టీడీపీలో పొత్తు చిచ్చు.. రెబెల్స్ నామినేషన్లు | tdp leaders defy alliance, file nominations in bjp seats | Sakshi
Sakshi News home page

టీడీపీలో పొత్తు చిచ్చు.. రెబెల్స్ నామినేషన్లు

Published Wed, Apr 16 2014 3:27 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

tdp leaders defy alliance, file nominations in bjp seats

తెలుగుదేశం పార్టీలో పొత్తులు చిచ్చు రేపాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుని.. వాళ్లకు కూడా పనికిరాని స్థానాలు అంటగట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఇప్పుడు అందుకు తగిన ఫలితం అనుభవించాల్సి వస్తోంది. పలు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు రెబెల్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారిన కొట్టు సత్యనారాయణ.. ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వడంతో రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

1994, 1999 ఎన్నికలలో తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. 2004 ఎన్నికల్లో మాత్రం వైఎస్ హవాతో గెలిచారు. తర్వాతి ఎన్నికల్లో మళ్లీ పీఆర్పీ అభ్యర్థి ఈలి నాని చేతిలో ఓడిపోయారు. తాజాగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి, అక్కడి నుంచి టికెట్ దాదాపు ఖరారు అయ్యిందనిపించుకున్నారు. కానీ చివరకు ఆ స్థానం బీజేపీకి వెళ్లడంతో ఆశాభంగానికి గురై.. టీడీపీ రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement