సాక్షి, ఢిల్లీ: పద్నాలుగు మంది రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. యూపీ నుంచి ఏడుగురిని, బీహార్ నుంచి ఇద్దరిని, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్,ఛత్తీస్‌గఢ్, వెస్ట్‌బెంగాల్ నుంచి ఒక్కొక్కరిని రాజ్యసభకు బీజేపీ ఎంపిక చేసింది.
ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్‌పీఎన్ సింగ్, డా.సుధాన్షు త్రివేది, తేజ్‌వీర్ సింగ్, సాధనాసింగ్, అమర్‌పాల్ మౌర్యా, డా సంగీత బల్వంత్, నవీన్‌జైన్‌ను అభ్యర్థులుగా బీజేపీ ఖారారు చేసింది. బిహార్ నుంచి ధర్మ్‌శీల గుప్తా, డా.భీంసింగ్.. ఛత్తీస్‌గఢ్ నుంచి దేవేంద్ర ప్రతాప్‌సింగ్, హర్యానా నుంచి సుభాష్ బరాలా, కర్ణాటక నుంచి నారాయణ కృష్ణాంశ, ఉత్తరాంఖండ్ నుంచి మహేంద్ర భట్, వెస్ట్ బెంగాల్ నుంచి సామిక్ భట్టాచార్యను ఖారారు చేస్తూ బీజేపీ జాబితా ప్రకటించింది.
రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న విడుదల కాగా.. 15 వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉంది. అలాగే 16న నామినేషన్ల పరిశీలన, 20న విత్ డ్రాకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: ఒకేసారి ఐదుగురికి భారతరత్న.. మోదీ వ్యూహం అదేనా?
Comments
Please login to add a commentAdd a comment