Mahidhar reddy
-
ఎల్లో మీడియాపై కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఫైర్
-
టీడీపీ నేతలపై కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నేతలపై కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నేతల నిర్వాకం వల్లే 8 మంది అమాయకులు బలి అయ్యారని మండిపడ్డారు. ప్రచార ఆర్భాటంతో రోడ్డుపై ఫ్లెక్సీలు కట్టారు. టీడీపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టి ప్రమాదానికి కారణమయ్యారు. చేసింది తప్పని తెలుసుకోకుండా పిచ్చిప్రేలాపణలు చేస్తే జనం బుద్ధి చెబుతారని మహీధర్‌రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు బాధ్యత వహించాలి: డిప్యూటీ సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చితోనే 8 మంది చనిపోయారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. తక్కువ జనాన్ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. కందుకూరు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి' అని మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. కందుకూరు ఘటన బాధాకరం: బాలినేని చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఇరుకు సందులో సభ పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు ఘటనలో 8 మంది చనిపోవడం బాధాకరమైన విషయం అన్నారు. -
కందుకూరులో మెగా జాబ్‌మేళా
-
‘చంద్రబాబు.. రైతులు గగ్గోలు పెడుతున్నారు’
సాక్షి, ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు రుణమాఫీ అన్నారని, ఆయన చేసిన రుణమాఫీ రైతులు వడ్డీ కట్టుకోవడానికి కూడా సరిపోలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు మహీదర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘యువతకు నిరుద్యోగ భృతి 2000 ఇస్తానన్నావు.. నాలుగున్నర ఏళ్ళ తర్వాత 1000 అంటున్నావు. బాబు వస్తే జాబు వస్తుందన్నావు.. నువ్వు వచ్చిన తర్వాత అనేక మందిని తొలగించావు. యువత నిన్ను ఎందుకు నమ్మాలి?. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నావు. 10 వేలు ఇచ్చి రుణమాఫీ చేశావని అబద్దాలు చెబుతున్నావు. డ్వాక్రా మహిళలు నిన్ను ఎలా నమ్మాలి బాబు?. గడిచిన 4సంవత్సరాల 8 నెలల్లో కందుకూరు నియోజకవర్గ రైతులకు ముఖ్యమైన రాళ్లపాడుకు నీరందించే సోమశిల ఎడమ కాలువ పనులు 15 శాతం పూర్తి చేయడమే చేతకాలా. రామాయపట్నం పోర్ట్ పూర్తి చేస్తావా? నిన్ను ఎలా నమ్మాలి?. నాలుగున్నర సంవత్సరాలుగా రామాయపట్నం పోర్టు గురించి పట్టించుకోని బాబు ఎన్నికల ముందు పోర్టుకు శంకుస్థాపన చేస్తానంటే నిన్ను ఎవరు నమ్ముతారు?. పేపరు మిల్లు పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు. కందుకూరు నియోజకవర్గ గ్రామాలలో త్రాగు నీరు ఇబ్బందిగా ఉంటే పేపరు మిల్లుకు నీరెలా ఇస్తావ’’ని ప్రశ్నించారు. -
కిరణ్....పవన్....బీజేపీ... ఇండిపెండెట్?
కందుకూరు : 'ఏ పార్టీలోకి వెళ్దాం..? కిరణ్ పార్టీ, పవన్ పార్టీ, బీజేపీల్లో ఏదో ఒకటి చెప్పండి. లేదూ ఇండిపెండెంట్‌గా పోటీ చేయమంటారా...?' ఇవీ మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి తన నిజయోకవర్గ కార్యకర్తల ముందు ఉంచిన ఆప్షన్లు. కాంగ్రెస్ ఖాళీ అయిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి బయటకొచ్చే యోచనలో ఉన్న మహీధర్ రెడ్డి నిన్న మాచవరంలోని తన నివాసంలో గుడ్లూరు, ఉలవపాడు మండలాలకు చెందిన పలువురు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 'కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, బీజేపీలున్నాయి. వీటిలో ఏదో ఒక పార్టీలోకి వెళ్దామా? లేదంటూ ఇండిపెంటెండ్గా పోటీకి దిగమంటారా' అని మహీధర్ రెడ్డి కార్యకర్తలను ప్రశ్నించారు. కార్యకర్తల మనసులో వైఎస్ఆర్ సీపీనే ఉండడంతో మహీధర్ రెడ్డి ఇచ్చిన ఆప్షన్లకు ఎవరూ సమాధానం చెప్పలేదు. వైఎస్సార్ సీపీలోకి వెళ్దామని కొందరు అనడంతో ... ఆపార్టీలోకి వెళ్లేవారు ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ ఆయన ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. కార్యకర్తలకు ఏ పార్టీలోకి వెళ్దామని ఆప్షన్లు ఇచ్చినప్పటికీ ఆయన మాటలను బట్టి చేస్తే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేలా కనిపిస్తున్నారని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ సీపీ టికెట్ దక్కదనే ఉద్దేశంతోనే కిరణ్, పవన్, బీజేపీ అని ఆయన ఆప్షన్లు ఇచ్చారని చెబుతున్నారు. పైగా ఆప్షన్లలో పేర్కొన్న పార్టీల గురించలి పెద్దగా చర్చించలేదని కార్యకర్తలు తెలిపారు. -
‘మున్సిపల్’ సమ్మె యథాతథం!
మంత్రి మహీధర్‌రెడ్డితో చర్చలు విఫలం డిమాండ్లు పరిష్కరించాలన్న కార్మికులు ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయిన వైనం సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ చేపట్టిన సమ్మెను కొనసాగించాలని మున్సిపల్ కార్మికులు నిర్ణయించారు. పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డితో సోమవారం జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యంతర భృతిపై అటు మంత్రికి, ఇటు కార్మికులకు అవగాహన కుదరకపోవడంతో చర్చలు విఫలమైనట్టు తెలిపారు. మధ్యంతర భృతిని 50 శాతం ఇవ్వాలని కార్మికులు పట్టుబడుతుండగా, 25 శాతం ఇవ్వడానికి మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. అయితే, తమ వేతనాలు చాలా తక్కువగా ఉన్నందున కనీసం 40 శాతమైనా ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్య కార్డులు ఇచ్చేందుకు మంత్రి అంగీకరించారు. పే రివిజన్ కమిషన్ ఇచ్చే నివేదికలో చివరి గ్రేడు ఉద్యోగులకు చెల్లించే వేతనాలను ఇవ్వడానికి కూడా మంత్రి మహీధర్‌రెడ్డి పచ్చజెండా ఊపారు. కాగా, కార్మికులు పట్టుబడుతున్న మధ్యంతర భృతిపై సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఈ మేరకు ఏఐటీయూసీ నాయకుడు కిర్ల కృష్ణారావు, బీఎంఎస్ నాయకుడు శంకర్, సీఐటీ యూ నాయకుడు పాలడుగు భాస్కర్లు తెలిపారు. మరోపక్క, శనివారం నుంచి కొనసాగుతున్న సమ్మెతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోయి దుర్వాసన అలుముకుంది. పారిశుద్ధ్యంతోపాటు తాగునీటి సరఫరా, వీధి దీపాల సేవలను సైతం కార్మికులు సోమవారం నుంచి నిలిపివేయడంతో ప్రజలు మరిన్ని ఇక్కట్లు పడాల్సి వస్తోంది. -
చర్చలు విఫలం.. సమ్మె యథాతథం
163 మున్సిపాల్టీలు, 19 కార్పొరేషన్లలో నిలిచిపోనున్న పారిశుద్ధ్యం సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులతో మంత్రి మహీధర్‌రెడ్డి శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రంలోని 163 మున్సిపాల్టీలు, 19 మున్సిపల్ కార్పొరేషన్లలో పారిశుద్ధ్య కార్యకలాపాలు స్తంభింప చేస్తున్నామని కార్మిక సంఘాల ప్రతినిధులు వె ల్లడించారు. సోమవారం నుంచి మంచినీరు, వీధి దీపాల కార్యక్రమాలను కూడా బహిష్కరించనున్నట్లు ప్రకటించారు. సుమారు 1.30 లక్షల మంది మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం మంత్రి మహీధర్‌రెడ్డితో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో మున్సిపల్ ఉద్యోగులు సమ్మె చేయాలనే నిర్ణయించారు. కాగా, చర్చలకు కార్మికుల సమస్యల పరిష్కారానికి డిసెంబర్లో నియమించిన కమిటీ చైర్మన్ (జీహెచ్ఎంసీ కమిషనర్), లేబర్ కమిషనర్ ప్రతినిధి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి హాజరుకాలేదు. దీంతో మంత్రి మహీధర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు చర్చలు జరిపి, ప్రతిపాదనలు పంపిస్తే.. వాటిని ఆమోదించే వ్యక్తిని తానని, అధికారులు రానందున ఇప్పుడు చర్చలు సాగించినా ప్రయోజనం లేదని, సోమవారం చర్చిద్దామంటూ మంత్రి వ్యాఖ్యానించారని కార్మిక సంఘాల ప్రతినిధులు చెప్పారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాలతోపాటు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెలో పాల్గొంటారని చెప్పారు. మంత్రితో చర్చలు జరిపిన వారిలో ఏఐటీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ, హెచ్ఎంఎస్, ఇఫ్టూ, టీఆర్ఎస్కేవీ, టీఎన్టీయూసీ సంఘాల ప్రతినిధులు ఉన్నారు. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమ్మెకు మద్దతిస్తున్నట్లు సీపీఐ, ఐఎఫ్టీయూ తెలిపారు. -
ఆస్తిపన్నుపై వడ్డీ మినహాయింపు ఇవ్వం
మంత్రి మహీధర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేసే ప్రసక్తే లేదని పురపాలక మంత్రి మహీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. వడ్డీ మాఫీ వల్ల మునిసిపాలిటీల ఆదాయం తగ్గుతుందని అన్నారు. బకాయిలపై వడ్డీని రద్దు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ప్రభుత్వానికి లే ఖ రాసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల కమిషనర్లతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి వడ్డీ మాఫీ అంశాన్ని స్పష్టం చేశారు. ఆస్తి పన్ను వసూళ్లు ఇంకా యాభై శాతం లోపే ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వంద శాతం ఆస్తిపన్ను వసూళ్లు సాధించాలని కమిషనర్లను ఆదేశించారు. పీడీ అకౌంట్లలో నిధులు ఉన్నా విద్యుత్ చార్జీలు చెల్లించని కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
'ఏడాది తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు'
హైదరాబాద్: మంత్రి ఆనం రామనారాయణ ఛాంబర్లో బొత్స సత్యనారాయణ, మహీధర్‌రెడ్డి తదితరుల సమావేశమయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కీలక నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని మరో ఏడాది పొడిగిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగిపోయిందని, ఇప్పుడున్న ఎమ్మెల్యేలతోనే రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు నడిపిస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ముగ్గురు అభ్యర్థులను బరిలో దింపే అవకాశం ఉంది. టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి వెల్లడించాక నాలుగో అభ్యర్థిని నిలిపే విషయంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోనుంది. -
‘ఐకాన్ ఎస్డబ్ల్యూఎం-2014’ ఎవరికో!
రాష్ట్రంలో పది మున్సిపాలిటీలకు స్థానం విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి, సాలూరు ఈనెల 28 నుంచి 30 వరకూ రాజధానిలో ప్రదర్శన బొబ్బిలి, న్యూస్‌లైన్: చెత్తపై సమరభేరి మోగించి ఆదర్శంగా నిలిచిన పురపాలక సంఘాలు ఇప్పుడు అంతర్జాతీయ అవార్డు కోసం పోటీ పడుతున్నాయి. పురపాలక శాఖ ప్రకటించిన 4వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్(ఐకాన్ఎస్డబ్ల్యుఎం)-2014 కోసం రాష్ర్ట వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆయా పురపాలక సంఘాల్లో అమలవుతున్న ఇంటింటి చెత్త సేకరణ, చెత్తశుద్ధి, సద్వినియోగం వంటివాటిపై అడిగిన ప్రశ్నావళిలో సంతృప్తికరంగా సమాధానం చెప్పిన 10 పురపాలక సంఘాలను ఈ అవార్డుకు పరిశీలన నిమిత్తం ఎంపిక చేశారు. దీంతో ఆయా మున్సిపాలిటీల అధికారులు గత శనివారం హైదరాబాద్‌లో మునిసిపల్ మంత్రి మహీధర్‌రెడ్డి ముందు పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అధికారుల చొరవే కీలకం: కాలువల్లో చెత్తలు పేరుకుపోవడం, ప్లాస్టిక్, పాలిథీన్ వినియోగం ఇష్టారాజ్యంగా ఉండటం, పట్టణాల్లో శుభ్రత లేకపోవడం, పురపాలక సంఘాల్లో నిధుల కొరత వంటివి వెంటాడేవి. మునిసిపాలిటీల కమిషనర్లు, పాలకవర్గాలు ప్రత్యేక చొరవ తీసుకుని అనంతపురం జిల్లా తాడిపత్రి, విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘాలను ఆదర్శంగా తీర్చిదిద్దారు. చెత్తలేని పురపాలక సంఘంగా నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట కూడా ఆదర్శంగా నిలిచింది. ఆదర్శ మునిసిపాలిటీగా బొబ్బిలి: రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బొబ్బిలి పురపాలక సంఘంలో చెత్తశుద్ధి పార్కు ఏర్పాటుతో పాటు ప్లాస్టిక్, వాటర్ ప్యాకెట్ల నిషేధం అమలును ప్రారంభించారు. అప్పటి కమిషనర్ కరుణాకరం ప్రసాద్, అప్పటి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ కృష్ణ రంగారావుల సహాయంతో విజయవంతంగా నడుపుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ మున్సిపాలిటీగా పేరు వచ్చింది. ఇక్కడ అమలవుతున్న ఇంటింటి చెత్త సేకరణ, ప్లాస్టిక్ నిషేధం పరిశీలనకు డిల్లీ నుంచి కూడా ప్రతినిధులు వచ్చి వెళ్లారు. సాలిడ్ వేస్టు మేనేజ్మెంట్ పార్కు నిర్మాణం చేసి గోబర్ గ్యాస్ ఉత్పత్తి, వర్మీ కంపోస్టు, వ్యర్థ పదార్థాల అమ్మకం వంటివి నిర్వహిస్తూ ఆదాయాన్ని పెంచుకోవడంతో బొబ్బిలి మునిసిపాలిటీయే రాష్ట్రంలో ముందంజలో ఉంది. పక్కనే ఉన్న సాలూరు మున్సిపాలిటీ కూడా దీనిని అమలు చేస్తూ ఇప్పుడు బొబ్బిలి సరసన చేరింది. ఈ కార్యక్రమాలను బాగా అమలు చేస్తున్న పురపాలక సంఘాల్లో ప్రస్తు తం అధికారులు, అనధికారులతో కూడిన థర్డ్ పార్టీ పరిశీలన చేస్తుంది. ఈనెల 28 నుంచి 30 వరకూ హైదరాబాద్‌లో సెమినార్లు జరగనున్నాయి. అక్కడ ఎంపికైన పురపాలక సంఘాలన్నీ వారు చేపట్టిన కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, నివేదికలను కమిటీకి అందించాల్సి ఉంటుంది. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూన్సివర్సిటీ ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. ఈ ఏడాది హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీఆర్ అగ్రికల్చరల్ యూనివర్సీటీ ప్రాంగణంలో ఈ ఎంపిక జరగనుంది. (నిరుడు కర్ణాటక రాష్ట్రం మైసూర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.) జనవరి 28 నుంచి 30 వరకూ జరిగే సెమినార్లో 814 మంది డెలిగేట్స్ పాల్గొననున్నారు. అవార్డు పరిశీలనకు రాష్ట్రం నుంచి ఎంపికైన మునిసిపాలిటీలు విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, సాలూరులతో పాటు పలమనేరు, తెనాలి, సూర్యాపేట, తాండూరు, వరంగల్, కోదాడ, కర్నూలు, గుంతకల్లు. -
సీఎం సాక్షిగా కాంగ్రెస్ సభలా.. రచ్చబండ
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ప్రజల సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత ప్రచార పర్వాన్ని భుజానెత్తుకుంది. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏర్పాటుచేసిన రచ్చబండను సొంత బహిరంగసభలా చేపట్టారు. సోమవారం రాయచోటిలో రచ్చబండ కార్యక్రమాన్ని ఇన్చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి నేతృత్వంలో కొనసాగించారు. కాంగ్రెస్ నేతలు మాకం అశోక్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే శివానందరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, పీసీసీ మెంబర్ రాంప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్ నేత హరిప్రసాద్, మాజీ ఎంపీ గునిపాటి రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరెడ్డి, వరదరాజులరెడ్డి, సీఎం సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి తదితరులతోపాటు కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఎర్రగుడి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి లాంటి వారితో సభా వేదిక నిండుకుంది. కలెక్టర్‌లాంటి జిల్లా అత్యున్నత అధికారిని సైతం రెండవ వరుసకు పరిమితం చేశారు. కాంగ్రెస్ మార్క్ పెత్తనం : జిల్లా అధికారులపై ఇన్చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి కాంగ్రెస్ మార్క్ పెత్తనాన్ని ప్రదర్శించారు. ముఖ్యమంత్రి హెలిప్యాడ్ వద్ద జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్, డీఐజీ మురళీకృష్ణ బందోబస్తు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంతలో మంత్రి మహీధర్‌రెడ్డి వాహనం దూసుకురాగా పోలీసు అధికారులు అడ్డుచెప్పారు. తన వాహనాన్నే అడ్డుకుంటారా నేనెవరో తెలియదా? అంటూ ఇన్చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి ఆగ్రహోదగ్ధులయ్యారు. జిల్లా ఎస్పీపై వార్నింగ్ తరహాలో పదజాలాన్ని ఉపయోగించారు. అంతలో అక్కడికి చేరుకున్న కలెక్టర్ శశిధర్‌తో నేనెవరో తెలియని స్థితిలో పోలీసులు ఉన్నారా అని ధ్వజమెత్తారు. -
మున్సిపాలిటీలపై నమ్మకం కలిగించండి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పథకాలను సకాలంలో అందించి ప్రజలకు మున్సిపాలిటీలపై నమ్మకాన్ని కలిగించాలని మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి కమిషనర్లను ఆదేశించారు. గురువారం మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సేవలను సకాలంలో అం దించకపోవడంతో పాటు, సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటికే ము న్సిపాలిటీలపై ప్రజలకు నమ్మకం పో యిందన్నారు. పేదల బాగు కోసం ఏ పథకాన్ని ప్రారంభించినా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమర్థవంతంగా అ మలు చేయలేకపోతున్నామన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన సిటిజన్ సర్వీస్‌ను కూ డా పక్కనబెడితే ఎలా అని, మీకెలా చె ప్పాలో, ఏం చెప్పాలో అర్థం కావడం లేదని మంత్రి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పాలనపరంగా ఎన్ని మం చి పథకాలు ప్రవేశపెట్టినా, అమలు చేసే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుం దన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి, గుంతకల్ ము న్సిపాలిటీని ఆదర్శంగా తీసుకొని రాణిం చాలని సూచించారు. 40 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ వాడకంపై దాడు లు నిర్వహించి, వారం రోజుల్లో పూర్తిగా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇదివరకే వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టగా, చాలావరకు ప్ర జల్లో చైతన్యం వచ్చిందని గుర్తు చేశారు. ఇక వెంటనే వాటిని విక్రయించే వారిపై దాడులు కొనసాగించి కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి ఆదేశించారు. పారిశుధ్య పనుల్లో మహిళలను భాగస్వామ్యం చేసి పనులు వేగవంతంగా చేపట్టాలన్నారు. మహిళాసంఘాలను బలోపే తం చేసేలా వారికి అన్ని వసతులు కల్పిం చాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అమరయ్య, మెప్మా పీడీ పద్మహర్ష, ఇతర కమిషనర్లు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ
పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి వద్ద జరిగిన చర్చలు సఫలం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మూడురోజులుగా కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు తొమ్మిది కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. గురువారం నుంచి విధుల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అదర్‌సిన్హా, ఇన్చార్జి డీఎంఏ అనితా రాజేంద్రన్, అదనపు సంచాలకులు రమేష్‌బాబుతో జరిగిన చర్చల్లో పలు అంశాలపై అంగీకారం కుదిరింది. వేతన సవరణ, కరువుభత్యం, సూపర్వైజర్ల వేతనాల అంశంపై మాత్రం ఈనెల 28న పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డితో జరిగే సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. అయితే చర్చలకు తమను ఆహ్వానించలేదని కనీసం సమాచారం కూడా ఇవ్వలేదంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గుర్తింపు పొందిన సంఘం మాత్రం సమ్మెను కొనసాగించాలని నిర్ణయించింది. అధికారులతో జరిగిన చర్చల అనంతరం కార్మిక సంఘాల ప్రతినిధులు శంకర్(బీఎంఎస్), పాలడుగు భాస్కర్(సీఐటీయూ), కృష్ణారావు(ఏఐసీటీయూ) తదితరులు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. సమ్మె ప్రారంభించిన తరువాత మూడు రోజులుగా జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శితో జరిగిన చర్చల్లో తమ డిమాండ్లపై లిఖితపూర్వకంగా ఆమోదం తెలుపుతూ లేఖ ఇచ్చారని తెలిపారు. సమ్మె కారణంగా గ్రేటర్ హైదరాబాద్ సహా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. దీనికి వర్షాలు తోడవడంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్న ఆందోళనతో కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింపచేసే దిశగా అధికారులు వారి డిమాండ్లపై సానుకూలంగానే వ్యవహరించారు. సమ్మె కారణంగా పేరుకుపోయిన చెత్తను యుద్ధప్రాతిపాదికన తొలగిస్తామని అధికారులకు కార్మిక సంఘాల ప్రతినిధులు హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 వేల మంది కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు తాజా నిర్ణయం వల్ల లబ్ధి చేకూర నుంది. ప్రభుత్వం అంగీకరించిన కార్మికుల డిమాండ్లు ఇవే హా జీహెచ్ఎంసీ కార్మికులకు ఇస్తున్న మాదిరిగా అన్ని కార్పొరేషన్లలోని కాంట్రాక్టు కార్మికులకు నాలుగు లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం. హా దుస్తులు మినహా పర్మినెంట్ కార్మికులకు ఇస్తున్న విధంగా మాస్క్‌లు, నూనె, పాదరక్షలు, చేతితొడుగులు ఇస్తారు. హా కాంట్రాక్టు కార్మికులకు కూడా వారాంతపు సెలవు ఇస్తారు. దీనిని రొటేషన్ పద్ధతిలో వర్తింపచేస్తారు. హా నాలుగు జాతీయ పండుగలతోపాటు మొత్తం ఎనిమిది రోజులు సెలవులు మంజూరు చేస్తారు. హా పర్మినెంట్ కార్మికులకు 6, 12, 18, 24 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుంటే.. వారికి ఆటోమెటిక్ అడ్వాన్స్ ఇంక్రిమెంట్ వర్తింపచేస్తారు. హా కాంట్రాక్టు కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటారు. హా వీధి దీపాలు వేసేవారికి, నీటి సరఫరా సిబ్బంది, డ్రైవర్లు, పంప్ ఆపరేటర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లకు అర్హతలకు అనుగుణంగా వేతనాలు చెల్లిస్తారు. హా క్రమం తప్పకుండా వేతన సవరణ, పర్మినెంట్ కార్మికులకు ఇస్తున్న మాదిరి కరువుభత్యం, జీహెచ్ఎంసీలో కార్మికులకు సూపర్వైజరీ వేతనాల చెల్లింపు అంశాలు, వేతన సవరణ సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ వేతనాల అమలుపై ఈనెల 28వ తేదీన మంత్రి మహీధర్‌రెడ్డి సమక్షంలో చర్చించేందుకు కార్మిక సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. హా పాఠశాలల్లో స్వీపర్లకు పూర్తికాలం వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. హా కాంట్రాక్టు, పర్మినెంట్ కార్మికులకు ఇళ్లస్థలాల విషయంలో ప్రాధాన్యం ఇస్తామని అంగీకరించారు. -
ప్రజలు కోరితే మునిసిపాలిటీలు.. లేదంటే గ్రేటర్లో విలీనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలోని గ్రామ పంచాయతీలను మునిసిపాలిటీలుగా మార్చాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తే తప్ప,.. ఆ గ్రామాలను మునిసిపాలిటీలుగా చేయరాదని ప్రభుత్వం నిర్ణయించింది. మునిసిపాలిటీలుగా వద్దని, పంచాయతీలుగా కొనసాగించాలని జనం కోరిన పక్షంలో ఆ పంచాయతీలన్నిటిని మూకుమ్మడిగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో కలిపేయడానికే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. జీహెచ్ఎంసీలో గ్రామ పంచాయతీల విలీనం నిబంధనల ప్రకారం జరుగలేదని స్పష్టం చేస్తూ హైకోర్టు గతనెలలో విలీనం ఉత్తర్వులను కొట్టేసింది. నిబంధనల ప్రకారం పంచాయతీలకు వుుందు నోటీసులిచ్చి, వారి అభిప్రాయసేకరణ అనంతరం ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయా పంచాయతీలకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. పంచాయతీలను నేరుగా జీహెచ్ఎంసీలో విలీనం చేయడం కంటే, వాటిని ముందుగా నగర పంచాయతీలుగా, లేదా మునిసిపాలిటీలుగా మారుద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి, జౌళి శాఖ మంత్రి ప్రసాదకుమార్ ఉన్నతస్థారుు సవూవేశంలో ప్రతిపాదించినప్పుడు సరేనన్న పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ఇప్పుడు మాత్రం చిన్న మెలికపెట్టారు. ఈ అంశాన్ని ప్రజలు డిమాండ్ చేస్తేనే పరిశీలిద్దావుని అన్నారు. పంచాయతీలను డీనోటిఫై చేయడానికి ముందుగా వాటికి నోటీసులు జారీ చేయాలని కోరుతూ ఫైలును పంచాయతీరాజ్ శాఖకు పంపించారు. జీహెచ్ఎంసీలో విలీనం చేయుద్దంటూ కోర్టుకు వెళ్లిన 16 గ్రామ పంచాయతీల రికార్డులను మాత్రమే హైదరాబాద్ నగర పాలక సంస్థ అధికారులు తిరిగి ఇచ్చేశారు. మిగిలిన 21 పంచాయతీల రికార్డులు ఇంకా జీహెచ్ఎంసీలోనే ఉన్నాయి. వీటిపై ఆయా గ్రామ పంచాయతీల ప్రజలెవరూ కోర్టుకు వెళ్లనందున అవి ఇంకా జీహెచ్ ఎంసీ పరిధిలో ఉన్నట్లేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన నిర్ణయుం నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని, అందుకే ఈ పంచాయతీలన్నిటిని హడావుడిగా గ్రేటర్లో విలీనం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీటిని విలీనం చేయకుండా మునిసిపాలిటీలుగా వూర్పు చేరుుంచేందుకు ఇద్దరు తెలంగాణ మంత్రులు యత్నిస్తున్నారు. అయితే చివరకు ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.