కాంగ్రెస్ కీలక నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని మరో ఏడాది పొడిగిస్తారని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: మంత్రి ఆనం రామనారాయణ ఛాంబర్‌లో బొత్స సత్యనారాయణ, మహీధర్‌రెడ్డి తదితరుల సమావేశమయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కీలక నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని మరో ఏడాది పొడిగిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజన జరిగిపోయిందని, ఇప్పుడున్న ఎమ్మెల్యేలతోనే రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు నడిపిస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ముగ్గురు అభ్యర్థులను బరిలో దింపే అవకాశం ఉంది. టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి వెల్లడించాక నాలుగో అభ్యర్థిని నిలిపే విషయంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోనుంది.