సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి మరో తల నొప్పి మొదలైంది. టీడీపీ, జనసేన పార్టీ రెబల్స్ ఇస్తున్న షాక్‌కు కూటమికి గాజు గ్లాసు గుచ్చుకుంటోంది. గాజు గ్లాసుతో టీడీపీ, జనసేన రెబల్స్ పోటీలోకి దిగుతున్నారు. తాజాగా గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా వాడుకోవచ్చని ఈసీ వర్గాలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈసీపై.. టీడీపీ, బీజేపీ పార్టీల ఒత్తిడి ఫలించదు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వ్యవహరించింది.
దీంతో 21 అసెంబ్లీ చోట్ల జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తుండగా.. ఈసీ ప్రకటనతో మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించే అవకాశం ఉంది. కాగా, టీడీపీ, జనసేన రెబల్స్.. గాజు గ్లాస్ గుర్తుతోనే కూటమికి ధమ్కీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విజయనగరం టీడీపీ రెబల్ మీసాల గీతకు, జగ్గంపేట జనసేన రెబల్ సూర్యచంద్రకు ఈసీ గాజు గ్లాస్ కేటాయించింది. ఇక.. ఎస్ కోటలో జనసేన రెబల్ కొట్యాడ లోకాభిరామకోటి గాజు గ్లాస్‌తో పోటీకి దిగుతున్నారు.
మరోవైపు.. టీడీపీకి పలు నియోజకవర్గాల్లో రెబెల్స్ బెడద తప్పటం లేదు. విజయనగరం, ఉండి, పోలవరం, పెనుగొండ, హిందూపురంలో బరిలో రెబల్ అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. సినీనటుడు బాలకృష్ణపై పరిపూర్ణానంద స్వామి, పరిటాల సునీతపై ప్రొఫెసర్ రాజేష్, అదితి గజపతిపై మీసాల గీత , జ్యోతుల నెహ్రూపై సూర్యచంద్ర, రఘురామకృష్ణంరాజుపై ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు, పోలవరంలో టీడీపీ రెబల్ మొడియం సూర్యచంద్రరావు బరిలో నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment