‘సీఎం జగన్‌ మరోసారి రుజువు చేశారు’ | Mopidevi Venkataramana Say Thanks To CM Jagan For Select Rajya Sabha Candidate | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ అందరికీ న్యాయం చేస్తారు: మోపిదేవి

Published Mon, Mar 9 2020 6:39 PM | Last Updated on Mon, Mar 9 2020 8:04 PM

Mopidevi Venkataramana Say Thanks To CM Jagan For Select Rajya Sabha Candidate - Sakshi

సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు ప్రాధాన్యత ఇస్తారని మరోసారి రుజువైందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ..‘రాజ్యసభలో రాష్ట్రం కోసం పోరాటం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూశారు. సీఎం జగన్‌ మాత్రం బీసీలు ఎదగాలని అవకాశాలు కల్పిస్తున్నారు. చంద్రబాబు రాజ‍్యసభ సీట్లను డబ్బున్నవాళ్లకు అమ‍్ముకున్నారు. జగన్‌ మాత్రం అందరికీ న్యాయం చేశారు. వైఎస్‌ జగన్‌కు, చంద్రబాబుకు ఉన్న తేడా ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏ విషయంలో అయినా జగన్‌ మాట​ ఇస్తే అది నెరవేర్చుతారు’  అని అన్నారు.

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు : పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
దేశంలోనే అత్యున్నత సభ అయిన రాజ్యసభకు తనను నామినేట్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

చదవండి : వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement