* రాజ్యసభ బరిలో నెల్లూరు పారిశ్రామికవేత్త!
* సీఎల్పీలో వెల్లడించిన కాంగ్రెస్ మాజీ మంత్రి
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో నెల్లూరుకు చెందిన పారిశ్రామికవేత్త ఒకరు బరిలోకి దిగబోతున్నట్లు రాయలసీమకు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి ఒకరు గురువారం సీఎల్పీలో వెల్లడించారు. ఆయన ఈ విషయాన్ని వెల్లడించే సమయంలో గుంటూరుకు చెందిన మాజీ మంత్రి, పీసీసీ ముఖ్య నేత, విలేకరులు కూడా ఉన్నారు. పారిశ్రామికవేత్త బరిలోకి దిగుతున్నారని చెప్పిన ఆ మాజీ మంత్రి విలేకరుల సమక్షంలో ఆయన తో ఫోన్లో మాట్లాడారు. మీరు పోటీచేస్తున్నది మీడియాకు వెల్లడిస్తున్నానని చెప్పారు.
అయితే ఈ విషయంలో తన పేరు వెల్లడించొద్దని ఆ మాజీ మంత్రి మీడియాను కోరారు. ‘‘గతంలో పి.బాబుల్‌రెడ్డి, రాయపాటి సాంబశివరావులు సభలో తగినంత బలం లేకపోయినా ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈసారి రాష్ట్రంలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నందున.. ఏ పార్టీ వారు ఆ పార్టీ వారికి ఓటు వేస్తారని నమ్మకం లేదు. అందుకే బరిలో నిలిచే పారిశ్రామికవేత్తకు ఓటు వేసేవారికి రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు చెల్లిస్తాం’’ అని ఆ మాజీ మంత్రి తెలిపారు.
ఓటుకు కోటిన్నర..!.
Published Fri, Jan 17 2014 12:33 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement
Advertisement