అలా వచ్చి... ఇలా హిట్టిచ్చాడు... | Kaho Naa... Pyaar Hai movie... | Sakshi
Sakshi News home page

అలా వచ్చి... ఇలా హిట్టిచ్చాడు...

Published Sun, May 17 2015 4:42 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

అలా వచ్చి... ఇలా హిట్టిచ్చాడు...

అలా వచ్చి... ఇలా హిట్టిచ్చాడు...

దేడ్ కహానీ
ఒకటిన్నర దశాబ్ద కాలంలో బాలీవుడ్ గమనం...
ప్రపంచ సాంకేతిక చరిత్రని తిరగరాసిన మిలీనియమ్ సంవత్సరం (2000)... భారతీయ సినిమాని, ముఖ్యంగా బాలీవుడ్ సినిమా చరిత్రని కూడా తిరగ రాసింది. సమాజం ఏ ఇరవై ఏళ్లకో ఒకసారి ఎదిగే స్థాయి నుంచి ప్రతి ఇరవై రోజులకి కొత్త కొత్త విషయాలతో ఎదగడం ప్రారంభించింది 2000 నుంచే. దుకే ఈ కాలమే 2000 కాలం నుంచి ఇవాల్టి దాకా హిందీ సినిమాలలో వచ్చిన మార్పులు, వాటి విశేషాలు, మారుతున్న ప్రేక్షకుడి ధోరణి, దానికనుగుణంగా మారుతున్న సినిమా - వీటి సమాహారం.

ఈ శీర్షికలో ఈ వారం సినిమా ‘కహో న ప్యార్ హై’పదిహేనేళ్ల క్రితం ఆరువేళ్ల అందగాడిని చూసి యువత భారతదేశంలోని సినీ ప్రేమికులు మనసు పారేసుకున్నారు.
 
తెర మీద...

‘‘రోహిత్, రోహిత్’’ అని కొన్ని వేల మంది ప్రజలు అరుస్తుంటే, యేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడికి కూడా ఒక ఉత్కంఠ, ఒక ఉద్వేగం, బిల్డప్ షాట్స్ - పాట హమ్మింగ్- మెస్మరైజింగ్ ఫేస్ - ఏ స్టార్ ఈజ్ బోర్న్-
 
పేరు: హృతిక్ రోషన్.
తండ్రి: రాకేష్ రోషన్ - కొడుకు తొలి సినిమాకి కథ, నిర్మాత, దర్శకుడు.
బాబాయ్: రాజేష్ రోషన్ - అన్న కొడుకు తొలి సినిమాకి సంగీత దర్శకుడు.
సినిమా: కహో నా... ప్యార్‌హై
కుటుంబమంతా కలిసి కష్టపడి ప్రేక్షక దేవుళ్ల ఆశీస్సులు, మెప్పులు పొందిన సూపర్ హిట్ మర్షియల్ సినిమా.

క్లుప్తంగా కథ:
హిత్, అతని తమ్ముడు అమిత్ ఒక మధ్యతరగతి ఇంట్లో పేయింగ్ గెస్టులు. వారికి తల్లిదండ్రులు లేరు. తమ్ముడి ఆలనా పాలనా అన్నే చూసుకుంటుంటాడు. తమ్ముడు తెగ మోసేసినా ఆ అన్న అలగడు. అభిమానంగా స్వీకరిస్తాడు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం. మంచి అన్నకి చిలిపి తమ్ముడు. స్టార్ సింగర్ కావాలని రోహిత్ కల. ఆ కలతోనే సినిమా మొదలౌతుంది. రోహిత్ కార్ షోరూమ్‌లో సేల్స్‌మన్. అందమైన సోనియా అనే అమ్మాయిని మొదటిసారి ట్రాఫిక్‌లో చూస్తాడు. బానే ఉందనుకుంటాడు.
 
తర్వాత...
సోనియా తండ్రి ఆమెకు పుట్టిన రోజు కానుకగా కారు కొంటాడు. ఆ కారుని సోనియా బర్త్‌డే రోజు ఇంటికి తెమ్మని రోహిత్‌కి చెబుతాడు. కూతురు ‘నా పుట్టినరోజు కానుకేది’ అనడిగితే ‘తలుపు తియ్యి’ అంటాడు. తలుపు తీస్తే ఎదురుగా హీరో. ఒక్క క్షణం ఆమెకర్థం కాదు. ‘బహుమతి ఎలా ఉంద’ంటాడు తండ్రి. ‘కలర్ బావుంది, గిఫ్ట్ బావుంది’ హీరోని కొంటెగా చూస్తూ - తండ్రితో. కారు తాళం చూపిస్తాడు హీరో- లోపల్నించి తండ్రి ‘నడిపి చూడు ఇంకా బావుంటుంది’ అంటాడు. ‘ఓ నిన్ను తాళంతో నడపచ్చా’ అంటుంది. ఆమె కొంటెతనం అర్థమై, కారు చూపిస్తాడు హీరో.
 
ఇందులో సరసం ఉంది. వెగటుతనం లేదు. అలా వాళ్ల మధ్య పరిచయం స్నేహమై, ప్రేమై తండ్రికి తెలిసి, అతనితో మాట్లాడతాను రమ్మంటాడు.
డ్రగ్స్ ముఠాని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కమీషనర్‌ని విలన్లు హత్య చేయడం హీరో చూస్తాడు. హీరోని వాళ్లు వెంటపడి వెంటపడి చంపుతారు.
 
విశ్రాంతి...
ఇంటర్వెల్‌కే హీరో చనిపోతాడు.

ప్రేక్షకులూ, హీరోయినూ కలిసి గాఢంగా ప్రేమించేసిన హీరో చనిపోతాడు. సినిమాటిక్‌గా సెకండాఫ్‌లో బతికొస్తాడులే అనుకుంటాం. సినిమా అయిపోయినా రోహిత్ బతకడు. రాజ్ అనే మరో హృతిక్ రోషన్ సెకండాఫ్ కథ నడిపిస్తాడు. రోహిత్‌ను హత్య చేసిన దుర్మార్గుల పని పడతాడు. రోహిత్ కలగన్న పెర్‌ఫార్మెన్స్ ఇస్తాడు రాజ్. రోహిత్ ప్రేయసి సోనియా మనసు గెలుస్తాడు. రోహిత్ తమ్ముడిని కూడా న్యూజిలాండ్ తీసుకెళ్లిపోతాడు.

రెండు రకాల స్వభావాలున్న పాత్రలు రెండూ ఒకే హీరో ఒకే సినిమాలో చేయాలంటే, అదీ తన మొదటి సినిమాలోనే చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్‌తోటే హృతిక్‌రోషన్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో డైలాగులాగే ‘‘ఏక్ బాత్ బోలూ...’’ మిలీనియమ్‌లో మొదటి సూపర్‌హిట్ బాలీవుడ్ సినిమా ‘‘కహోనా... ప్యార్‌హై...’’ ‘‘చాంద్‌సెతారే పూల్ అవుర్ కుష్‌బూ’’ పాట, ‘‘కహోనా... ప్యార్‌హై’’ టైటిల్ సాంగ్ పెద్ద హిట్.
 
ఇక... సినిమాకు ముందు విషయానికొస్తే... తండ్రి రాకేష్ రోషన్ దీనికి ముందు తీసిన భారీ చిత్రం ‘‘కోయ్‌లా’’కి హృతిక్ సహాయ దర్శకుడు.
 
కండలవీరుడు సల్మాన్‌ఖాన్ సలహాలతో తన శరీరాకృతిని సర్వాంగ సుందరంగా మార్చుకున్నాడు హృతిక్. యువతరం మనసు కొల్లగొట్టాడు. బాలీవుడ్‌లో డ్యాన్స్ చేసే హీరోలు లేరని గుర్తించి సౌత్‌లో లాగ చాలా కష్టమైన డ్యాన్స్‌లు సునాయాసంగా చేశాడు. బాక్సాఫీసుని బద్దలు కొట్టాడు.  చిత్రానికి హీరోయిన్‌గా ముందు కరీనాకపూర్‌ని ఎంచుకుని కొంత షూటింగ్ చేశారు. రషెస్ చూశాక, కొత్తమ్మాయి అమీషా పటేల్‌తో రీషూట్ చేశారు.
 
అమితాబ్ తర్వాత ఖాన్‌లు ఏలుతున్న బాలీవుడ్‌కి నాన్‌ఖాన్ సూపర్‌స్టార్‌గా, ప్రత్యామ్నాయంగా ఎదిగాడు హృతిక్. సవరించిన ద్రవ్యోల్బణ రేటు ప్రకారం బాలీవుడ్ హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఇవాళ్టికీ పదకొండో చిత్రంగా నిలిచింది కహోనా...ప్యార్‌హై.  చిత్రంలో హృతిక్ తమ్ముడు అమిత్‌గా నటించిన బాలనటుడు అభిషేక్ శర్మ ఇవాళ హిందీ బుల్లితెర మీద పెద్దనటుడు. సినిమా మొత్తం హృతిక్ చేతికున్న ఆరోవేలు కనపడకుండా సినిమా తీశారు రాకేష్ రోషన్.
 
ఫస్టాఫ్ షిప్‌లోనూ, ఐలాండ్‌లోను తీసి, సెకండాఫ్ న్యూజిలాండ్‌లోనూ, ముంబైలోనూ తీయడం వల్ల సినిమాకి ఎక్కడలేని రిచ్‌నెస్ వచ్చింది. అయిదు పదుల వయసులో కూడా 2000వ సంవత్సరపు ప్రేక్షకుడి నాడికి పట్టుకోవడం అసాధ్యం కాదని, షారుఖ్‌ఖాన్, మాధురీదీక్షిత్ లాంటి అగ్రతారలతో తీసిన కోయ్‌లా డిసాస్టర్ అయ్యాక కూడా ఆ దర్శకుడు బౌన్స్ బ్యాక్ అవ్వచ్చని కహోనాప్యార్‌హైతో రచయితగా, దర్శకుడిగా నిరూపించారు నిన్నటి తరం నటుడు రాకేష్ రోషన్. క్రియేటివిటీ డివైన్ మాత్రమే కాదు, వైన్‌లాంటిది కూడా. పాతబడిన కొద్దీ రుచిలో కిక్ పెరుగుతుంటుంది. సానబెట్టిన కొద్దీ రాయి వజ్రంగా మారినట్టు. మళ్లీ వచ్చేవారం మరో సూపర్‌హిట్ బాలీవుడ్ మూవీతో కలుద్దాం... హ్యాపీ సండే, ఫన్‌డే.
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement