
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన రాజ్యసభ అభ్యర్థులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, మోపిదేవి వెంకటరమణరావులు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్ పార్టీ బీ-ఫామ్‌ను అందించారు. అనంతరం నలుగురు అభ్యర్థులు అసెంబ్లీకి బయల్దేరి వెళ్లి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ఎంపీ భరత్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పాల్గొన్నారు. (సగం బీసీలకే; బోస్, మోపిదేవిలకు అవకాశం)