‘‘మనందరం ఇప్పుడు ఏకతాటిపై నిలవక΄ోతే కచ్చితంగా మనల్ని యంత్రాలు రీప్లేస్ చేస్తాయి’’ అన్నారు సాగ్–ఆఫ్ట్రా (సీనియర్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్) అధ్యక్షురాలు ఫ్రాన్ డ్రెస్చెర్. కొన్ని వారాలుగా సమ్మె చేస్తున్న డబ్లు్యజీఏ (రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా)కి పూర్తి మద్దతు ప్రకటించారామె. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘నటీనటులు అణచివేతకు గురవుతున్నారు. వారికి తగిన గౌరవం దక్కడంలేదు. చిత్రపరిశ్రమలో ఏం జరుగుతుందనేది అందరికీ చాలా ముఖ్యం.
ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో మిగతా అన్ని రంగాల్లోని కార్మికులకు అదే జరుగుతోంది. యజమానులు అత్యాశకు ΄ోతున్నారు. యంత్రాలను నడిపించే సహాయకులను (కార్మికులను ఉద్దేశించి) మర్చి΄ోతున్నారు. వారు చేస్తున్న సేవలను గుర్తించడంలేదు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. సీఈవోలకు ఏకంగా వందల మిలియన్ల డాలర్లలో అధిక వేతనాలు ఇవ్వడంవల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ బాధితులు ఎవరంటే మేమే (కార్మికులు). వ్యా΄ారంలో ఉన్నవాళ్లు మా పట్ల వ్యవహరిస్తున్న తీరు షాకింగ్‌గా ఉంది’’ అని ఘాటుగా స్పందించారు ఫ్రాన్ డ్రెస్చెర్.
తగ్గేదే లే...
‘‘ఏఐ వల్ల ముప్పే’’ అంటూ సమ్మెలో భాగంగా నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏఐ న్యూస్ రీడర్స్ వచ్చిన నేపథ్యంలో ఏఐ వల్ల చిత్రపరిశ్రమలోనూ పెను మార్పు సంభవించే అవకాశం ఉందని హాలీవుడ్ కళాకారులు వా΄ోతున్నారు. అయితే ఏఐ వినియోగాన్ని తగ్గించాలన్న కళాకారుల డిమాండ్‌ని నిర్మాణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే నటీనటుల వేతనాలు పెంపుకు కూడా నిర్మాతలు సుముఖత వ్యక్తపరచడంలేదన్నది హాలీవుడ్ టాక్. ఈ నేపథ్యంలో నటీనటులు కూడా తమ డిమాండ్లను ఆమోదించేవరకూ సమ్మె కొనసాగించే తీరాలనీ, తగ్గేదే లే అనే పట్టుదలతో ఉన్నారనీ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment