ప్రజలు కోరితే మునిసిపాలిటీలు.. లేదంటే గ్రేటర్‌లో విలీనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలోని గ్రామ పంచాయతీలను మునిసిపాలిటీలుగా మార్చాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తే తప్ప,.. ఆ గ్రామాలను మునిసిపాలిటీలుగా చేయరాదని ప్రభుత్వం నిర్ణయించింది. మునిసిపాలిటీలుగా వద్దని, పంచాయతీలుగా కొనసాగించాలని జనం కోరిన పక్షంలో ఆ పంచాయతీలన్నిటిని మూకుమ్మడిగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)లో కలిపేయడానికే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. జీహెచ్‌ఎంసీలో గ్రామ పంచాయతీల విలీనం నిబంధనల ప్రకారం జరుగలేదని స్పష్టం చేస్తూ హైకోర్టు గతనెలలో విలీనం ఉత్తర్వులను కొట్టేసింది.
నిబంధనల ప్రకారం పంచాయతీలకు వుుందు నోటీసులిచ్చి, వారి అభిప్రాయసేకరణ అనంతరం ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయా పంచాయతీలకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. పంచాయతీలను నేరుగా జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం కంటే, వాటిని ముందుగా నగర పంచాయతీలుగా, లేదా మునిసిపాలిటీలుగా మారుద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి, జౌళి శాఖ మంత్రి ప్రసాదకుమార్ ఉన్నతస్థారుు సవూవేశంలో ప్రతిపాదించినప్పుడు సరేనన్న పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ఇప్పుడు మాత్రం చిన్న మెలికపెట్టారు. ఈ అంశాన్ని ప్రజలు డిమాండ్ చేస్తేనే పరిశీలిద్దావుని అన్నారు.
పంచాయతీలను డీనోటిఫై చేయడానికి ముందుగా వాటికి నోటీసులు జారీ చేయాలని కోరుతూ ఫైలును పంచాయతీరాజ్ శాఖకు పంపించారు. జీహెచ్‌ఎంసీలో విలీనం చేయుద్దంటూ కోర్టుకు వెళ్లిన 16 గ్రామ పంచాయతీల రికార్డులను మాత్రమే హైదరాబాద్ నగర పాలక సంస్థ అధికారులు తిరిగి ఇచ్చేశారు. మిగిలిన 21 పంచాయతీల రికార్డులు ఇంకా జీహెచ్‌ఎంసీలోనే ఉన్నాయి. వీటిపై ఆయా గ్రామ పంచాయతీల ప్రజలెవరూ కోర్టుకు వెళ్లనందున అవి ఇంకా జీహెచ్ ఎంసీ పరిధిలో ఉన్నట్లేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన నిర్ణయుం నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని, అందుకే ఈ పంచాయతీలన్నిటిని హడావుడిగా గ్రేటర్‌లో విలీనం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీటిని విలీనం చేయకుండా మునిసిపాలిటీలుగా వూర్పు చేరుుంచేందుకు ఇద్దరు తెలంగాణ మంత్రులు యత్నిస్తున్నారు. అయితే చివరకు ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.