
ప్రభుత్వం ఆ విషయం మరిచిపోయిందా?
విజయవాడ: వ్యవసాయ రుణమాఫీ హామీ నుంచి చంద్రబాబు నాయుడు తప్పుకోరాదని రాష్ట్ర మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కోరారు. జూన్ 30లోగా రైతులు వ్యవసాయ రుణాలు చెల్లిస్తే అన్ని రాయితీలు రైతులకు వర్తిస్తాయని తెలిపారు.
కాలం గడిచాక ఇప్పుడు రీషెడ్యూలు చేస్తామంటున్నారని, ఓవర్ డ్యూ రుణాలు రీషెడ్యూల్ కిందకు రావన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయిందా అని ఆయన ప్రశ్నించారు. రైతు రుణమాఫీ -సాగునీటి కొరతపై శుక్రవారం విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమవేశంలో ఆయన పాల్గొన్నారు. రైతు సంఘాల నాయకులు, వివిధ పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.