కొత్తపార్టీ వస్తే భంగపాటు తప్పదు: బొత్స | new party may not survive in andhra pradesh, says botsa satyanarayana | Sakshi
Sakshi News home page

కొత్తపార్టీ వస్తే భంగపాటు తప్పదు: బొత్స

Published Tue, Jan 21 2014 1:42 PM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

కొత్తపార్టీ వస్తే భంగపాటు తప్పదు: బొత్స

కొత్తపార్టీ వస్తే భంగపాటు తప్పదు: బొత్స

హైదరాబాద్: రాజ్యసభ ఆశిస్తున్నవారి జాబితాను హైకమాండ్‌కు పంపుతామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. అభ్యర్థుల కసరత్తు కోసం తాము త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్టు చెప్పారు. అభ్యర్థులను ఖరారు చేసేది మాత్రం అధిష్టానమేనని మీడియాతో పిచ్చాపాటి మాట్లాడుతూ చెప్పారు.

సమైక్య ఉద్యమానికి మద్దతుగా కొత్త పార్టీ వస్తే మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల కోసమే సమైక్య ముసుగులో కొత్తపార్టీ వస్తే భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు. పార్టీ మారాలనుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో ఇతర పార్టీ అభ్యర్థులకు ఓటువేయొచ్చన్నారు. టి.బిల్లుపై చర్చకు అసెంబ్లీ గడువు మరో నెలరోజులు పెంచాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement