Rajya Sabha election
-
రాజ్యసభ అభ్యర్థిగా నామినేష్ దాఖలు చేసిన అభిషేక్ సింఘ్వి
-
చిన్న బుద్ధుల పెద్ద ఎన్నిక
అసెంబ్లీలో పార్టీలకు స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నచోట రాజ్యసభ ఎన్నికలనేవి అంతా సజావుగా సాగిపోయే మామూలు తంతు. కానీ, పార్టీ ఏదైనా సరే పాలకపక్షంతో అంటకాగడానికీ, జెండా కన్నా సొంత అజెండాకు పెద్ద పీట వేయడానికీ ప్రజాప్రతినిధులు దిగజారితే, పెద్దల సభకు ఎన్నికలు సైతం చిన్న బుద్ధులకు వేదిక అనిపించక మానవు. ఫిబ్రవరి 27న యూపీ (10 సీట్లు), కర్ణాటక (4 సీట్లు), హిమాచల్ ప్రదేశ్ (1)లలో ఎగువసభ ఎన్నికలు అలానే సాగాయి. హిమాచల్‌లో అధికార కాంగ్రెస్ సభ్యులు ఆరుగురు, యూపీలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు ఏడుగురు క్రాస్ ఓటింగ్‌కు దిగడంతో ఆ పార్టీలు చెరొక స్థానాన్ని బీజేపీకి కోల్పోయాయి. ఒక బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు ఓటేసిన కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ నాలుగింట తనకు దక్కాల్సిన 3 స్థానాల్ని నిలబెట్టుకుంది. మంగళవారం 15 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరిగితే, బీజేపీ తన బలంతో గెలవగలిగిన వాటి కన్నా రెండు సీట్లు ఎక్కువగా 10 సొంతం చేసుకుంటే, కాంగ్రెస్, ఎస్పీలు తమ సంఖ్యాబలం కన్నా చెరొకటి తక్కువగా వరుసగా 3, 2 సీట్లే దక్కించుకోవడం గమనార్హం. ప్రజాప్రతినిధుల్ని రకరకా లుగా ప్రలోభపెట్టి, క్రాస్ ఓటింగ్‌కు దిగజార్చే దుష్టసంస్కృతి పూర్తి స్థాయిలో స్థిరపడినట్టు మరో సారి రుజువైంది. రాజ్యసభ ఎన్నికలకు విప్ల జారీ కుదరదు కానీ, తమ పార్టీ నియమించిన ఏజెంట్‌కు లెజిస్లేటర్లు తమ బ్యాలెట్ పేపర్లు చూపాలి. అయినా సరే, ఎమ్మెల్యేలు తామున్న పార్టీ వైఖరికి భిన్నంగా ఓటేయడం వర్తమాన రాజకీయాలలో విలువల పతనానికి విషాద నిదర్శనం. చిత్రమేమంటే, హిమాచల్‌లో రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మనుగడనే బీజేపీ ప్రశ్నార్థకం చేసింది. ఉత్తరాదిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్ని కల్లో గత ఏడాదే గెలిచి, హస్తం పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రం నుంచి తమ అభ్యర్థి గెలుపునకు కావాల్సిన బలం కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలే తమకున్నారని అధికార కాంగ్రెస్ పెద్దలు ఏమరుపాటుగా ఉంటే, అదను కోసం చూస్తున్న ప్రతిపక్ష బీజేపీ తమ ‘ఆపరేషన్ కమల్’కు పదును పెట్టింది. ఫలితంగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేసి, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. ఫలితంగా, మెజారిటీతో ఇట్టే గెలవాల్సిన కాంగ్రెస్ అభ్యర్థి – ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వీకి కాస్తా ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థితో సమానంగా మాత్రమే ఓట్లొచ్చిన పరిస్థితి. లాటరీలోనూ అదృష్టం బీజేపీ పక్షాన నిలిచేసరికి, ఆ రాజ్యసభా స్థానం కాంగ్రెస్ చేజారింది. హిమాచల్‌లో కొద్దినెలలుగా కుతకుతలాడుతున్న అసంతృప్తిని అలక్ష్యం చేసి, బీజేపీ ‘ఆకర్షణ మంత్రాన్ని’ తక్కువగా అంచనా వేసి, కాంగ్రెస్ చేజేతులా ఈ ఓటమి కొనితెచ్చుకుంది. చివరకు అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందాల్సినవేళ సభలో మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్ సర్కార్ కూలిపోయే దుఃస్థితి తలెత్తింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలస్యంగానైనా బరిలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది. సీనియర్ నేతలు డీకే శివకుమార్, భూపిందర్ సింగ్ హూడా తదితరుల్ని హిమాచల్ పంపింది. సుఖూ ప్రభుత్వంలో తమకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు. ఈ విషయంపై వారు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్ఠానం తాజా బుజ్జగింపులతో అంతా సద్దుమణుగుతుందా అన్నది చూడాలి. ‘నేను పోరాట యోధుణ్ణి, రాజీనామా ప్రసక్తే లేదు’ అని సీఎం సుఖూ బింకంగా చెబుతున్నా, సభలో మెజారిటీ ఆయనకుందా, సొంత ఎమ్మెల్యేల్లోనే తీవ్ర అసంతృప్తి ఉన్నందున ఆయన అధికారంలో కొనసాగగలరా అన్నది అనుమానమే. మొత్తం 68 మంది సభ్యుల హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలగం 40 మంది. ఆరుగురి క్రాస్ ఓటింగ్‌తో దాని బలం 34కు పడిపోయింది. ఇక, బీజేపికి 25 మంది ఉంటే, ఇండిపెండెంట్లు ముగ్గురున్నారు. బీజేపీ పాలిత హర్యానాలో పంచ కులాలో మకాం వేసిన కాంగ్రెస్ రెబెల్స్‌తో కలుపుకొంటే కాషాయ బలమూ 34కు చేరింది. సభలో మెజారిటీ మార్కు 35. ఇంకా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను సంప్రతిస్తున్నారని బీజేపీ అంటున్నందున ఏమైనా జరగవచ్చు. ఈ నేపథ్యంలో నాటకీయత పెంచుతూ బుధవారం 15 మంది బీజేపీ ఎమ్మెల్యేల్ని అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్‌తో ఇప్పటికి గండం గట్టె క్కాలన్నది తాపత్రయం. అదే జరిగినా, సుఖూను వ్యతిరేకిస్తూ, సీఎం పీఠానికై విక్రమాదిత్య సింగ్ సహా ముగ్గురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతుండడం గమనార్హం. మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమా రుడైన విక్రమాదిత్య మంత్రి పదవికి రాజీనామా ఇస్తున్నట్టు ప్రకటించడం కథలో కీలక మలుపు. ఎన్నికల్లో మెజారిటీ ఏ పార్టీకి దక్కినా, ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసినా, ఆఖరుకు అక్కడ బీజేపీయే అధికార చక్రం తిప్పడం కొన్నేళ్ళుగా పెరుగుతున్న ధోరణి. సామ దాన భేద దండోపా యాలు ప్రయోగించి ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యర్థి పార్టీ నేతల్ని తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీది ఇప్పుడు తిరుగులేని రికార్డు. 2019లో కర్ణాటకలో జేడీ–ఎస్ నేత కుమారస్వామి ప్రభుత్వం, 2020లో మధ్యప్రదేశ్‌లో కమలనాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్, 2022లో మహారాష్ట్రలోని శివ సేన ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్... ఇలా గత నాలుగేళ్ళలో కాషాయపార్టీ పాలబడినవి ఎన్నో. తాజాగా హిమాచల్‌లోని సుఖూ సారథ్య కాంగ్రెస్ సర్కార్ ఆ జాబితాలో చేరేలా కనిపిస్తోంది. సుఖూ పట్ల పార్టీలో వ్యతిరేకతను సర్దుబాటు చేసుకోవాల్సింది కాంగ్రెస్. కానీ, ఒక పార్టీ అంతర్గత విభేదాల కుంపటిలో మరొక పార్టీ చలి కాచుకొని, అధికారం చేజిక్కించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే. సంతలో ప్రజాప్రతినిధులను కొని, ప్రజాతీర్పు తమ వైపు ఉందని ఏ పార్టీ భావించినా అది అవివేకం. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. సమయం చూసి సమాధానం చెబుతారు. -
రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన రేణుకా చౌదరి, అనిల్ కుమార్
రాజ్యసభ సభ్యులుగా నామినేషన్లు వేసిన కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ మూడు సెట్ల నామినేషన్లు వేసిన అభ్యర్థులు అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ పత్రాలు సమర్పించిన నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, దిగ్విజయ్ సింగ్, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌కు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీ-ఫామ్ అందజేశారు. సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ సెక్రటరీ వద్ద రాజ్యసభ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నానామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేసే కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పాల్గొంటారని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. రేణుక చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్‌కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. దీంతో పెద్దల సభలోకి యువకుడు అనిల్ కుమార్ యాదవ్ అడుగుబెట్టనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనిల్ కుమార్ యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్‌కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. -
నేటితో ముగియనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్ గడువు
-
ఎవరీ గోవింద్ భాయ్ డోలాకియా? బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక
బీజేపీ రాజ్యసభ అభ్యర్థల రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది. అయితే గుజరాత్ నుంచి జేపీ నడ్డా, గోవింద్ భాయ్ డోలాకియా, మయాంక్‌భాయ్ నాయక్, శ్వంత్‌సిన్హ్ జలంసింహ పర్మార్‌లను ఎంపిక చేసింది. అయితే ప్రస్తుతం గోవింద్ భాయ్ డోలాకియా ఎవరు? ఆయను బీజేపీ ఇంత ప్రాధన్యం ఇవ్వటం ఏంటి? అని చర్చజరుగుతోంది. రాజ్యసభ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించిన అనంతరం గోవింద్ భాయ్ డోలాకియా మీడియాతో మాట్లాడారు. ‘వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నా ప్రయాణం వ్యాపారవేత్తగా సాగటం ఆనందం. కొన్ని గంటల ముందు నేను రాజ్య సభ అభ్యర్థిగా ఎంపిక అయినట్లు తెలిసింది. అయితే నా పేరును ఫైనల్ చేసేముందు బీజేపీ అధిష్టానం ఆలోచించి ఉండాల్సింది’ అని అన్నారు. ఎవరీ గోవింద్ భాయ్ డోలాకియా..? గుజరాత్‌లోని సూరత్‌లో శ్రీ రామ కృష్ణా ఎక్స్‌పోర్ట్స్ పప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంస్థకు గోవింద్ భాయ్ డోలాకియా వ్యవస్థాపకుడు, చైర్మన్. ఇది సూరత్ కేంద్రంగా ఉన్న వజ్రాల తయారీ కంపెనీ. 1970లో ఈ వజ్రాల కంపెనీని ఆయన ప్రారంభించారు. లింక్డ్ఇన్ ఫోఫైల్ ప్రకారం ఆయన కంపెనీలో ఐదు వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ మొత్తం ఆదాయం ప్రస్తుతానికి 1.8 బిలియన్ డాలర్లు ఉన్నట్లు సమాచారం. ఇక.. ఆయన ఒక ప్రముఖ ప్రజా వక్త, సామాజిక సేవకుడు. దేశంలో పేరుమోసిన పలు విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో వక్తగా వ్యవహరించారు. 2011లో అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం కోసం రూ.11 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. 2014లో తన దాతృత్వం ద్వారా ఎస్ఆర్కే నాలెడ్జ్ ఫౌండేషన్‌ని స్థాపించారు. ఆమ్రేలికి చెందిన గోవింద్ భాయ్ డోలాకియా వజ్రాల వ్యాపార రంగంలో మొదట ఒక కార్మికుడి తన ప్రయాణం ప్రారంభించారు. తర్వాత అంచెలంచెలుగా వజ్రాల వ్యాపారిగా ఎదిగారు. ఇక.. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు దీపావళి సందర్భంగా బహుమతులు ఇస్తూ ఉద్యోగుల్లో మంచిపేరు సంపాధించుకున్నారు. గతంలో తన కంపెనీలో పని చేసే 300 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను గోవింద్ భాయ్ డోలాకియా.. సుమారు రూ.90 లక్షల ఖర్చుతో ఒక ప్రత్యేక ఏసీ రైలు బుక్ చేసి మరీ 10 రోజుల పాటు ఉత్తరఖండ్ పర్యటన తీసుకెళ్లి వార్తల్లో నిలిచారు. ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులంతా‘కాకాజీ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. -
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
సాక్షి, ఢిల్లీ: పద్నాలుగు మంది రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. యూపీ నుంచి ఏడుగురిని, బీహార్ నుంచి ఇద్దరిని, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్,ఛత్తీస్‌గఢ్, వెస్ట్‌బెంగాల్ నుంచి ఒక్కొక్కరిని రాజ్యసభకు బీజేపీ ఎంపిక చేసింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్పీఎన్ సింగ్, డా.సుధాన్షు త్రివేది, తేజ్వీర్ సింగ్, సాధనాసింగ్, అమర్‌పాల్ మౌర్యా, డా సంగీత బల్వంత్, నవీన్‌జైన్‌ను అభ్యర్థులుగా బీజేపీ ఖారారు చేసింది. బిహార్ నుంచి ధర్మ్‌శీల గుప్తా, డా.భీంసింగ్.. ఛత్తీస్‌గఢ్ నుంచి దేవేంద్ర ప్రతాప్‌సింగ్, హర్యానా నుంచి సుభాష్ బరాలా, కర్ణాటక నుంచి నారాయణ కృష్ణాంశ, ఉత్తరాంఖండ్ నుంచి మహేంద్ర భట్, వెస్ట్ బెంగాల్ నుంచి సామిక్ భట్టాచార్యను ఖారారు చేస్తూ బీజేపీ జాబితా ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న విడుదల కాగా.. 15 వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉంది. అలాగే 16న నామినేషన్ల పరిశీలన, 20న విత్ డ్రాకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇదీ చదవండి: ఒకేసారి ఐదుగురికి భారతరత్న.. మోదీ వ్యూహం అదేనా? -
రాజ్యసభలో తెలుగుదేశం అడ్రస్ గల్లంతు
-
రాజ్యసభ ఎన్నికలు; మహారాష్ట్రలో కలకలం
ముంబై: రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఎమ్మెల్యేలు తమ బ్యాలెట్ పత్రాలను తమ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు ఇవ్వడంతో మహారాష్ట్రంలో వివాదం రాజుకుంది. మహా వికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల తీరుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. వీరి ఓట్లను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. యశోమతి ఠాకూర్(కాంగ్రెస్), జితేంద్ర అవద్(ఎన్సీపీ), సుహాస్ కాండే(శివసేన) తమ బ్యాలెట్ పేపర్లను తమ పోలింగ్ ఏజెంట్లకు ఇచ్చారని బీజేపీ నేత పరాగ్ అలవానీ ఆరోపించారు. వారి ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని రిటర్నింగ్ అధికారిని కోరారు. బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ నాయకురాలు యశోమతి ఠాకూర్ కొట్టిపారేశారు. ‘ఎంవీఏ కూటమికి చెందిన నలుగురు అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఈ విషయం బీజేపీ కూడా తెలుసు. అందుకే వారు గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నార’ని అన్నారు. కాంగ్రెస్‌కు అసదుద్దీన్ అభయం రాజ్యసభ ఎన్నికల్లో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని తమ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. కాగా, మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ప్రకటించారు. మహారాష్ట్ర శాసనసభలో మొత్తం 16 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. (క్లిక్: ఎన్సీపీ నేతలకు షాక్.. జైల్లో ఉండడంతో ఓటింగ్‌కు నో) -
డబ్బులు వృధా చేసుకోవద్దు. మా వద్ద లేనిది ఈడీ మాత్రమే: సంజయ్ రౌత్
ముంబై: రాజ్యసభ ఎన్నికల తమ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేయాలనుకుంటోందని, ఈ క్రమంలో వారిపై ఒత్తిడి తెస్తోందని శివసేన నేత సంజయ్‌రౌత్ ఆరోపించారు. ఈనెల 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మహావికాస్ ఆఘాడీ సంకీర్ణ కూటమి (ఎంవీఏ) నాలుగు సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే తమ ప్రభుత్వం తరఫున ఏ పార్టీలనూ, ఎమ్మెల్యేలను ఒత్తిడి చేయడం లేదని తెలిపారు. శివసేన –ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి ఇప్పటికీ ఆరు సీట్లలో నాలుగు సీట్లను కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, కాషాయ పార్టీకి ‘డబ్బులు వృధా చేసుకోవద్దని’ సూచించారు. ‘మూడో అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీజేపీ రాజ్యసభ ఎన్నికలలో అనైతికంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. వారికి మూడో అభ్యర్థిని గెలిపించుకునే బలం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. దానికోసం ఆ పార్టీ స్వతంత్ర ఎమ్మెల్యేలు, చిన్న పార్టీలపై ఆధారపడుతోంది. ఓట్లకోసం వారిపై ఒత్తిడి తెస్తోందని మాకు మొత్తం సమాచారం అందుతోంది’ అని రౌత్ విమర్శించారు. ‘మహావికాస్ ఆఘాడీ కూడా ఎన్నికలను సీరియస్‌గా తీసుకునే పోరాడుతోంది. అయితే మా వద్ద లేనిది ఈడీ మాత్రమే’ అని రౌత్ కేంద్రంలోని బీజేపీకి చురకలు అంటించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను ప్రలోభపరచడం, వారిని డబ్బులతో కొనడం ద్వారా ఎన్నికలలో లాభపడాలని కాషాయ పార్టీ ఆలోచన.. అయితే వారికి ఒకటే సలహా ఇస్తున్నాను..వారు డబ్బును వృధా చేయకూడదు (ఎన్నికల కోసం), బదులుగా దానిని సమాజ సేవకోసం ఉపయోగించాలని కోరుతున్నానని వ్యాఖ్యానించారు. అయితే శనివారం లాతూర్‌లో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను రౌత్ వ్యాఖ్యలపై స్పందించాలని విలేకరులు కోరగా ఆయన నిరాకరించారు. అసలు ‘సంజయ్ రౌత్ ఎవరు? ఆయన ఇష్టంవచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. నేను వారికి ఎందుకు సమాధానం చెప్పాలి?’అని మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రశ్నించారు. బీజేపీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అనిల్ బోండే, మాజీ ఎంపీ ధనంజయ్ మహదిక్‌లను తమ అభ్యర్థులుగా నిలబెట్టిన విషయం తెలిసిందే. చదవండి: బెడిసికొట్టిన ఏకగ్రీవం.. రాష్ట్రంలో 24 ఏళ్ల తరువాత రాజ్యసభ ఎన్నికలు ► శివసేన సంజయ్ రౌత్, సంజయ్ పవార్లను తమ అభ్యర్థులుగా నిలబెట్టింది. ►ఎన్సీపీ ప్రఫుల్ పటేల్ పేరును మళ్లీ ప్రతిపాదించగా, కాంగ్రెస్ ఇమ్రాన్ ప్రతాప్‌గఢ్‌ని బరిలోకి దింపింది. ►ఆరో సీటు కోసం బీజేపీకి చెందిన మహాదిక్, సేనకు చెందిన పవార్ మధ్య పోరు సాగుతోంది. -
మూడో సీటు... ముచ్చెమటలు
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థిని గెలిపించుకునేందుకు పాలక కాంగ్రెస్ పార్టీ చెమటోడుస్తోంది. సీఎం అశోక్ గెహ్లెట్ సర్వశక్తులూ ఒడ్డుతున్నా అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించలేక సతమతమవుతున్నారు. మొత్తం 200 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 108 మంది ఎమ్మెల్యేలున్నారు. బీఎస్పీ, బీటీపీ వంటి పార్టీలతో పాటు స్వతంత్రులు కలిపి 125 మంది మద్దతుందని కాంగ్రెస్ చెబుతోంది. అందుకే రణదీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీని బరిలో దింపింది. ఒక్కో సీటుకు 41 మంది చొప్పున ముగ్గురినీ గెలుచుకోవడానికి 123 మంది ఎమ్మెల్యేలు కావాలి. కానీ 71 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ నుంచి ఘన్‌శ్యామ్ తివారీ పోటీలో ఉన్నారు. స్వతంత్రునిగా బరిలో దిగిన మీడియా దిగ్గజం సుభాష్ చంద్రకు బీజేపీ మద్దతివ్వడం కాంగ్రెస్‌లో గుబులు రేపింది. ముందుజాగ్రత్తగా ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించినా సీఎంపై విమర్శలు చేస్తున్న మంత్రి రాజేంద్రసింగ్‌తో పాటు ఐదారుగురు ఎమ్మెల్యేలు వాటికి డుమ్మా కొట్టి చెమటలు పట్టిస్తున్నారు. తన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు కావాలంటే 12 డిమాండ్లు తీర్చాలంటూ భారతీయ ట్రైబల్ పార్టీ పేచీ పెడుతోంది. దీనికి తోడు సుభాష్ చంద్రకే ఓటేయాలంటూ కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేలకు బీఎస్పీ విప్ జారీ చేసింది! దాంతో 10 జరగనున్న ఎన్నికల్లో ప్రమోద్ గెలుపు ప్రశ్నార్థకంగా మారింది. -
బీజేపీకి చెక్: చిరాగ్ చెంతకు తేజస్వీ
పట్నా : కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతితో బిహార్‌లో రాజకీయం మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన రాజ్యసభ సీటు దీనికి కేంద్రంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన జోరుమీదుకున్న ఎన్డీయే కూటమికి చెక్ పెట్టాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఎత్తులు వేస్తున్నారు. దీనికి లోక్‌జనశక్తి (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌ను పావుగా ఉపయోగించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. రాం విలాస్ పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని తిరిగి తమ కుటుంబానికే కేటాయిస్తుందని చిరాగ్ భావించారు. అయితే ఊహించని విధంగా ఆ స్థానానికి బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ పేరును నామినేట్ చేయడం యవనేతకు షాకింగ్ కలిగించింది. తన తండ్రి స్థానంలో జరుగుతున్న ఎన్నికకు కనీసం తమకు సంప్రదించకుండా సుశీల్ పేరును ఖరారు చేయడం ఏమాత్రం జీర్ణించుకోలేపోతున్నారు. (ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు) ఈ క్రమంలో చిరాగ్‌తో దోస్తీకి ప్రయత్నం చేస్తున్న తేజస్వీ వ్యూహత్మకంగా ఆలోచన చేశారు. పాశ్వాన్ మృతితో జరుగుతున్న ఎన్నికలో ఆయన భార్య, చిరాగ్ తల్లి రీనాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో చిరాగ్‌కు దగ్గర కావడంతో పాటు ఎన్డీయే విజయానికి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నట్లు సమాచారం. రీనాకు ఆర్జేడీ మద్దతు ఇస్తామని తేజస్వీ ఇదివరకే వర్తమానం పంపినట్లు బిహార్ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఆర్జేడీ సీనియర్ నేత శక్తీ యాదవ్ మాట్లాడుతూ.. రినా పాశ్వాన్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తే దానికి ఆర్జేడీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి నిర్ణయం చిరాగ్‌కే వదిలేస్తామని తెలిపారు. ఒకవేళ చిరాగ్ ముందుకు రాకపోతే మహాకూటమి తరుఫున సుశీల్ మోదీకి వ్యతిరేకంగా తామూ అభ్యర్థిని బరిలో నిలుపుతామని వెల్లడించారు. బిహార్ అసెంబ్లీలో ఐదుగురు ఎమ్మెల్యేలు కలిగిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సహకారంతో రాజ్యసభ స్థానాన్ని కైవలం చేసుకునే విధంగా ఆర్జేడీ ప్రణాళికలు రచిస్తోంది. (ఆర్జేడీని కాంగ్రెస్సే ముంచిందా?) మరోవైపు తేజస్వీ ఎత్తుగడ బిహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ చిరాగ్‌ను తనవైపుకు తిప్పుకుంటే ఎల్జేపీ సానుభూతిపరులు దాదాపు తేజస్వీ వైపు మళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల విశ్లేషణ. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌తో విభేదించిన చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం జేడీయూపై తీవ్ర ప్రభావం చూపగా.. బీజేపీకి పెద్ద ఎత్తున లాభం చేకూర్చిపెట్టింది. అయితే తాము ఎన్డీయే భాగస్వామ్యం పక్షంగానే కొనసాగుతామని ప్రకటించిన ఎల్జేపీ.. ఆ తరువాత బీజేపీ-జేడీయూ ప్రభుత్వంలో మాత్రం చేరలేదు. దీంతో తండ్రి మరణం అనంతరం చిరాగ్ ఒంటరి వాడు అయ్యాడనే భావన కలుగుతోంది. దీనిని తేజస్వీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహ రచన చేస్తున్నారు. ఆర్జేడీ ఆఫర్‌పై చిరాగ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. -
‘ రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోంది’
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను నియమించిన ప్రక్రియ రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ అన్నారు. బుధవారం వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్ పార్టీ బీ-ఫామ్‌ను అందించారు. అనంతరం నలుగురు అభ్యర్థులు అసెంబ్లీకి బయల్దేరి వెళ్లి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. అనంతరం మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ బీసీలకు గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రెండు స్థానాలు బీసీలకు.. రాష్ట్ర అభివృద్ధి కోసం నత్వానికి.. పారిశ్రామిక అభివృద్ధి కోసం అయోధ్య రామిరెడ్డికి సీటు ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నాయకులను చంద్రబాబు నాయుడులా వాడుకొని వదిలేయడం సీఎం జగన్‌కు తెలియదు. చంద్రబాబు నాయకులను కరివేపాకుల వాడి వదిలేస్తారు. దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా ప్రధమ స్థానంలో సీఎం జగన్ ఉంటారు. బీసీ వర్గాలకు చెందిన తమకు రాజ్యసభ పదవులు వస్తాయని అనుకోలేద’ని అన్నారు. ( సీఎం జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు ) ముందు చూపుతో అభ్యర్థులను ఎంపిక చేశారు : అయోధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో అభ్యర్థులను ఎంపిక చేశారని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి అయోధ్య రామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామన్నారు. సీఎం వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా మేకిన్ ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. వైఎస్ జగన్ రాజ్యసభ ఇవ్వటం గర్వంగా ఉంది : నత్వాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు రాజ్యసభ ఇవ్వటం గర్వంగా ఉందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి పరిమల్ నత్వాని అన్నారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై తమ ఛైర్మన్ అంబానీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించారని తెలిపారు. -
సీఎంను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు
-
సీఎం జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన రాజ్యసభ అభ్యర్థులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, మోపిదేవి వెంకటరమణరావులు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్ పార్టీ బీ-ఫామ్‌ను అందించారు. అనంతరం నలుగురు అభ్యర్థులు అసెంబ్లీకి బయల్దేరి వెళ్లి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ఎంపీ భరత్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పాల్గొన్నారు. (సగం బీసీలకే; బోస్, మోపిదేవిలకు అవకాశం) -
‘సీఎం జగన్ మరోసారి రుజువు చేశారు’
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు ప్రాధాన్యత ఇస్తారని మరోసారి రుజువైందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ..‘రాజ్యసభలో రాష్ట్రం కోసం పోరాటం చేయాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూశారు. సీఎం జగన్ మాత్రం బీసీలు ఎదగాలని అవకాశాలు కల్పిస్తున్నారు. చంద్రబాబు రాజ్యసభ సీట్లను డబ్బున్నవాళ్లకు అమ్ముకున్నారు. జగన్ మాత్రం అందరికీ న్యాయం చేశారు. వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు ఉన్న తేడా ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏ విషయంలో అయినా జగన్ మాట ఇస్తే అది నెరవేర్చుతారు’ అని అన్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు : పిల్లి సుభాష్ చంద్రబోస్ దేశంలోనే అత్యున్నత సభ అయిన రాజ్యసభకు తనను నామినేట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చదవండి : వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు -
ప్రతీకారం తీర్చుకున్న అమిత్ షా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. తొమ్మిదో అభ్యర్థిని బరిలోదింపి ప్రత్యర్థి ఎత్తులను చిత్తుచేస్తూ తన అభ్యర్థిని గెలిపించుకుంది. భారీగా క్రాస్ ఓటింగ్ జరగటంతోపాటు ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో ఎస్పీ, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థి విజయానికి గండికొట్టింది. మొన్నటి గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. మిగిలిన ఆరు రాష్ట్రాల్లోనూ అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు మెజారిటీ స్థానాలు గెలుచుకున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ 3, బీజేపీ ఒక స్థానంలో, పశ్చిమబెంగాల్లో 4 స్థానాల్లో తృణమూల్, కాంగ్రెస్ ఒక సీటును, ఛత్తీస్‌గఢ్‌లోని ఏకైక స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. కేరళలో ఎల్డీఎఫ్ మద్దతుతో జేడీయూ అభ్యర్థి విజయం సాధించారు. తెలంగాణలోని మూడుసీట్లను టీఆర్ఎ‹స్ గెల్చుకుంది. తాజా ఫలితాలతో రాజ్యసభలో ఎన్డీయే బలం 104కు చేరగా ఇందులో బీజేపీ ఖాతాలో 86 సీట్లున్నాయి. ఏప్రిల్ 2న ఖాళీ కానున్న మొత్తం 59 స్థానాలుకు నోటిఫికేషన్ వెలువడగా.. ఇందులో 33 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో బీజేపీ 16 స్థానాలు గెలుచుకుంది. ఎన్నికలు జరిగిన 26 స్థానాల్లో బీజేపీ 12 చోట్ల గెలిచింది. యూపీలో బీజేపీ జోరు ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 9 స్థానాలను కైవసం చేసుకోగా.. ఎస్పీ ఒక స్థానంలో గెలిచింది. ఎస్పీ మద్దతుతో బరిలో నిలిచిన బీఎస్పీ ఓటమిపాలైంది. ఎనిమిది మంది సభ్యులను గెలిపించుకునేందుకు అవసరమైన బలమే ఉన్నప్పటికీ.. విపక్షకూటమిని చీల్చేందుకు బీజేపీ 9వ అభ్యర్థిని బరిలోకి దించింది. దీంతో బీఎస్పీ, బీజేపీ 9వ అభ్యర్థి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఓటింగ్ పూర్తయిన తర్వాత.. కౌంటింగ్ ముందు ఇద్దరు సభ్యుల తీరుపై ఎస్పీ, బీఎస్పీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిపై విచారణ జరిపిన ఈసీ.. ఓ బీఎస్పీ, ఓ బీజేపీ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవని స్పష్టం చేసింది. ఒక్కోక్కటిగా ఫలితాలు వెలువడగా.. బీజేపీ అభ్యర్థులు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు సహా 8 మంది విజయం సాధిచారు. ఎస్పీ తరపున జయాబచ్చన్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అందరి అ‘టెన్షన్’! పదో అభ్యర్థి కౌంటింగ్ ఉత్కంఠను పెంచింది. బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి అనిల్ కుమార్ అగర్వాల్, బీఎస్పీ అభ్యర్థి అంబేడ్కర్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. తొలి ప్రాధాన్య ఓట్లలో ఇద్దరు సభ్యులకూ సరిపోయేంత మెజారిటీ (37 ఓట్లు) రాకపోవటంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాలని అధికారులు నిర్ణయించారు. అయితే వ్యూహాత్మకంగా తొలి 8 మంది అభ్యర్థులకు 39 మంది ఎమ్మెల్యేల చొప్పున ఓట్లను బీజేపీ వేయించింది. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి వచ్చినపుడు 8 మంది అభ్యర్థులకు అదనంగా పడిన తొలి ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకోవటంతోపాటు.. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించటంతో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. కమలానికి ఛత్తీస్‘గఢ్’ ఛత్తీస్‌గఢ్‌లోని ఏకైక రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ అభ్యర్థి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సరోజ్ పాండే సునాయాసంగా విజయం సాధించారు. 90 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో 87 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 49 మంది బీజేపీ, ఒక స్వతంత్ర అభ్యర్థి, మరో బీఎస్పీ అభ్యర్థి సరోజ్ పాండేకు ఓటేశారు. జార్ఖండ్‌లో చెరొకటి జార్ఖండ్‌లో రెండు సీట్లకు ఎన్నికలు జరగగా ఒక సీటును బీజేపీ, మరో సీటును కాంగ్రెస్ గెలుచుకున్నాయి. 82 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో ఎన్డీయే కూటమికి 47 మంది మద్దతుంది. ఇక్కడ ఒక రాజ్యసభ సీటు గెలిచేందుకు 28 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో బీజేపీ ఒక సీటును సునాయాసంగా గెలుచుకోగా.. రెండో స్థానానికి పోటీ చేసి ఓడిపోయింది. మమతకే పశ్చిమబెంగాల్ జై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బలమైన పార్టీగా ఉన్న తృణమూల్ తాజా రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు సీట్లను సునాయాసంగా గెలుచుకుంది. సరైన బలం లేకున్నా తృణమూల్ మద్దతుతో ఐదో అభ్యర్థిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ (అభిషేక్ సింఘ్వీ) ఓ స్థానాన్ని కైవసం చేసుకుంది. 294 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలిచేందుకు 49 ఓట్లు అవసరం. 42 మంది సభ్యులున్న కాంగ్రెస్‌కు మిగిలిన తృణమూల్ సభ్యులు మద్దతు తెలిపారు. కేరళ జేడీయూదే.. రాజ్యసభకు కేరళనుంచి ఒక అభ్యర్థిని మాత్రమే పంపే అవకాశం ఉండగా.. ఇందుకు అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎల్డీఎఫ్ నేరుగా తమ అభ్యర్థిని బరిలో దించనప్పటికీ.. జేడీయూ (శరద్‌యాదవ్ వర్గం) రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర కుమార్‌కు సంపూర్ణ మద్దతు తెలిపింది. 140 మంది ఎమ్మెల్యేలున్న రాష్ట్ర అసెంబ్లీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యేందుకు 71 సభ్యుల మద్దతు అవసరం. అయితే అధికార వామపక్ష కూటమి మద్దతుతో వీరేంద్ర కుమార్ 89 ఓట్లు సంపాదించారు. కర్ణాటకలో కాంగ్రెస్ హవా.. రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందింది. జేడీఎస్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. మొత్తం 224 ఎమ్మెల్యేల్లో 188 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్కో అభ్యర్థి విజయానికి 46 సీట్లు అవసరం కాగా.. బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ 50 ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్ మొదటి అభ్యర్థి ఎల్.హనుమంతయ్య 44 ఓట్లతో, రెండో అభ్యర్థి జేసీ చంద్రశేఖర్ 46 ఓట్లతో గెలుపొందగా, మూడో అభ్యర్థి నాసీర్ అహ్మద్ 42 ఓట్లతో గెలుపొందారు. -
నన్ను జైల్లో పెట్టించారు.. ఆ పార్టీకి ఓటేయను!
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 10 రాజ్యసభ సీట్లకు జరిగిన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ 8, ఎస్పీ ఒక స్థానంలో సులభంగా గెలిచేందుకు అవకాశం ఉండగా.. పదో స్థానం కోసం బీజేపీ అదనంగా బరిలో దించిన అభ్యర్థికి, బీఎస్పీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్ని విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తన ఓటు బీఎస్పీ అధినేత్రి మామావతి పార్టీకి మాత్రం కచ్చితంగా కాదని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా అన్నారు. తన ఓటు సమాజ్‌వాదీ పార్టీకి చెందుతుందన్నారు. ఓటేసిన అనంతరం రఘురాజ్ ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో నాపై తప్పుడు కేసులు బనాయించి అప్పటి సీఎం మాయావతి నన్ను జైలుకు పంపారు. ఆ మరుసటి ఏడాది (2003లో) ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సీఎం అయ్యాక నాపై నమోదైన తప్పుడు కేసుల నుంచి విముక్తి కల్పించారు. అందుకే ఎస్పీకి, ములాయం, అఖిలేశ్‌లంటే ఎంతో గౌరవం ఇస్తానన్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి బీంరావ్ అంబేద్కర్‌కు ఎస్పీ మద్దతు ఇస్తోంది కదా. మీ ఓటు బీఎస్పీకి వెళ్తుందా అని మీడియా రాజా భయ్యాను అడగగా ఆ ఎమ్మెల్యే ఇలా స్పందించారు. 'నా ఓటు ఎస్పీకే చెందుతుంది. ఎస్పీ-బీఎస్పీ పొత్తు గురించి నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ అన్యాయంగా నాపై కేసులు బనాయించి జైల్లో పెట్టించిన మామావతి పార్టీ (బీఎస్పీ)కి మాత్రం నా ఓటు ఎప్పటికీ చెందదంటూ' ఉద్వేగానికి లోనయ్యారు. దీనిపై అఖిలేశ్ స్పందిస్తూ.. సమాజ్ వాదీ పార్టీకి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు అఖిలేశ్. రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా 1993 నుంచి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతాప్‌ఘడ్ లోని కుండా నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందుతున్న విషయం తెలిసిందే. -
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
సాక్షి, అమరావతి: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేశ్, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్‌ను ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వీరిద్దరూ సోమవారం నామినేషన్లు దాఖలు చేస్తారని తెలిపారు. కాగా, ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సీఎం రమేశ్ పదవీ కాలం ఈ నెలలో ముగియనుంది. సీఎం రమేశ్‌కు రెండోసారి అవకాశం ఇచ్చేందుకు మొదట్లో సుముఖత వ్యక్తం చేయకపోయినా.. చివరకు ఆయన పేరునే చంద్రబాబు ఖరారు చేశారు. మరోవైపు రెండో అభ్యర్థిగా న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ పేరును హఠాత్తుగా తెరపైకి తీసుకొచ్చారు. రవీంద్ర గతంలో టీడీపీ లీగల్‌సెల్ అధ్యక్షుడిగా.. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బార్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. కృష్ణా జిల్లాకు చెందిన ఈయన పేరు చివరి నిమిషంలో ఖరారైంది. ఎంపికలో హైడ్రామా..: అభ్యర్థుల ఎంపికపై రెండు రోజుల నుంచి చంద్రబాబు హైడ్రామా నడిపించారు. శనివారం ఆశావహులందరినీ కలిశారు. చివరకు సీఎం రమేశ్, వర్ల రామయ్య, బీద మస్తాన్‌రావుల్లో ఇద్దరికి అవకాశం కల్పించనున్నట్లు లీకులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో నేరుగా పోటీ చేసే అవకాశం ఇస్తానని చెప్పి.. బీద మస్తాన్‌రావును ఆదివారం రేసు నుంచి తప్పించారు. దీంతో సీఎం రమేశ్, వర్లకు లైన్‌క్లియర్ అయ్యిందని అంతా భావించారు. అందుబాటులో ఉండాలని వీరిద్దరికీ పార్టీ కార్యాల యం నుంచి సమాచారం అందింది. కొద్దిసేపట్లో కళా వెంకట్రావు అభ్యర్థులిద్దరితో కలసి మీడియా సమావేశం నిర్వహిస్తారని మీడియాకు లీకులిచ్చారు. దీంతో వర్ల తనకు అవకాశమిచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ పలు చానళ్లతో మాట్లాడారు. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే సీన్ రివర్స్ అయ్యింది. యనమల, కళా వెంకట్రావు సీఎం నివాసం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అభ్యర్థులపై చర్చ జరుగుతోందని.. సాయం త్రం అధికారిక ప్రకటన వెలువడనుందని కళా వెంకట్రావు మీడియా కు చెప్పి నిష్క్రమించారు. ఆ వెంటనే టీడీపీ కార్యాలయం నుంచి కళా వెంకట్రావు పేరుతో.. సీఎం రమేశ్, రవీంద్రకుమార్‌ను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు ప్రకటన రావడం గమనార్హం. చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. అభ్యర్థులను పరిచయం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం అభ్యర్థుల ఎంపికపై ఓ ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. -
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ వీడింది. ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. బండ ప్రకాశ్ ముదిరాజ్ (వరంగల్), సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ (నల్లగొండ) లను అభ్యర్థులుగా కేసీఆర్ ప్రకటించారు. రేపు టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. అంతకుముందు కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించారు. అనంతరం పార్టీ అభ్యర్థులుగా బండ ప్రకాశ్ ముదిరాజ్ (వరంగల్), సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ (నల్లగొండ)ల పేర్లు ఖరారు చేసినట్లు ప్రకటించారు. కాగా, రాష్ట్రంలోని మూడు ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు అనివార్యమైతే ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉన్న రాజ్యసభ ఎన్నికల్లో ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల బలం ప్రకారం మూడు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోనే పడనున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్నిబట్టి రాజ్యసభ ఎన్నికలు ఇప్పటిదాకా ఏకగ్రీవం కావడం సంప్రదాయంగా వస్తోంది. రాజ్యసభకు ఓపెన్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. -
టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభం
-
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే!
-
రాజ్యసభ ఎన్నికలపై ఈసీ నిఘా!
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు అధికార టీడీపీ కుట్రలు పన్నుతోందని, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తోందని వైఎస్సార్ సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీన్ని అడ్డుకునేందుకు రాజ్యసభ ఎన్నికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేసి పరిశీలకులను పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఒ.పి.రావత్‌ను వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కోరారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఢిల్లీలో ఒ.పి.రావత్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించండి వైఎస్సార్ సీపీ టికెట్‌పై గెలుపొందిన 23 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే కొనుగోలు చేసిన అధికార టీడీపీ.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో నెగ్గేందుకు మరో నలుగురిని కొనుగోలు చేసేందుకు బేరసారాలు చేస్తోందని విజయసాయిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్న విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రలోభాలు, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకునేందు కు రాజ్యసభ ఎన్నికలను అమరావతిలో కాకుండా రాష్ట్ర విభజన చట్ట ప్రకారం 2024 వరకు ఎన్నికలు నిర్వహించేం దుకు అధికారం ఉన్న ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో చేపట్టాలని కోరారు. మా ఎమ్మెల్యేల అరెస్టుకు కుట్ర రాజ్యసభ ఎన్నికల్లో విపక్ష ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోకుండా తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని విజయసాయిరెడ్డి ఈసీ దృష్టికి తెచ్చారు. రాజ్యసభ ఎన్నికల తేదీకి పది రోజులు ముందు నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను ఎలాంటి అరెస్టులు చేయకుండా ఏపీ పోలీసులను ఆదేశిం చాలని కోరారు. పరిశీలకులను పంపి ఎన్నికల తీరుపై ఎప్పటికప్పుడు ఢిల్లీలో ఈసీకి వివరాలు అందేలా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాము చేసిన విజ్ఞప్తులపై రావత్ సాను కూలంగా స్పందించినట్టు తెలిపారు. చట్టం అనుమతించే అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. -
అహ్మద్ పటేల్ ఎన్నిక చెల్లదు!
అహ్మదాబాద్: నాటకీయ పరిణామాల నడుమ గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థిగా పోటీ చేసిన బీజేపీ నేత బల్వంత్ సింగ్ రాజ్‌పుత్ అహ్మదాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు(బల్వంత్) వేసిన ఓట్లు చెల్లుతాయని, పైగా ఎన్నికల ముందు 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూర్ తరలించి ఎన్నికల్లో ‘అవినీతి ప్రవర్తన’ కు అహ్మద్ పటేల్ పాల్పడ్డారని పిటిషన్ లో బల్వంత్ పేర్కొన్నారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. ఆరుగురు కాంగ్రెస్ నేతలు సరిగ్గా రాజ్యసభ ఎన్నికలకు ముందే పార్టీకి గుడ్ బై చెప్పగా, బల్వంత్ తోపాటు మరో ముగ్గురు బీజేపీలోకి చేరిపోయారు. ఆపై కాంగ్రెస్ పార్టీ తరపున అహ్మద్ పటేల్, బీజేపీ తరపున బల్వంత్ బరిలోకి దిగారు . ఇద్దరు రెబల్ బ్యాలెట్ ఎమ్మెల్యేలు బల్వంత్ కు ఓటు వేసిన అనంతరం బ్యాలెట్ పేపర్లను బహిరంగంగా చూపించారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, అవి చెల్లవని ఈసీ స్పష్టం చేసింది. చివరకు అహ్మద్ పటేల్ 44, బల్వంత్ రాజ్ పుత్ కు 38 ఓట్లు పోలు కావటంతో కాంగ్రెస్ సీనియర్ నేతనే విజయం వరించింది. -
బెంగళూరులో గుజరాత్ ఎమ్మెల్యేలు
44 మందిని తరలించిన కాంగ్రెస్ సాక్షి, బెంగళూరు/అహ్మదాబాద్: గుజరాత్లో ఆగస్టు 8న జరిగే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ బెంగళూరు సమీపంలోని రిసార్ట్‌కు తరలించింది. తమ ఎమ్మెల్యేలకు వలవేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, దీంతో 44 మందిని బెంగళూరు తరలించినట్టు గుజరాత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నిషిత్ వ్యాస్ చెప్పారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేలతో బెంగళూరులోనే ఉన్నారు. గుజరాత్లో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 51 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడి నుంచి పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే 47 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీకి ప్రస్తుతం 125 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ చీఫ్ అమిత్‌షా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్ రాజ్యసభ బరిలో ఉన్నారు. ఇటీవల ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వారిలో ముగ్గురు శుక్రవారం బీజేపీలో చేరారు. పార్టీ ఫిరాయించాలని వస్తున్న బెదిరింపుల నుంచి ఎమ్మెల్యేలను రక్షించేందుకే వారిని బెంగళూరు తరలించామని వ్యాస్ చెప్పారు. ఈ ఆరోపణలను గుజరాత్ సీఎం విజయ్‌రూపానీ ఖండించారు. కాగా, ఏడుగురు ఎమ్మెల్యేలు బెంగళూరు వెళ్లేందుకు నిరాకరించినట్టు తెలిసింది. వీరిలో ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన వాఘేలా, ఆయన కుమారుడు మహేంద్రసిన్హ్ వాఘేలా తదితరులు ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం వల్ల ఎమ్మెల్యేలను అక్కడికి తరలించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బెంగళూరు నగరానికి 50 కి.మీ. దూరంలోని ఓ రిసార్ట్‌లో ఎమ్మెల్యేలను ఉంచినట్లు వ్యాస్ తెలిపారు. కాగా, వాఘేలాకు సన్నిహితుడైన రాఘవ్జీ తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరతానని ప్రకటించారు. త్వరలో 20 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉందని చెప్పారు. ఎన్డీఏ వచ్చాకే రాష్ట్రాల్లో అశాంతి: రాహుల్ జగదల్పూర్: కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక కశ్మీర్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో అశాంతి నెలకొందని, దీనికి ఎన్డీఏ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, చైనా, పాకిస్తాన్‌కు లబ్ధి చేకూర్చేలా ఎన్డీఏ పాలన సాగుతుండటంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో అశాంతి పెరిగిపోతోందని ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. -
ఎమ్మెల్యే ‘కిడ్నాప్’పై రభస
► రాజ్యసభ పలుసార్లు వాయిదా ► ఎన్నికల్లో గెలుపు కోసంతమ ఎమ్మెల్యేలను అపహరిస్తున్నారన్న విపక్షం న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలను ప్రభావితం చేయడానికి గుజరాత్‌కు చెందిన తమ ఎమ్మెల్యేను ఆ రాష్ట్ర పోలీసులు కిడ్నాప్ చేశారంటూ కాంగ్రెస్ శుక్రవారం రాజ్యసభలో తీవ్ర నిరసన తెలిపింది. ఉదయం సమావేశం కాగానే విపక్ష నేత గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ డిప్యూటీ నేత ఆనంద్ శర్మలు ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘వ్యారా నియోజకవర్గ ఎమ్మెల్యే పునాభాయ్ గామిత్.. జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ భేటీకి హాజరైన తర్వాత టీ కోసం మరో ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినప్పుడు జిల్లా ఎస్పీ ఆయనను కిడ్నాప్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు టికెట్ ఇవ్వకూడదని కాంగ్రెస్ నిర్ణయించిందని, మీరు పార్టీని వీడి బీజేపీలో చేరాలని ఎమ్మెల్యేతో చెప్పారు. బీజేపీ చీఫ్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేయించి, మీకు టికెట్ ఇప్పిస్తానన్నారు... తర్వాత తాను బట్టలు మార్చుకుని వస్తానంటూ ఎమ్మెల్యే పారిపోయారు’ అని ఆజాద్ తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) నిర్వహణలో ప్రభుత్వ పాత్ర తగ్గించి, వాటికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఏ విపత్కర పరిస్థతినైనా ఎదుర్కోవడానికి మన సాయుధ బలగాలు సైనిక సామగ్రికి సంబంధించి పూర్తి సామర్థ్యంతో ఉన్నాయని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు తెలిపారు.