
పి.లక్ష్మి
ప్రముఖ నిర్మాత ఆదిత్యరామ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి శ్రీమతి పి.లక్ష్మి (70) శనివారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు చెన్నైలోని ఆదిత్యారామ్ నగర్‌లో జరిగాయి. చెన్నైలో ఆదిత్యరామ్ స్టూడియోస్ అధినేత, ఆదిత్యరామ్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆదిత్యరామ్ ‘సందడే సందడి, ఖుషి ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్’ వంటి చిత్రాలను నిర్మించి ఇండస్ట్రీలో మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. పి.లక్ష్మికి నలుగురు సంతానం. ముగ్గరు కుమారులు ఆదిత్యరామ్, శ్రీనివాసరావు, సతీష్, ఒక కుమార్తె అనంతలక్ష్మి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment