షూటింగ్‌లకు రండి.. రాయితీలు ఇస్తాం | Mauritius officials invite shooting for indian movies | Sakshi

షూటింగ్‌లకు రండి.. రాయితీలు ఇస్తాం

Jul 19 2017 1:27 PM | Updated on Sep 5 2017 4:24 PM

మారిషస్ వచ్చి మూవీ షూటింగ్స్ జరిపితే భారతీయ సినిమాలకు భారీ రాయితీలు కల్పిస్తామని మారిషస్ ఫిలిం డెవలప్ మెంట్ అధికారులు ఆహ్వానించారు.



చెన్నై: మారిషస్ వచ్చి మూవీ షూటింగ్స్ జరిపితే భారతీయ సినిమాలకు భారీ రాయితీలు కల్పిస్తామని మారిషస్ ఫిలిం డెవలప్ మెంట్ అధికారులు ఆహ్వానించారు. మారిషస్‌ దేశం ఫిలిం డెవలప్‌మెంట్‌ అధికారులు చెన్నైకి వచ్చి తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తమిళ నిర్మాతల మండలి కోశాధికారి ఎస్‌ఆర్‌ ప్రభు, ప్రధాన కార్యదర్శి జ్ఞానవేల్‌రాజా మారిషస్‌ దేశ ఫిలిం డెవలప్‌మెంట్‌ అధికారులతో పలు అంశాలపై చర్చించారు.

తమ దేశంలో షూటింగ్‌లు చేసుకోవడానికి రావాలని, ఆ మూవీలకు 45 శాతం రాయితీ కల్పిస్తామని మారిషస్‌ దేశ ఫిలిం డెవలప్‌మెంట్‌ అధికారులు చెప్పారు. సానుకూలంగా స్పందించిన తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు తమ నిర్మాతల అందరితో సంప్రదించి సరైన నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. రాయితీల విషయాన్ని నిర్మాతలకు వివరిస్తామని పేర్కొన్నారు.


మారిషస్ లోని గ్రాండ్ బే బీచ్ (ఫైల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement