టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో హైడ్రామాకు తెరపడింది. పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్ పేర్లను అధినాయకత్వం ఖరారు చేసింది. ఈ మేరకు వారి పేర్లను ఒక ప్రకటనలో మీడియాకు తెలిపింది. రేపటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి టీడీపీ అభ్యర్థుల ఖరారులో చంద్రబాబు తీవ్ర సస్పెన్స్ కొనసాగించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఉదయం నుంచి సీనియర్ల నేతలతో ఆయన చర్చలు జరిపారు.
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే!
Published Sun, Mar 11 2018 3:59 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
Advertisement