
సాక్షి, న్యూఢిల్లీ : చైనాలోని వుహాన్‌లో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతిని స్వదేశానికి పంపించేందుకు ఎంపీ బ్రహ్మనందరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయ శంకర్‌ను జ్యోతి కుటుంబ సభ్యులు కలవనున్నారు. మార్చి 14న జ్యోతి వివాహం ఉండటంతో త్వరగా తమ కుమార్తెను స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. భారత్, చైనా మధ్య రాకపోకలు పూర్తిగా నిలిపి వేమడంతో అక్కడ ఉన్న తెలుగు అమ్మాయి జ్యోతి స్వదేశానికి రాలేని స్థితి నెలకొంది. వారం రోజుల క్రితం జ్యోతికి జ‍్వరం కారణంగా ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో అధికారులు ఇండియాకు తీసుకురాలేకపోయారు. (జ్యోతిని స్వదేశానికి తీసుకోస్తామని కేంద్ర మంత్రి హామీ)
Comments
Please login to add a commentAdd a comment