ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు చెందిన జంషెద్ మెహమూద్ అనే దర్శకుడు తనపై ఓ ప్రముఖ వార్తా పత్రికకు చెందిన సీఈఓ అత్యాచారం చేశాడని చెప్పి సంచలనం క్రియేట్ చేశారు. తనపై ఓ ప్రముఖ సీఈఓ అత్యాచారానికి పాల్పడ్డాడని రెండు నెలల క్రితమే జంషెద్ ఆరోపించినా.. అప్పడు అతని పేరు బయటపెట్టలేదు. కానీ, ఇప్పుడు అతని పేరును ట్విటర్ ద్వారా బయటపెట్టాడు. డాన్ పత్రిక సీఈఓ హమీద్ హరూన్ 13 ఏళ్ళ క్రితం నన్ను అత్యాచారం చేశాడు. ధైర్యం ఉంటే ఈ వార్తను మీ పత్రికలో ప్రచురించండి.
చదవండి: వారిది నా రక్తం.. పవన్ రక్తం కాదు: రేణూదేశాయ్
నేను మీటూ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. ఈ విషయం గురించి నేను నా స్నేహితులకు చెబితే అందరూ నవ్వారు. కానీ, ఆ దారుణ ఘటనను మర్చిపోవడానికి థెరపిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. కొన్ని నెలల పాటు పాకిస్థాన్‌కు దూరంగా ఉన్నాను. ఆ నీచుడు మా నాన్న చనిపోయినప్పుడు పరామర్శించడానికి కూడా వచ్చాడు. నా జీవితం నాశనం చేసిన విషయం మా నాన్నకు కూడా తెలుసని జంషెద్ మెహమూద్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
చదవండి: మైనర్‌పై అత్యాచారం.. నిందితుడిని చంపిన అన్న
Yes HAMEED HAROON Raped me. Im ready now. R u ready to print this @dawn_com ?
— Jami raza (@azadjami1) December 28, 2019
Comments
Please login to add a commentAdd a comment