దర్శకుడికి వార్నింగ్
కరాచీ: బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ కు పాకిస్థాన్ లోని కరాచీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. లాహోర్ వెళ్లేందుకు బుధవారం కరాచీ ఎయిర్ పోర్టుకు వచ్చిన 'బజరంగీ భాయిజాన్' దర్శకుడికి వ్యతిరేకంగా కొంతమంది ఆందోళన నిర్వహించారు. భారత్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ లో భారత్ నిఘా సంస్థ 'రా' సాగిస్తున్న గూఢచర్యంపై ఎందుకు సినిమా తీయరని ఆందోళనకారులు నిలదీశారు.
ఒక వ్యక్తి బూటు చేత్తో పట్టుకుని ఆవేశంతో ఊగిపోతూ కబీర్ ఖాన్ వెంట పడ్డాడు. పాకిస్థాన్ సైన్యానికి వ్యతిరేకంగా భారత్ కుట్రలు చేస్తోందని, దీన్ని సహించబోమంటూ పదేపదే హెచ్చరించాడు. కరాచీలో ఓ సదస్సులో పాల్గొనడానికి కబీర్ ఖాన్ పాకిస్థాన్ వచ్చారు. కబీర్ ఖాన్ తీసిన పాంటమ్' సినిమా పాకిస్థాన్ లో వివాదాస్పమైంది. ఈ సినిమా విడుదలపై లాహోర్ హైకోర్టు నిషేధం విధించింది. కరాచీ ఎయిర్ పోర్టులో కబీర్ ఖాన్ ను అడ్డుకోవడాన్ని మరో దర్శకుడు మధు భండార్కర్ ఖండించారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు.