![Kandukur MLA Maheedhar Reddy Serious on TDP Leaders - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/29/Kandukur-MLA-Maheedhar-Redd.jpg.webp?itok=Cqg_y6Bs)
సాక్షి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నేతలపై కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నేతల నిర్వాకం వల్లే 8 మంది అమాయకులు బలి అయ్యారని మండిపడ్డారు. ప్రచార ఆర్భాటంతో రోడ్డుపై ఫ్లెక్సీలు కట్టారు. టీడీపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టి ప్రమాదానికి కారణమయ్యారు. చేసింది తప్పని తెలుసుకోకుండా పిచ్చిప్రేలాపణలు చేస్తే జనం బుద్ధి చెబుతారని మహీధర్‌రెడ్డి హెచ్చరించారు.
చంద్రబాబు బాధ్యత వహించాలి: డిప్యూటీ సీఎం
చంద్రబాబు ప్రచార పిచ్చితోనే 8 మంది చనిపోయారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. తక్కువ జనాన్ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. కందుకూరు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి' అని మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు.
కందుకూరు ఘటన బాధాకరం: బాలినేని
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఇరుకు సందులో సభ పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు ఘటనలో 8 మంది చనిపోవడం బాధాకరమైన విషయం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment