వడివేలుతో ఫహద్ ఫాసిల్ దోస్తీ.. ఎందుకో తెలుసా | Fahadh Faasil And Vadivelu Big Plan For Their Next | Sakshi
Sakshi News home page

వడివేలుతో ఫహద్ ఫాసిల్ దోస్తీ.. ఎందుకో తెలుసా

Jan 2 2024 10:20 AM | Updated on Jan 2 2024 10:34 AM

Fahadh Faasil And Vadivelu Big Plan - Sakshi

ప్రముఖ హాస్య నటుడు వడివేలు, మలయాళ స్టార్‌ నటుడు ఫహద్ ఫాసిల్ కాంబినేషన్లో ఒక చిత్రం రూపొందనుంది. వీరిద్దరూ ఇంతకుముందు ఉదయనిధి స్టాలిన్‌ కథానాయకుడిగా నటించిన 'మామన్నన్‌' చిత్రంలో నటించారన్నది గమనార్హం. ఆ చిత్రంలో వడివేలు పాజిటివ్‌ పాత్రలో, ఫాహత్‌ ఫాజిల్‌ నెగిటివ పాత్రలోనూ నటించి మెప్పించారు. కాగా తాజాగా వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ఆర్‌బీ చౌదరి నిర్మించనుండడం విశేషం.

ఈయన ఇంతకుముందు తమిళం, తెలుగు తదితర భాషల్లో పలు సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా వడివేలు, ఫహద్ ఫాసిల్ కాంబినేషన్లో తన 98వ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికి వి.కృష్ణమూర్తి కథ, దర్శకత్వం బా ధ్యతలను వి.కృష్ణమూర్తి నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేశారు. కాగా ఇది రోడ్డు పైన నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం.

దీనికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని, కలై సెల్వన్‌ శివాజీ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. చిత్ర షూటింగ్‌ త్వరలోనే ప్రారంభించనున్నట్లు యూనిట్‌ వర్గాలు తెలిపారు. కాగా ఈ సంస్థలో ఆర్‌బీ చౌదరి ఇంతకుముందు విజయ్‌ హీరోగా జిల్లా వంటి పలు చిత్రాలను నిర్మించారు. కాగా ఈయన తన 100వ చిత్రాన్ని నటుడు విజయ్‌ కథానాయకుడిగా నిర్మించనున్నట్లు చాలా కాలం క్రితమే వెల్లడించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement