
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి కేకే
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. రాజ్యసభ అభ్యర్థిగా పొలిట్ బ్యూరో సభ్యుడు కె. కేశవరావును పేరును పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నేడు ప్రకటించారు.
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. రాజ్యసభ అభ్యర్థిగా పొలిట్ బ్యూరో సభ్యుడు కె. కేశవరావును పేరును పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నేడు ప్రకటించారు. ఈ నెల 28న కేశవరావు నామినేషన్ వేయనున్నారు. రాజ్యసభకు కాంగ్రెస్ తరపున ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దిగే అవకాశాలున్నాయని వార్తలు వస్తుండడంతో టీఆర్ఎస్ పోటీకి సిద్ధమయింది.
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కేశవరావుకు టీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ సభ్యునిగా అవకాశమిస్తే రెండు పార్టీల మధ్య వారధిగా పనిచేయడానికి వీలుంటుందనే వ్యూహంతో ముందడుగు వేసింది. సీఎం కిరణ్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ అభ్యర్థికి మద్దతు ఇస్తారన్న అభిప్రాయంతో టీఆర్ఎస్ ఉన్నట్టు కనబడుతోంది. అయితే అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం మినహా తెలంగాణ నేతలు ఈ విషయంలో చేయగలిగేదేమీ ఉండదని అంటున్నారు.