటోలు షేర్ షాకిచ్చిన హీరోయిన్, ఫొటోలు వైరల్
తమిళనాట తెలుగు సినిమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల అవుతున్నాయని, కానీ తెలుగులో తమిళ చిత్రాలను ఆపడం ఏంటని దర్శకులు ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు తాము కూడా తెలుగు చిత్రాలను అడ్డుకుంటామని వారు పేర్కొన్నారు. వారసుడు విషయానికి వస్తే దర్శక నిర్మాతలు ఇద్దరూ తెలుగు వారేనని, హీరో మాత్రమే తమిళ నటుడని డైరెక్టర్ సీమాన్ తెలిపారు. ఇంత జరుగుతున్న స్పందించకుండా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఏం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాగా ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు.
చదవండి: ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో..
Comments
Please login to add a commentAdd a comment