
'సుజనా చప్పట్లు కొట్టడం సరికాదు'
విజయవాడ : రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లును టీడీపీ సమాధి చేసిందని మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ ఆరోపించారు. ఓటింగ్ రాకుండా బీజేపీ - టీడీపీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. శనివారం విజయవాడలో వట్టి వసంతకుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.... బిల్లును రాజ్యసభ నుంచి లోక్సభకు పంపేటప్పుడు కేంద్రమంత్రి సుజనా చౌదరి చప్పట్లు కొట్టడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ, టీడీపీలను తరిమికొట్టండి అనే నినాదంతో ఆగస్టు 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నట్లు వట్టి వసంతకుమార్ వెల్లడించారు.