బెంగళూరు : ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు దినేష్ గాంధీ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం కారణంగా బెంగుళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన దినేష్ శనివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన దాదాపు పది సంవత్సరాలకు పైగా కన్నడ చిత్ర పరిశ్రమకు తన సేవలు అందించారు. దినేష్ వయస్సు 52 సంవత్సరాలు. ఈ రోజు బెంగుళూరులోని తన నివాసంలోనే కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో దినేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. దినేష్ అకాల మరణం కన్న సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. దర్శకుడి మరణం పట్ల అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు
కాగా సుదీప్ కిచ్చా నటించిన ‘వీర మదకారి’ సినిమా దినేష్‌కు మంది పేరు తెచ్చిపెట్టింది. 2009లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 2012లో తెలుగులోనూ రౌడీ ఇన్స్పెక్టర్‌గా విడుదలైంది. అలాగే సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన చత్రపతి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే కొన్ని నెలల క్రితం దినేష్ గాంధీ తన కొడుకుతో కలిసి ఓ సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ కోవిడ్ 19 కారణంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఆలస్యం అయింది. ఈ చిత్రాన్ని సింహాద్రి ప్రొడక్షన్స్ పతాకపై రమేష్ కైషాప్ నిర్మించాల్సి ఉంది. చదవండి: ‘అసహ్యం.. అందుకే నామినేట్ చేశాను’
Comments
Please login to add a commentAdd a comment